మీపై ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి. జీవిత బీమాలు కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో కరోనా మహమ్మారి తెలియజేసింది. ఈ క్రమంలోనే కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు అందించడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఎడెల్‌వైస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. టోటల్ ప్రొటెక్ట్ ప్లస్ అనే ఓ సంపూర్ణమైన పాలసీని ప్రకటించింది. ఈ టోటల్ ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్ అన్ని అవసరాలను తీరుస్తూ.. పాలసీదారులు లేదా అతని మొత్తం కుటుంబాన్ని కవర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
1. లైఫ్ కవర్ ఆప్షన్: ఈ ప్లాన్ 100 సంవత్సరాల వయస్సు వరకు కవరేజీ అందిస్తుంది.
2. ప్రీమియం రిటర్న్ ఆప్షన్: పాలసీ మెచ్యూరిటీ తర్వాత మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి పొందవచ్చు.
3. లైవ్ లాంగ్ ఆప్షన్: ఇది పాలసీదారులకు ఎంచుకున్న వయస్సు నుంచి డబ్బు అందిస్తుంది. పాలసీదారుడు 60 లేదా 65 సంవత్సరాలను స్కీమ్‌లో భాగంగా ఎంచుకోవచ్చు. ఎంచుకున్న సమయం నుంచి బీమా మొత్తంలో కొంత శాతం డబ్బు పొందవచ్చు.
ATM New Rule: ఏటీఎంలో డబ్బులు లేవా? రూ.10,000 ఫైన్ చెల్లించనున్న బ్యాంకులు
Toll Plaza: వాహనదారులకు గుడ్ న్యూస్... త్వరలో హైవేలపై టోల్ ప్లాజాలు ఉండవు
4. పాలసీదారులకు అదనపు ప్లాన్‌లను ఎంచుకునే అవకాశం ఉంటుంది: చైల్డ్ ఫ్యూచర్ ప్రొటెక్ట్ బెనిఫిట్. బెటర్ హాఫ్ బెనిఫిట్.
5. చైల్డ్ ఫ్యూచర్ ప్రొటెక్ట్ బెనిఫిట్ కింద పాలసీదారులు అదనపు బీమా మొత్తంతో బీమా మొత్తాన్ని పెంచి పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు. ఈ ప్రయోజనం చైల్డ్ కవరేజ్ వ్యవధిలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి.
6. బెటర్ హాఫ్ బెనిఫిట్ కింద పాలసీదారులు చనిపోయిన తర్వాతనే భాగస్వామికి కవరేజీ అందుతుంది. పాలసీదారుల భాగస్వామి వయసు 10 తక్కువగా లేదా సమానంగా ఉంటేనే ఈ బెనిఫిట్ అందుతుంది.
PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
IRCTC: ఐఆర్‌సీటీసీ బిజినెస్ ఆఫర్... నెలకు రూ.80,000 సంపాదించండి ఇలా
లైఫ్ కవర్ ఆప్షన్ కింద కనిష్ట హామీ మొత్తం రూ. 25,00,000 లభిస్తుంది. ప్రీమియం రిటర్న్ ఆప్షన్ కింద కనిష్ట హామీ మొత్తం రూ. 10,00,000 అందుతుంది. ‘లైవ్ లాంగ్’ ఆప్షన్ ఎంపిక చేసుకున్న వారికి కనీస హామీ మొత్తం రూ. 25,00,000 అందుతుంది. గరిష్ట బీమా మొత్తానికి ఎటువంటి పరిమితులు లేవని కంపెనీ తెలిపింది.
అన్ని ప్లాన్ వేరియంట్‌ల కోసం పాలసీదారుడు కనీసం మొత్తం రూ. 3,000 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలలకు రూ.2,000 చెల్లించవలసి ఉంటుంది. ఇక కనీస త్రైమాసిక ప్రీమియం రూ .1,250 ఉండగా.. నెలవారీ ప్రీమియం రూ. 300గా ఉంది. ఈ పాలసీ కొనుగోలుదారులకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
లైఫ్ కవరేజి ఆప్షన్ కింద 65 సంవత్సరాల తర్వాత లిమిటెడ్ పే పొందొచ్చు. ఇదే ఆప్షన్ కింద 55 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ పే పొందొచ్చు. ప్రీమియం రిటర్న్ ఆప్షన్ పెంచుకుంటే 60 సంవత్సరాల తర్వాత పరిమిత చెల్లింపులు పొందొచ్చు. ఇదే ఆప్షన్ కింద 50 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చెల్లింపులు పొందొచ్చు. లైవ్ లాంగ్ ఆప్షన్ తో 60- 50 ఏళ్ళ వయసు వద్ద కొంత మొత్తం పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, Life Insurance, Personal Finance