ట్రంప్ శాంతి జపం..లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌తో అమెరికా యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ శాంతి జపాన్ని జపించడం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.

news18-telugu
Updated: January 9, 2020, 4:42 PM IST
ట్రంప్ శాంతి జపం..లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కాస్త చల్లబడడం అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. దేశియ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ వారం నమోదైన భారీ నష్టాలను కొంతమేర భర్తీ చేసుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 635 పాయింట్ల లాభం(1.55 శాతం)తో 41,452 పాయింట్ల దగ్గర క్లోజ్ కాగా...నిఫ్టీ కూడా 190 పాయింట్ల లాభం(1.58శాతం)తో 12,215 పాయింట్ల దగ్గర ముగిసింది.

ఐటీ రంగ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లో దూసుకుపోయాయి. ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణిదాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం రావచ్చన్న భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఇరాన్ క్షిపణిదాడుల్లో తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ప్రకటన చేసిన ట్రంప్...తాము శాంతిని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం లేదన్న భావన అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.
First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు