2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ఆర్థిక సర్వే విడుదలైంది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి 6 నుంచి 6.8 శాతం మధ్యలో ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత జీడీపీ మెరుగైన దిశలోనే పయనమవుతోందని పేర్కొంది. అయితే, దీంతో పాటు ప్రభుత్వం సాధించిన, సాధించాల్సిన లక్ష్యాలు, ఎదురయ్యే సవాళ్లను గురించి ఆర్థిక సర్వే వెల్లడించింది. అవేంటో తెలుసుకుందాం.
- కొనుగోలు శక్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ద్రవ్య వినిమయం(ఎక్స్‌ఛేంజ్ రేట్)లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతే.
- 2023-24 ఆర్థిక సవంత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.5శాతంగా ఉండనుంది. 2021-22లో ఈ వృద్ధి 8శాతంగా ఉండేది. ప్రస్తుతం 7శాతంగా(2022-23) ఉంది.
- జీడీపీ 6-6.8శాతం మధ్య పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరమైన మార్పులు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది.
- కరోనా మహమ్మారి నుంచి భారత్ త్వరగా కోలుకోగలిగింది. దేశీయ పెట్టుబడుల్లో పెరుగుదల, దేశీయంగా డిమాండ్ ఏర్పడటం వంటివి ఇందుకు దోహదపడ్డాయి.
- దీర్ఘకాలం పాటు రుణ రేట్లు అధికంగా కొనసాగే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం కొనసాగుతుండటం వల్ల ఈ గడువు మరింత పెరగొచ్చు.
- అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నందున రూపాయి మారకం విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.
- ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8శాతంగా ఉండనుంది. అయితే ఇది పెట్టుబడులను బలహీన పరచడంలో, ప్రైవేట్ కన్జంప్షన్‌ని తగ్గించడంలో ఏ మాత్రం ప్రభావం చూపలేదు.
- ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అత్యవసర రుణ హామీ పథకం’(ECLGS) సత్ఫలితాలు ఇచ్చింది. MSMEలు వేగంగా కోలుకున్నాయి. ఫలితంగా 2022 జనవరి నుంచి నవంబరు మధ్య కాలంలో రుణాల వృద్ధి 30.5శాతానికి చేరుకుంది.
- 2022లో అత్యధిక ఆర్థిక సహకారం పొందిన దేశంగా భారత్ ఘనత సాధించింది. 100బిలియన్ డాలర్ల మేర ఉపశమనాలు భారత్‌కు దక్కాయి.
- వాహనాల అమ్మకాల్లో జపాన్, జర్మనీ దేశాలను వెనక్కి నెట్టి భారత్ 3వ స్థానానికి దూసుకెళ్లింది. 2022 డిసెంబరులో భారత్ మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది. జీడీపీలో 7.1శాతం వాటా వాహన రంగానిదే కావడం గమనార్హం. 2021 ఏడాది చివరి నాటికి వాహన రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.7కోట్ల ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి.
- ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల ధరలు అధికంగా పెరుగుతున్నాయి. కాబట్టి కరెంటు ఖాతా లోటు పెరిగే అవకాశం ఉంది.
Budget 2023: కేంద్ర బడ్జెట్ కి కౌంట్ డౌన్ షూరు.. బడ్జెట్‌లో ఉపయోగించే పదాల గురించి మీకు తెలుసా?
Hero Scooter: ఇండియన్ మార్కెట్లోకి హీరో మాస్ట్రో జూమ్ స్కూటర్ లాంచ్.. ధర, ఫీచర్లు, ప్రత్యేకతలివే..
* ఐంఎంఎఫ్ నివేదిక
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.1శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(International Monetary Fund) అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.8శాతంగా ఉందని తెలిపింది. వచ్చే ఏడాదికి వృద్ధి రేటులో తరుగుదల ఉన్నప్పటికీ భారత్ వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ నివేదికలో వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2022-23