Senior Citizen FD : ద్రవ్యోల్బణం ప్రభావం తో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2022 మే నుంచి రెపో రేటును నాలుగు సార్లు పెంచింది. పెరుగుతున్న రుణ రేట్ల మధ్య, తక్కువ-రిస్క్ తీసుకోగల సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇప్పటి వరకు చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించాయి. తాజాగా DCB బ్యాంక్ ఎఫ్డీ రేట్లపై సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక వడ్డీ చెల్లింపు ఆప్షన్లు ఎంచుకొనే అవకాశం ఉందని తెలిపింది. వడ్డీని నేరుగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకొనే సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది.
సీనియర్ సిటిజన్లకు 8.25 వడ్డీ
DCB బ్యాంక్ 36 నెలల కాలానికి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 700 రోజుల నుంచి 36 నెలలలోపు టెన్యూర్‌కి చేసిన డిపాజిట్లపై కూడా బ్యాంక్ 8.25 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు డీసీబీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో మూడేళ్లపాటు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. వడ్డీగా రూ.27,760 అందుతుంది. దీనికి సంబంధించి ఇటీవల డీసీబీ బ్యాంక్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. సీనియర్ సిటిజన్లు తమ గోల్డెన్ ఇయర్స్‌లో మెరుగైన రాబడిని అందుకునేందుకు తాజా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఎలాంటి సంపాదనకు నోచుకోని సమయంలో సీనియర్ సిటిజన్లకు ఆర్థిక పరిపుష్టిని అందజేసేందుకు ఆకర్షణీయమైన వడ్డీలు అందిస్తున్నట్లు తెలిపింది.
Business Idea: అరటి పొడి బిజినెస్ గురించి మీకు తెలుసా? రోజుకు రూ.4 వేల ఆదాయం.. పెట్టుబడి చాలా తక్కువ
ఎక్కువ కాలం ఎఫ్డీలను బుక్ చేసుకునే అవకాశం
సీనియర్ సిటిజన్ ఎఫ్డీ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు అధిక ఆదాయాన్ని అందిస్తుందని బ్యాంక్ తెలిపింది. DCB బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లు 700 రోజులకు మెచ్యూర్ అయ్యేలా రూ.2 కోట్ల కంటే తక్కవగా చేసిన డిపాజిట్లపై, సంవత్సరానికి 7.60 శాతం వడ్డీని పొందవచ్చని పేర్కొంది. 700 రోజుల నుంచి 36 నెలల కంటే తక్కువ కాలానికి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు వివరించింది.
సీనియర్ సిటిజన్లకు ఎక్కువ కాలం ఎఫ్డీలను బుక్ చేసుకునే అవకాశం ఉందని డీసీబీ బ్యాంక్ పేర్కొంది. ఉదాహరణకు సంవత్సరానికి 7.75 శాతం వడ్డీతో 36 నెలల నుంచి 60 నెలల కంటే ఎక్కువ టెన్యూర్‌కు ఇన్వెస్ట్ చేయవచ్చని తెలిపింది. DCB ఫిక్స్డ్ డిపాజిట్లో ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు పెరుగుతుందని బ్యాంక్ తెలిపింది. ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fixed deposits, Senior citizens