ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ Edelweiss Tokio Life Insurance తాజాగా ఓ కొత్త టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. Total Protect Plus అనే ఈ సంపూర్ణమైన పాలసీ.. బీమా చేసిన వ్యక్తి, కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసానిస్తుంది. ఈ టోటల్ ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్ అన్ని అవసరాలను తీరుస్తూ.. పాలసీదారులు లేదా అతని మొత్తం కుటుంబానికి రక్షణగా నిలుస్తుందని ఎడెల్‌వైస్ సంస్థ తెలిపింది. అనుకోని విపత్తు సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసా అందించేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని తెలిపారు Edelweiss Tokio Life Insurance ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభ్రజిత్ ముఖోపాధ్యాయ్. గత దశాబ్ద కాలంగా బీమా పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా మహమ్మారి ప్రజలందరికీ జీవిత బీమా ప్రాముఖ్యతను తెలిసేలా చేసింది. అందుకే ఈ సరికొత్త పాలసీని ప్రారంభించామని సుభ్రజిత్ వివరించారు.
కీలక ప్రయోజనాలు
1. ఈ ప్లాన్ 100 సంవత్సరాల వయస్సు వరకు కవరేజీ అందిస్తుంది.
పాలసీ మెచ్యూరిటీ తర్వాత మీరు చెల్లించిన మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి పొందవచ్చు.
పాలసీ వ్యవధిలో దురదృష్టవశాత్తు మీరు మరణిస్తే బెటర్ హాఫ్ బెనిఫిట్ కింద మీ జీవిత భాగస్వామికి కవరేజీ అందిస్తుంది.
రెగ్యులర్ పే లేదా 5/7/10/15/20 సంవత్సరాల వ్యవధిలో పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు.
పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరం ప్రీమియంపై 6% తగ్గింపు అందిస్తోంది.
ఈ పాలసీపై ముఖోపాధ్యాయ్ మాట్లాడుతూ ‘‘టోటల్ ప్రొటెక్ట్ ప్లస్‌తో, పాలసీదారునికి, అతని కుటుంబ సభ్యులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా మీరు కుటుంబానికి ఏకైక సంపాదకుడైతే.. మీ జీవిత భాగస్వామి, పిల్లల ఆర్థిక స్థిరత్వానికి ఇది భరోసానిస్తుంది. ఈ పాలసీ కింద బెటర్ హాఫ్ బెనిఫిట్, Child's Future Protect Benefit అనే రెండు ఆప్షన్లను అందిస్తుంది. దురదృష్టవశాత్తు పాలసీదారుడు మరణించినప్పుడు అతని జీవిత భాగస్వామి, పిల్లలకు ఇది ఆర్థిక భరోసానిస్తుంది” అని తెలిపారు.
బెటర్ హాఫ్ బెనిఫిట్ ఆప్షన్
దురదృష్టవశాత్తు కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకే వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ పాలసీని ప్రారంభించారు. పాలసీదారుడికి మరణానంతరం బెటర్ హాఫ్ బెనిఫిట్ కింద అతని జీవిత భాగస్వామికి జీవితాంతం బీమా కవరేజీ అందిస్తుంది.
Child's Future Protect Benefit
Child's Future Protect Benefit కింద పాలసీదారుల పిల్లల భవిష్యత్తుకు భరోసానిస్తుంది. కుటుంబంలో తల్లి లేదా తండ్రి చనిపోతే ఆ పిల్లల చదువు, ఇతర అవసరాలకు ఈ పాలసీ భరోసానిస్తుంది. పాలసీదారుడి పిల్లల వయస్సు 25 సంవత్సరాలు వచ్చే వరకు ఇది రక్షణగా నిలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business