Home /News /business /

Biryani Leaf Business: నెలకు రూ. లక్షల్లో సంపాదన రావాలంటే.. ఇలా చేయండి..

Biryani Leaf Business: నెలకు రూ. లక్షల్లో సంపాదన రావాలంటే.. ఇలా చేయండి..

బిర్యానీ ఆకులు

బిర్యానీ ఆకులు

Biryani Leaf Business:: భారతదేశంతో పాటు యూరప్, అమెరికా లాంటి దేశాలలో అనేక రకాల వంటకాలు చేసేటప్పుడు బిర్యానీ ఆకులను ఉపయోగిస్తారని విషయం అందరికి తెలిసిందే. ఇక మన హైదరాబాద్ లో అయితే బిర్యానీ ప్రియులు ఎక్కువగా ఉంటారు. బిర్యానీ వంటల్లో ఆకులు లేకపోతే ఆ టేస్ట్ అస్సలు రానేరాదు. ఇక్కడ బిర్యానీ ఆకు సాగు గురించి తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
    భారతదేశం(India)తో పాటు యూరప్, అమెరికా(America) లాంటి దేశాలలో అనేక రకాల వంటకాలు చేసేటప్పుడు బిర్యానీ(Biryani) ఆకులను ఉపయోగిస్తారని విషయం అందరికి తెలిసిందే. ఇక మన హైదరాబాద్ లో అయితే బిర్యానీ ప్రియులు ఎక్కువగా ఉంటారు. బిర్యానీ వంటల్లో ఆకులు లేకపోతే ఆ టేస్ట్ అస్సలు రానేరాదు.
    అయితే తక్కువ పెట్టుబడి పెట్టి.. ఎక్కువ డబ్బులు సంపాదిచాలనే వాళ్లు ఈ బిర్యానీ ఆకు పంట ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

    Weight Loss Exercise Tips: లావు తగ్గాలని కొత్తగా వ్యాయామం చేస్తున్నారా.. ఈ 9 టిప్స్ పాటిస్తూ చేయండి..


    వ్యవసాయంలో సంప్రదాయ పండలకు మంచి డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగానే రైంతాంగం కూడా పండలను పండిస్తూ.. మార్కెట్లో విక్రయిస్తుంటారు. అమెరికా, యూరప్, భారతదేశం సహా అనేక దేశాలలో అనేక రకాల వంటకాలు చేసేటప్పుడు బిర్యానీ ఆకులను ఉపయోగిస్తారని విషయం అందరికి తెలిసిందే. ఇది సూప్‌లు, వంటకాలు, మాంసం, మత్స్య , అనేక కూరగాయలలో ఉపయోగిస్తారు. ఈ బిర్యానీ ఆకు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగం. ఇది చాలా వరకు భారతదేశం, రష్యా, మధ్య అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఉత్తర అమెరికా, బెల్జియంలో ఉత్పత్తి అవుతుంది. ఈ బిర్యానీ ఆకు పంట ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు.

    Online Payments: ప్రతీది ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారా.. వారి కోసం గూగుల్ కీలక ప్రకటన.. తప్పక తెలుసుకోండి..


    బిర్యాని ఆకులకు సంబంధించి సాగు చేయాలనకుంటే.. కేవలం 50 మొక్కలను నాటి పెంచి పెద్ద చేస్తే చాలు. ఇలా 50 మొక్కలు నాటితే ప్రతి ఏడాది రూ.1.50 లక్షల నుంచి 2.50 లక్షల వరకు సంపాదన ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. జీవితాంతం సంపాదించుకోవచ్చు. చేయాల్సిందల్లా నాటిన మొక్కను కాపాడుకుంటూ ఉండటమే. మొక్క పెరిగేకొద్దీ మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. మరొక విషయం ఏంటంటే.. ఈ పంట సాగు కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తోంది. ఈ బిర్యానీ ఆకు సాగు వేస్తున్నట్లు వ్యవసాయ అధికారులకు చెప్పాలి.

    Zodiac Signs: ఆనందంలో వీళ్లకు మించిన వాళ్లు లేరు.. ఆ సంతోషం కూడా ఈ రాశుల వారికి ఇలా వస్తుందట..


    వాళ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి 30 శాతం వచ్చే విధంగా సహాయం చేస్తారు. బిర్యానీ ఆకుల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా 30 శాతం సబ్సిడీని రైతులకు అందజేస్తారు . ఇక బిర్యానీ ఆకులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇలా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. ఇలా ఏడాదికి 50 మొక్కల నుంచి 2.50 లక్షలు సంపాదించుకోవచ్చు. అంటే ఒక ఎకరం సాగు చేస్తే..ఇలాంటి 50 మొక్కలు ఎన్ని ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కొన్ని వందల మొక్కలు ఉంటాయి. వాటి ద్వారా నెలకు రూ. లక్షల్లో సంపాదించుకోవచ్చు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Biryani, Business, Business Ideas

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు