Edible Oils Rate | సామాన్యులకు ఝలక్ తగలనుంది? రానున్న రోజుల్లో వంట నూనె ధరలు (Cooking Oil) పెరగబోతున్నాయా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. రానున్న కాలంలో వంట నూనె ధరలు పెరగనున్నాని తెలుస్తోంది. ఇదే జరిగితే సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. అసలు ఇంతకీ వంట నూనె (Oil) ధరలు ఎందుకు పెరుగుతాయి? అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీనికి ప్రధాన కారణం ఇండోనేసియా అని చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద పామ్ ఆయిల్ ఉత్పత్తి దారుడిగా ఇండోనేసియా కొనసాగుతోంది. ఇండోనేసియా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. దేశీయంగా డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. డిమాండ్‌న అందింపుచ్చుకోవడానికి ఎగుమతులను తగ్గించుకోవాలని ఇండోనేసియా భావించింది.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్, రూ.3,300 పతనమైన రేట్లు!
ఇండోనేసియా నుంచి భారత్ వార్షికంగా 80 మిలియన్ టన్నుల పామ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దీని వాటా ఏకంగా 40 శాతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండోనేసియా నుంచి దిగుమతులు తగ్గితే.. ఆ ప్రభావం సరఫరాపై పడుతుంది. సరఫరా తగ్గితే.. ధరలు పైకి చేరే ఛాన్స్ ఉంటుంది. ఇండోనేసియా నిర్ణయం వల్ల మన దేశంలో పామ్ ఆయిల్ సహా ఇతర కుకింగ్ ఆయిల్స్ ధరలు 10 శాతం మేర పైకి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ.1కే ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్!
వంట నూనె ధరలు పైకి చేరితే.. ఆ ఎఫెక్ట్ ఇతర ఫుడ్ ఐటమ్స్‌పై కూడా పడుతుంది. దీంతో రంజాన్ ముందు ధరలు మరోసారి భగ్గుమనే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే ఇండోనేసియాలో కూడా వంట నూనె ధరలు పెరిగాయి. ఈ క్రమంలో సరఫరా పెంచాలని, తద్వారా రేట్లు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్ కంపెనీకలు ఆదేశాలు జారీ చేసింది.
ఇండోనేసియా ఎగుమతి నిబంధనల ప్రకారం చూస్తే.. డొమెస్టిక్ మార్కెట్ ఆబ్లిగేషన్ కింద కంపెనీలకు ఆయిల్ ఎగుమతి కోసం లైసెన్స్ జారీ చేస్తారు. ఈ రూల్స్‌లో భాగంగా కంపెనీలు దేశీయ సరఫరాకు ఆరు రెట్లు ఆయిల్‌ను ఎగుమతి చేయొచ్చు. అయితే ఇండోనేసియా మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగుమతులను మూడో వంతు తగ్గించేసింది. తర్వాత నోటీసులు వచ్చే వరకు ఇదే రూల్ అనుసరించాలని సూచించింది. దీంతో ఆయిల్ కంపెనీలు వంట నూనెను ఎగుమతి చేయకుండా దేశీ మార్కెట్‌లోనే ఎక్కువగా విక్రయించాల్సి ఉంటుంది. ఇండోనేసియా ప్రతి ఏటా 480 మిలియన్ టన్నుల పామ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. గ్లోబల్ ప్రొడక్షన్ 750 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది సగం కన్నా ఎక్కువే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cooking oil, Edible Oil, Money, Oil prices, Price Hike