హోమ్ /వార్తలు /బిజినెస్ /

Earn Money Online: ఆ నంబర్ గల కరెన్సీ నోటు మీ దగ్గర ఉంటే... రూ.3 లక్షలు మీవే

Earn Money Online: ఆ నంబర్ గల కరెన్సీ నోటు మీ దగ్గర ఉంటే... రూ.3 లక్షలు మీవే

ఆ నంబర్ గల కరెన్సీ నోటు మీ దగ్గర ఉందా?

ఆ నంబర్ గల కరెన్సీ నోటు మీ దగ్గర ఉందా?

Earn Money Online: కష్టపడి డబ్బు సంపాదించడం ఒక రకమైతే... తెలివిగా ఈజీ మార్గంలో సంపాదించడం మరో రకం. అందుకు ఆన్‌లైన్ ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు వీలవుతోంది. ఎలాగో తెలుసుకుందాం.

  Earn Money Online: మనం వాడే కరెన్సీ నోట్లపై నోట్ విలువ ప్రకారం రూ.5, రూ.10, రూ.20, రూ.100 ఇలా ఉంటాయని మనకు తెలుసు. వీటితోపాటూ... మరికొన్ని నంబర్లు ఆ నోట్లపై ఉంటాయి. అవి నోట్ల సిరీస్ నంబర్లు. ఆ నంబర్లలో "786" ఉంటే... మీరు లక్షలు సంపాదించవచ్చు. ఈ 786 అనేది ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన సంఖ్య. అందువల్ల ఈ సంఖ్య ఉండే నోట్లను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెంబర్లు పక్కపక్కనే ఉండాలి తప్ప... మధ్యలో వేరే నంబర్లు రాకూడదు. అలాంటి ఒకే నంబర్‌గా ఉన్న నోట్లకే ఎక్కువ విలువ ఉంటుంది.

  ముస్లింలు మాత్రమే కాదు... పాత నోట్లను సేకరించేవారు కూడా ఇలాంటి నోట్లను ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు. వీటికి చాలా డిమాండ్ ఉండటంతో... ఇవి ఈజీగా దొరకట్లేదు. ఐతే... చాలా మంది తమ దగ్గర ఇలాంటి నోటు ఉందన్న విషయం కూడా తెలియక... దాన్ని సాధారణంగానే సామాన్లు కొన్నప్పుడు వేరే వారికి ఇచ్చేస్తున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో ఆ నోటుతో లక్షలు వస్తాయని తెలిస్తే అలా చెయ్యరు.

  మీ దగ్గర ఉన్న నోట్లలో దేనిపైనైనా 786 నంబర్ ఉంటే... దాన్ని మీరు ఆన్‌లైన్‌లో ఈబే (E-bay) వెబ్‌సైట్‌లో అమ్ముకోవచ్చు. అక్కడ మీరు రూ.3 లక్షల దాకా సంపాదించే ఛాన్స్ ఉంది. ఎలాగో తెలుసుకోండి. ముందుగా www.ebay.comలో లాగిన్ అవ్వండి. సెల్లర్ (seller)గా రిజిస్టర్ చేసుకోండి. తర్వాత మీ దగ్గరున్న నోటును రెండువైపులా ఫొటోలు తీసి... అప్‌లోడ్ చెయ్యండి. దాని కింద మీ పేరు, మొబైల్ నంబర్ ఇచ్చి... ఎంత ధరకు అమ్మదలిచారో రేటు ఇవ్వండి. ఆ నోట్ కావాలనుకునేవారు మీకు కాల్ చేసి... డీల్ మాట్లాడుకుంటారు. మీరు చెప్పే ధర నచ్చితే... కొనేస్తారు.

  ఈబేలో నోట్ల అమ్మకం (image credit - Ebay)

  ఈబేలో మాత్రమే కాదు... ఇంకా చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి. అవి https://indiancoinmill.com ఇందులో పాత నోట్లు, నాణేలను అమ్ముకోవచ్చు. అలాగే... https://www.collectorbazar.com/indian-notes/ ఈ వెబ్‌సైట్లో పాత నోట్లు నాణేలతోపాటూ... పాత స్టాంపులను కూడా అమ్ముకోవచ్చు. కొనుక్కోవచ్చు. Coinbazzar.com వెబ్‌సైట్‌ కూడా ఇలాంటిదే. అక్కడ కూడా అమ్మవచ్చు, కొనవచ్చు.

  ఇది కూడా చదవండి: పచ్చ, కెంపు, రూబీ, రత్నం, వజ్రం... ఏ నెలలో పుట్టిన వారు ఏ రాయి తొడగాలి?

  అందరికీ తెలిసిన అమెజాన్ (https://www.amazon.in/s?k=old+notes&i=toys&ref=nb_sb_noss) ఈ-కామర్స్ సైట్‌లో కూడా అమ్ముకోవచ్చు. ఇందుకు కొన్ని కండీషన్లను ఒప్పుకోవాల్సి ఉంటుంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Cash, Earn mon, Earn money online, Earning old coins, Money

  ఉత్తమ కథలు