Home /News /business /

EDELWEISS MUTUAL FUND LAUNCHES FOCUSED EQUITY FUND UMG GH

Edelweiss Mutual Fund: ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ లాంచ్‌ చేసిన ఎడెల్వైస్ మ్యూచువల్ ఫండ్.. దీని ప్రత్యేకతలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎడెల్వైస్ (Edelweiss) మ్యూచువల్ ఫండ్ జులై 12న ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌(Focused Equity Fund)ను లాంచ్‌ చేసింది. ఇది బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కస్టమర్ (B2C) విభాగాలతో సహా 25-30 స్టాక్‌లలో పెట్టుబడులు పెడుతుంది. జులై 12 నుంచి 25 వరకు సబ్‌స్క్రిప్షన్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

ఇంకా చదవండి ...
ఎడెల్వైస్ (Edelweiss) మ్యూచువల్ ఫండ్ జులై 12న ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌(Focused Equity Fund)ను లాంచ్‌ చేసింది. ఇది బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కస్టమర్ (B2C) విభాగాలతో సహా 25-30 స్టాక్‌లలో పెట్టుబడులు పెడుతుంది. జులై 12 నుంచి 25 వరకు సబ్‌స్క్రిప్షన్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఫండ్ బెంచ్‌మార్క్ NIFTY500 TRI. ఎడెల్వైస్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ రెండింటినీ అందిస్తుంది. తాజా ఫండ్‌ను CIO-ఈక్విటీస్ త్రిదీప్ భట్టాచార్య, ఎడెల్వైస్ ఏఎమ్‌సీ, ఫండ్ మేనేజర్ అభిషేక్ గుప్తా నిర్వహిస్తారు.

దీని గురించి ఎడెల్వైస్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా మాట్లాడుతూ.. ‘వ్యాపారాల అభివృద్ధికి సంబంధించి ఉత్తమ దశలో భారతదేశం ఉంది. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందుతున్న తయారీ రంగం, డిజిటలైజేషన్‌ వంటివి అందుకు కారణాలుగా చెప్పవచ్చు. భవిష్యత్తు వృద్ధిపై ఆధిపత్యం చెలాయించే కొన్ని కీలక అవకాశాలు బ్రాండ్‌లు, మార్కెట్ షేర్ గెయినర్లు, ఇన్నోవేటర్‌లు, డిస్ట్రప్టర్‌ల వంటి పెట్టుబడి అవకాశాలతో ముడిపడి ఉంటాయని నమ్ముతున్నాం. వీటిని సముచితంగా ఉపయోగించుకోవడానికి, ఈ మూడు పెట్టుబడి అవకాశాలలో ఉన్న కంపెనీలకు కేంద్రీకృతమైన ఎక్స్‌పోజర్‌ని తీసుకునే ఎడెల్వైస్ ‌ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభిస్తున్నాం. కొత్త ఫండ్‌లను ప్రారంభించడంలో జాగ్రత్తగా బెస్ట్‌ ఆప్షన్‌లను ఎంచుకుంటాం. గత సంవత్సరం, మార్కెట్‌లు, వాల్యుయేషన్‌ల స్థితిని చూసి.. ఎలాంటి ఈక్విటీ ఫండ్‌లను తీసుకురాలేదు. అయితే, ప్రస్తుత మార్కెట్ ల్యాండ్‌స్కేప్, గణనీయమైన కరక్షన్‌ తర్వాత ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో.. ఈ NFOని తీసుకొస్తున్నాం.’ అని చెప్పారు.

 ఇదీ చదవండి: యూరప్ మార్కెట్‌లో మన బ్యాగులకు ఫుల్ డిమాండ్.. మొత్తం ఒక్క విలేజ్ నుంచే వెళ్తాయంటా..! ఆ బ్యాగులను చూసేద్దామా..


* పెట్టుబడిదారుల పోర్టిఫోలియోకు ప్రత్యేక విలువ
ఎడెల్వైస్ ‌ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ CIO-ఈక్విటీస్ త్రిదీప్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘వివిధ రకాల కారణాలతో ఇండియా ఎకానమీ బలంగా పెరిగే సూచనలు ఉన్నాయి. గృహ ఆదాయం, సహాయక ప్రభుత్వ పాలసీలు, పెరుగుతున్న వినియోగం, మ్యానుఫాక్యరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డిమాండ్‌ వంటి అనేక అంశాలు బలమైన బిజినెస్‌, పెట్టుబడి అవకాశాలను కల్పిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎడెల్వైస్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను ప్రారంభిస్తున్నాం. ఇది ఎంపిక చేసిన పెట్టుబడి అవకాశాలకు క్యూరేటెడ్ ఎక్స్‌పోజర్ ద్వారా పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలకు ప్రత్యేక విలువను జోడించడానికి రూపొందించాం. అంటే బ్రాండ్లు, మార్కెట్ షేర్ గెయినర్లు, ఇన్నోవేటర్లు, డిస్రప్టర్స్‌ను భాగం చేస్తాం.’ అని చెప్పారు.



పైన పేర్కొన్న కారణాలతో భారతదేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఇప్పటికే ఉన్న, అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని, తమదైన ఫుట్‌ప్రింట్‌ను ఎక్స్‌ప్యాండ్‌ చేయాలని ఆశిస్తున్నట్లు త్రిదీప్‌ భట్టాచార్య చెప్పారు. స్ట్రాంట్‌ ఆపరేటింగ్‌ లెవరేజ్‌(Strong Operating Leverage) కలిగిన కంపెనీలు మార్కెట్ వాటాను పొందవచ్చని, ఆదాయాల పెరుగుదల, ఎక్స్‌పాన్షన్‌ను సాధించవచ్చని పేర్కొన్నారు. వేగవంతమైన ఆవిష్కరణతో, ఇప్పటికే ఉన్న ఎకోసిస్టమ్‌లను పక్కనపెట్టి విభిన్నంగా ఎదిగే కొత్త కంపెనీలు రావాలని ఆశిస్తున్నామని, ఫండ్‌ను ప్రస్తుతం ఇన్నోవేటవ్‌ ఇండియా అభివృద్ధిలో భాగం కానున్న అన్ని అవకాశాలలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నామని త్రిదీప్‌ వివరించారు.
Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, Development, Mutual Funds, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు