యెస్ బ్యాంక్ మాజీ ఎండీ & సీఈవో రానా కపూర్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి సోదాలు చేశారు. ముంబైలోని వర్లిలో ఉన్న సముద్ర మహల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. యెస్ బ్యాంక్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీంతో సంస్థను బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో బ్యాంక్లో విత్ డ్రా పరిమితులను విధించాయి. ఈనెలాఖరు వరకు ఖాతాదారులు కేవలం రూ.50వేల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇచ్చాయి. ఈ క్రమంలో ఖాతాదారులు ఆందోళనలో ఉన్నారు. అయితే, వారి డబ్బులకు ఎలాంటి ఢోకా లేదని అటు ఆర్బీఐ, ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చాయి.
డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఎస్ బ్యాంక్ వద్ద ఉపసంహరణ పరిమితిని పరిమితం చేసిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ప్రైవేట్ రుణదాతను పునరుద్ధరించడానికి సెంట్రల్ బ్యాంక్ త్వరలో "వేగంగా చర్యలు" తీసుకుంటుందని చెప్పారు. "ఎస్ బ్యాంక్ పునరుద్ధరించడానికి ఒక పథకాన్ని ఆర్బిఐ త్వరలోనే అమలు చేయడం మీరంతా వేగంగా చూస్తారని" అని దాస్ ఒక కార్యక్రమంలో చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:March 06, 2020, 22:50 IST