నేటి నుంచి మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...మీ డబ్బును డబుల్ చేసే పథకం...కేవలం 3 రోజులే...త్వరపడండి...

Bharat ETF: భారత్ బాండ్ ఇటిఎఫ్ రెండో బ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బాండ్ల కొనుగోలు జూలై 17 న ముగుస్తుంది. దీనిని ఎడెల్విస్ అసెట్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కొత్త ఫండ్లలో రూ .1,000 నుండి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు. డీమాట్ లేని పెట్టుబడిదారులు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ పథకం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

Krishna Adithya | news18-telugu
Updated: July 14, 2020, 2:48 PM IST
నేటి నుంచి మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్...మీ డబ్బును డబుల్ చేసే పథకం...కేవలం 3 రోజులే...త్వరపడండి...
(File)
  • Share this:
Bharat ETF Bond: భవిష్యత్ ఆర్థిక భద్రతకు సంబంధించిన అనేక ప్రతీ ఒక్కిరికి చింత ఉంటుంది. ముఖ్యంగా మీ డబ్బును మంచి రిటర్న్ చేసే ఒక అద్భుతమైన పథకం గురించి తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అయితే చాలా మంది డబ్బు భద్రంగా ఉండటం కోసం చాలా మంది రియల్ ఎస్టేట్ మీదనో, బంగారం, షేర్లు ఇలా పెట్టుబడులు పెడుతుంటారు. కొంతమంది లాభసాటి బిజినెస్ లో కూడా పెట్టుబడి పెడుతుంటారు. కానీ రియల్ ఎస్టేట్ లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మీ పెట్టుబడి కూడా తిరిగి రాకపోవచ్చు.

ఇక బంగారం మీద కూడా మీరు అనుకున్న రిటర్న్ రావడం కష్టమే..బంగారం మీద తరుగు, ఇతర చార్జీలు అంటూ మీ లాభాన్ని షాపు వాళ్లు తీసేసుకుంటారు.. మరి షేర్ మార్కెట్ లో కూడా డబ్బు పెట్టడం ఒక రకంగా రిస్కే...ఎందుకంటే ఒక రోజు లాభం వస్తే మరో రోజు భారీ నష్టాలు వస్తుంటాయి. మరి ఇంకెక్కడ డబ్బులు పెడితే మీ డబ్బు డబుల్ అవ్వడంతో పాటు...భద్రంగా ఉంటుంది..అని ఆలోచిస్తున్నారా...అయితే వెంటనే త్వరపడండి...కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మీ డబ్బును డబుల్ చేయడానికి ఒక అద్భుతమైన పథకం ప్రవేశపెట్టింది. అదే భారత్ ఈటీఎఫ్ బాండ్...

ముందుగా భారత్ ఈటీఎఫ్ బాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం...కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం భారత్ బాండ్ ఇటిఎఫ్ రెండవ విడత జూలై 14 న సబ్ స్క్రిప్షన్ మొదలైంది. దీని ద్వారా రూ 14 వేల కోట్ల వరకు సేకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వ సంస్థలైన BHEL, NTPC, BDL, మిధాని లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీ డబ్బును దేశ అభివృద్ధి కోసం వాడుతారు. అంతేకాదు మీకు రిటర్న్ లో డబుల్ చేసి ఇవ్వడం ఈ ఈటీఎఫ్ బాండ్ ప్రత్యేకత...

ఇది దేశంలో మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇందులో తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు. కాగా ఈ ఫండ్ జూలై 17 న మూసివేయనున్నారు. గతంలో 2019 డిసెంబర్‌లో భారత్ బాండ్ ఇటిఎఫ్ సిరీస్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా 12 వేల కోట్లు సేకరించారు.

భారత్ బాండ్ ఇటిఎఫ్ రెండో బ్యాచ్ జూలై 14 న ప్రారంభం కానుంది. బాండ్ల కొనుగోలు జూలై 17 న ముగుస్తుంది. దీనిని ఎడెల్విస్ అసెట్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కొత్త ఫండ్లలో రూ .1,000 నుండి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు. డీమాట్ లేని పెట్టుబడిదారులు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ పథకం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, దానిపై మీకు 7.58 శాతం రాబడి లభిస్తుంది, అప్పుడు 10 సంవత్సరాలలో మీ డబ్బు రూ . 2,07,642 కు పెరుగుతుంది. అయితే దీనిపై మీరు రూ. 7,836 ను పన్నుగా చెల్లించాలి. అంటే మీకు 1,99,806 రూపాయలు లభిస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్ దీర్ఘకాలిక పన్ను పరంగా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. కన్జర్వేటివ్ డెట్ ఫండ్ పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం https://www.bharatbond.in/ క్లిక్ చేయండి...
Published by: Krishna Adithya
First published: July 14, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading