• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • EARN RS 10000 EVERY MONTH THROUGH THIS STATE BANK OF INDIA SCHEME HERE FULL DETAILS NS GH

SBI Annuity Scheme: రూ.5 లక్షల పెట్టుబడితో ప్రతినెలా రూ.10 వేలు.. SBI నుంచి మరో అద్భుతమైన స్కీమ్..

SBI Annuity Scheme: రూ.5 లక్షల పెట్టుబడితో ప్రతినెలా రూ.10 వేలు.. SBI నుంచి మరో అద్భుతమైన స్కీమ్..

ప్రతీకాత్మక చిత్రం

మీరు ప్రతినెలా అదనంగా ఆదాయం పొందాలనుకుంటున్నారా?.. అయితే, మీకు నిజంగా ఇది శుభ వార్తే. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI మీకోసం అద్భుతమైన స్కీమ్ ని అందిస్తుంది.

  • Share this:
మీరు ప్రతినెలా అదనంగా ఆదాయం పొందాలనుకుంటున్నారా?.. అయితే, మీకు నిజంగా ఇది శుభ వార్తే. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI మీకోసం అద్భుతమైన స్కీమ్ ని అందిస్తుంది. మీరు దీనిలో ఒకసారి డబ్బులు పెడితే చాలు, తర్వాత ప్రతినెలా మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. మరి ఆ స్కీమ్ ఎంటి? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ప్రతినెలా ఆదాయం పొందాలనుకునే వారు SBI యాన్యుటీ స్కీమ్ లో చేరవచ్చు. ఈ SBI యాన్యుటీ స్కీమ్ లో 36, 60, 84 లేదా 120 నెలల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఎంత కాలపరిమితి ఎంచుకున్నా సరే పెట్టుబడిపై వడ్డీ రేటు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఐదేళ్లపాటు ఫండ్ డిపాజిట్ చేస్తే, అప్పుడు, ఐదేళ్ల కాలానికి వర్తించే వడ్డీ రేటు ప్రకారమే మీకు వడ్డీ లభిస్తుంది. ఎవరైనా ఈ స్కీమ్ లో చేరి ప్రయోజనాలను పొందవచ్చని SBI స్పష్టం చేసింది.

రూ. 10,000 నెలవారీ ఆదాయం
ఒక పెట్టుబడిదారుడు ప్రతి నెలా రూ.10,000 ఆదాయాన్ని కోరుకుంటే, అప్పుడు అతను రూ. 5,07,964 ఫిక్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా జమ చేసిన మొత్తంపై 7 శాతం వడ్డీ లభిస్తుంది. తద్వారా ప్రతి నెలా సుమారు రూ.10,000 పొందవచ్చు. మీరు రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాలనుకుంటే, భవిష్యత్తులో మీ ఆదాయాన్ని మరింత పెంచుకోవాలనుకుంటే ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

పెట్టుబడి నియమాలు
SBI యాన్యుటీ స్కీమ్ లో మీరు ప్రతి నెలా కనిష్టంగా రూ.1,000 నుంచి జమ చేయవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు. కాగా, నిర్థిష్ట సమయం తర్వాత జమ చేసిన మొత్తంపై వడ్డీ ప్రారంభమవుతుంది. ఈ స్కీమ్ భవిష్యత్తులో క్రమంగా ఆదాయం పొందాలనుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పదవీ విరమణ చేసిన తర్వాత నెల నెలా ఆదాయం కావాలని కోరుకునే వారి కోసం, భవిష్యత్తులో పెరిగే అవసరాల కోసం నెల నెలా ఎక్కువ ఆదాయం కోసం ప్రయత్నిస్తున్న వారి కోసం ఈ స్కీమ్ చాలా బాగుంటుంది.

చిన్న మొత్తంతో పెట్టుబడి ప్రారంభించండి
సాధారణంగా, మధ్యతరగతి ప్రజల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉండవు. అటువంటి వారికి రికరింగ్ డిపాజిట్లో పెట్టుబడి అనువుగా ఉంటుంది. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో ప్రతి నెలా ఇందులో డిపాజిట్ చేయవచ్చు. రికరింగ్ డిపాజిట్లో ప్రతినెలా చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా ఒకేసారి ఈ మొత్తాన్ని సేకరించి యాన్యుటీ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా, దానిపై వడ్డీ లభించి మంచి రాబడిని అందిస్తుంది. సామాన్య ప్రజలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు