Home /News /business /

EDIBLE OIL PRICES WILL RISE AGAIN DUE TO INDONESIA BAN ON PALM OIL EXPORTS SS

Cooking Oil Prices: సామాన్యులకు మరో షాక్... మళ్లీ పెరగనున్న వంట నూనెల ధరలు

Cooking Oil Prices: సామాన్యులకు మరో షాక్... మళ్లీ పెరగనున్న వంట నూనెల ధరలు
(ప్రతీకాత్మక చిత్రం)

Cooking Oil Prices: సామాన్యులకు మరో షాక్... మళ్లీ పెరగనున్న వంట నూనెల ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Cooking Oil Prices | సామాన్యులకు షాకుల మీద షాకులు తగుల్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, వంటనూనెలు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు మరోసారి వంటనూనెల (Edible oil prices) ధరలు పెరగబోతున్నాయి.

ప్రజలకు మరో షాక్ తగలనుంది. వంట నూనెల ధరలు (Cooking Oil Prices) మళ్లీ పెరగనున్నాయి. ఇందుకు కారణం ఇండోనేషియా తీసుకున్న నిర్ణయమే. ఇండోనేషియా ఏప్రిల్ 28 నుంచి పామాయిల్ ఎగుమతులను (Palm Oil Exports) నిషేధించనుందని ఆ దేశాధ్యక్షులు ప్రకటించారు. పామాయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే వంట నూనె కొరతను ఇండోనేషియా ఎదుర్కుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద దేశాల్లో ఇండోనేషియా మొదటిది. పామాయిల్ ఎగుమతుల్లో కీలక దేశమైన ఇండోనేషియా పామాయిల్ ఎగుమతుల్ని నిషేధించడంతో ఆ ప్రభావం ఇతర దేశాలపై పడనుంది.

ఆగ్నేయాసియా ద్వీపసమూహ దేశాల్లో ఒకటైన ఇండోనేషియా నవంబర్ నుంచి పామ్ ఆయిల్ ఆధారిత వంట నూనె కొరతను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలను క్యాష్ చేసుకునేందుకు తయారీదారులు ఎగుమతుల వైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. దీంతో ఇండోనేషియాలో పామాయిల్ కొరత ఏర్పడుతోంది. అక్కడ కూడా వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి. ఏర్పడుతున్న కొరత, పెరుగుతున్న ధరలు సామాజిక ఉద్రిక్తతలను రేకెత్తిస్తాయనే భయంతో ఇండోనేషియా ఎగుమతుల్ని నిషేధిస్తోంది.

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే

వంటనూనెల ముడిపదార్థాలతో పాటు వంటనూనె ఎగుమతిని ప్రభుత్వం నిషేధిస్తుందని, తర్వాతి గడువు నిర్ణయించే వరకు నిషేధం కొనసాగుతుందని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రకటన విడుదల చేశారు. దేశంలో వంట నూనెలు సరసమైన ధరలకు సమృద్ధిగా ఉండేలా ఈ విధానం అమలును స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు.

ఇండోనేషయా అధికారులు జనవరిలో పామాయిల్ ఎగుమతులపై పరిమిత ఆంక్షలను ప్రవేశపెట్టడంతో పాటు ధరలను పరిమితం చేశారు. ఆహార పదార్థాల ధరలు పెరుగుతుండటంతో కొందరు ఇండోనేషియన్లకు నగదు రాయితీలను కూడా ప్రకటించారు. కానీ మార్కెట్లు, కిరాణా దుకాణాలలో సరుకులు దొరకడం కష్టతరంగా మారింది. చాలా ప్రదేశాలలో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. పామాయిల్ ఉత్పత్తిదారులకు ఎగుమతి అనుమతులు ఇచ్చేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖలోని ఒక అధికారి అవినీతికి పాల్పడ్డారని అటార్నీ జనరల్ కార్యాలయం ఆరోపించింది.

SBI: ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన ఛాన్స్... రూ.9,00,000 ప్రైజ్ మనీ

ఇండోనేషియాలోని పరిస్థితుల ప్రభావం భారతదేశంపైనా ఉండనుంది. ఇండోనేషియా నుంచి ఎక్కువగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా, చైనా ఉన్నాయి. ఇండోనేషియా ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న సగం పామాయిల్‌ను ఇండియా, చైనా కొంటున్నాయి. ఇప్పుడు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతుల్ని నిషేధించడంతో భారతదేశానికి పామాయిల్ దిగుమతులు తగ్గిపోనున్నాయి. పామాయిల్‌తో వంటనూనెలు తయారు చేయడంతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాలు, సౌందర్య సాధనాలు, బయోఫ్యూయెల్స్ కోసం ఉపయోగిస్తుంటారు.

ఇండోనేషియా నుంచి సరఫరా నిలిచిపోతే భారతదేశానికి ప్రతి నెలా దాదాపు 4 మిలియన్ టన్నుల పామాయిల్ కొరత ఏర్పడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారతదేశపు సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా నెలకు దాదాపు 100,000 టన్నులకు తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు పామాయిల్ దిగుమతులు కూడా తగ్గితే వంటనూనెల ధరలు మరింత పెరగనున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Cooking oil, Edible Oil, Indonesia, Oil prices, Price Hike, Sunflower oil

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు