Business Ideas: రూ.50వేల పెట్టుబడితో కోట్ల సంపాదన... వ్యాపారం పూర్తి వివరాలు

రూ.50వేల పెట్టుబడితో కోట్ల సంపాదన... వ్యాపారం పూర్తి వివరాలు

Business Ideas: డబ్బు పెద్దగా లేని దీప్తీ... జస్ట్ రూ.50,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించింది. ఆ వ్యాపారం సంవత్సరంలో రూ.12 కోట్లకు చేరింది.

  • Share this:
    Business Ideas: రొటీన్ ఉద్యోగాలు చేసి విసిగిపోయారా... సరే మీరు స్వయంగా సొంత వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీ చేతిలో రూ.50,000 ఉండాలి. డిజిటల్ హోర్డింగ్ బిజినెస్... మిమ్మల్ని కోటీశ్వరులుగా చెయ్యగలదు. ఇది డిజిటల్ యుగం. ఈ రోజుల్లో ప్రతీదీ ఆన్‌లైన్ ఇంటర్నెట్‌తో ముడిపడి ఉంటోంది. ఆన్‌లైన్ హోర్డింగ్ వ్యాపారం అలాంటిదే. న్యూస్18 టీమ్‌తో కలిసి... goHoardings.Com పేరుతో ఔట్ డోర్ అడ్వె్ర్టైజింగ్ ఏజెన్సీ స్టార్టప్ వ్యాపారం ప్రారంభించిన దీప్తీ అస్వాస్తీ శర్మ... ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. రూ.50వేల పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించిన ఆమె... ప్రస్తుతం నెలకు రూ.కోటి సంపాదిస్తున్నారు. మరి ఆ వ్యాపారం ఎలా ప్రారంభించాలి? ఎంత డబ్బు సంపాదించగలం? ఆ వివరాలు తెలుసుకుందాం.

    దీప్తీ అస్వాస్తీ వయసు 27 ఏళ్లు మాత్రమే. 2016లో ఆమె ఆన్‌లైన్ హోర్డింగ్స్ బిజినెస్ ప్రారంభించారు. ఆమె దగ్గర పెద్దగా డబ్బు లేదు. సొంతంగా రూ.50,000 పెట్టుబడి పెట్టారు. కానీ సంవత్సరంలో ఆమె వ్యాపారం విలువ రూ.12 కోట్లు అయ్యింది. సంవత్సరం తర్వాత ఆమె టర్నోవర్ రూ.20కోట్లకు చేరింది. తన అనుభవాన్ని షేర్ చేసుకున్న ఆమె... "నేను చిన్న మొత్తం రూ.50వేలతో 2016లో డిజిటల్ హోర్డింగ్స్ వ్యాపారం ప్రారంభించాను. ఆ ఐడియా విజయవంతం అయ్యింది. చాలా తక్కువ సమయంలో ఇది క్లిక్ అయ్యింది." అని తెలిపారు.

    online business
    రూ.50వేల పెట్టుబడితో కోట్ల సంపాదన... వ్యాపారం పూర్తి వివరాలు


    "ఈ ఫీల్డ్ ప్రారంభంలో కొంత గందరగోళంగా ఉంటుంది. క్రమంగా అర్థం అవుతుంది. పనంతా ఇంటి దగ్గరే డిజిటల్ రూపంలో ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఐతే... ఈ వ్యాపారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది" అని దీప్తీ తెలిపారు.

    ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీరు మార్కెటింగ్ అండ్ టెక్నాలజీపై ముందుగా అవగాహన కలిగించుకోవాలి. తర్వాత మీకంటూ సొంత వెబ్‌సైట్ తెరచుకోవాలి. దాన్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. ఎవరైతే తమ వ్యాపారానికి యాడ్స్ చేయించుకోవాలి అనుకుంటున్నారో... వారిని మీరు కనిపెట్టాలి. వాళ్లను కలవాలి. మాట్లాడాలి. వారికి వీలయ్యేలా నెట్‌లో హోర్డింగ్‌ను తయారుచెయ్యాలి. అది వారికి చూపించి... వారికి నచ్చేలా చెయ్యాలి.

    దీప్తీ పనితీరు నచ్చిన కస్టమర్లు... ఆమె వెబ్‌సైట్‌లోకి ఎంటరయ్యేవారు. వారికి కావాల్సిన హోర్డింగ్ ఎంచుకొనేవారు. మీరు కూడా మీ ఏరియాలో, సిటీలో ఎక్కడెక్కడ హోర్డింగులు పెట్టవచ్చో గమనించాలి. అక్కడ హోర్డింగులు పెట్టుకోవాడనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తద్వారా మీకంటూ పర్మిషన్ లభిస్తుంది. ఆ తర్వాత కస్టమర్లతో మాట్లాడి ఆయా రోడ్లు, ట్రాఫిక్ ప్రదేశాల్లో హోర్డింగులు పెట్టుకునేలా వారిని ఒప్పించాలి. ఆ తర్వాత అక్కడ హోర్డింగ్ ఏర్పాటు చెయ్యాలి. హోర్డింగ్‌కి నెలకు రూ.లక్ష చొప్పున అద్దె తీసుకుంటున్నారు దీప్తీ. మీరు కూడా అదే విధంగా డీల్స్ మాట్లాడుకొని... కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. దీప్తీ వెబ్‌సైట్‌ని పూర్తిగా పరిశీలించండి. ఇదీ లింక్. https://www.gohoardings.com

    ఇది కూడా చదవండి: Business Ideas: రూ.5,000తో వ్యాపారం ప్రారంభించండి... నెలకు రూ.50,000 సంపాదన

    ప్రారంభంలో మీరు నెలకు 5 హోర్డింగులు ఏర్పాటు చేసినా... మీకు నెలకు రూ.5లక్షలు వస్తాయి. క్రమంగా వాటి సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. కస్టమర్ల సంఖ్యను కూడా పెంచుకోవాలి. తద్వారా ఎన్ని హోర్డింగులు ఉంటే... అతలా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే మీ వెబ్ సైట్ పేరు కూడా అందరి నోటిలో నానుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: