news18-telugu
Updated: November 21, 2020, 2:57 PM IST
ఆవనూనెతో ప్రయోజనాలు
నిత్యవసర వస్తువులైన బంగాళాదుంప, ఉల్లిపాయ ధరలు పెరిగిన తరువాత, ఇప్పుడు పెరుగుతున్న వంటనూనె ధరలు సామాన్యుల బడ్జెట్ను అమాంతం పెంచేశాయి. అన్ని రకాల నూనెలైన వేరుశనగ, ఆవ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెల సగటు ధరలు భారీగా పెరిగాయి. సోయాబీన్, పొద్దుతిరుగుడు చమురు ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. అయితే వంటనూనెల ధరలు పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రభుత్వం వీటి ధరలను తగ్గించే మార్గాలను పరిశీలిస్తోంది.
వంట నూనెల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకోండిపామాయిల్ భారతదేశంలో దిగుమతి అవుతుంది, కానీ లాక్డౌన్ కారణంగా, మలేషియా వంటి దేశాలలో దాని ఉత్పత్తి తగ్గింది. వీటితో పాటు విత్తనాల ధరలు కూడా పెరిగాయి. అయితే, ప్రభుత్వ స్థాయిలో ధరను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రైస్ మానిటరింగ్ సెల్ నుండి పొందిన గణాంకాలు ప్రకారం, ఆవ నూనె సగటు ధర గురువారం లీటరుకు 120 రూపాయలు నమోదు కాగా, గత సంవత్సరం లీటరుకు 100 రూపాయలుగా ఉంది. పామాయిల్ నూనె ధర ఏడాది క్రితం 75.25 గా ఉండేది, ఇప్పుడు అది కిలోకు 102.5 కి పెరిగింది. సోయాబీన్ నూనె సగటు ధర లీటరుకు 110 చొప్పున అమ్ముడవుతుండగా, 2019 అక్టోబర్ 18 న సగటు ధర 90 రూపాయలు నమోదయ్యింది. పొద్దుతిరుగుడు, పామాయిల్ విషయంలో కూడా ఇదే ధోరణి కనిపించింది.
సెప్టెంబరులో ధరలను కూడా పెరిగాయి..
వంటనూనెలు పామోలిన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ధరలు సెప్టెంబరులో 15 శాతం పెరిగాయి. మరోవైపు ఆవ నూనె, పొద్దుతిరుగుడు నూనె ధరలు 30 నుంచి 35 శాతం పెరిగాయి. పామాయిల్ ధరల పెరుగుదల ఇతర నూనెల ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించాలా అని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Published by:
Krishna Adithya
First published:
November 21, 2020, 2:57 PM IST