హోమ్ /వార్తలు /బిజినెస్ /

Earn Money Online: ఈ 50పైసలు మీ దగ్గరుంటే రూ.లక్ష మీవే

Earn Money Online: ఈ 50పైసలు మీ దగ్గరుంటే రూ.లక్ష మీవే

ఈ 50పైసలు మీ దగ్గరుంటే రూ.లక్ష మీవే (ప్రతీకాత్మక చిత్రం)

ఈ 50పైసలు మీ దగ్గరుంటే రూ.లక్ష మీవే (ప్రతీకాత్మక చిత్రం)

Earn Money Online: మన ఇళ్లలో పాత రూపాయి, అర్థరూపాయి నాణేలు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాయి. వాటిలో గనుక ఆ అర్థరూపాయి ఉందంటే... రూ.లక్ష గెలుచుకునే ఛాన్స్ కొట్టేయొచ్చు.

Earn Money Online: 2011 నాటి ఆ అర్థరూపాయి నాణేనికి ఆ వెబ్‌సైటులో విపరీతమైన డిమాండ్ ఉంది. వెంటనే కొనేసేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ ఆ నాణేలు ఎవరి దగ్గర ఉన్నాయన్నది తేలాల్సిన అంశం. ఈ కరోనా కాలంలో డబ్బులకు చాలా కొరత ఉంది. చేతిలో ఉన్న కొంత డబ్బూ.. కరోనాకో, ఇంకోదానికో అయిపోతున్నాయి. కొత్తగా అప్పులు ఎవరూ ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాలు రావట్లేదు. ఇలాంటి సమయంలో... ఆన్‌లైన్ కరెన్సీ సేల్ చాలా మందికి డబ్బులు ఇస్తోంది. కొంత మంది లక్షలు సంపాదిస్తున్నారు. తమ దగ్గర అరుదైన కరెన్సీ నోట్లు లేదా నాణేలు ఉంటే చాలు... వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారు. నెలకు ఒక్కటి అమ్మినా చాలు... రూ.లక్ష నుంచి రూ.7 లక్షల దాకా సంపాదిస్తున్నారు.

రూ.లక్ష సంపాదించే ఛాన్స్:

ప్రస్తుతం 50 పైసలు నాణెం చెలామణీలో లేదు. అసలా నాణేలు చూద్దామన్నా కనిపించట్లేదు. 2011 తర్వాత ప్రజలు వాటిని వాడటం మానేశారు. ఎందుకంటే... రూపాయికే ఏదీ రావట్లేదు... ఇక అర్థరూపాయికి ఏమొస్తుంది అని ప్రజలు వాటిని వ్యాపారుల నుంచి తీసుకోవడం మానేశారు. వ్యాపారులు కూడా ఇవ్వడం మానేశారు. అలా... అది కనుమరుగైంది. ఇప్పుడు ఆ పాత కాయిన్లను కొనేందుకు... నాణేల సేకరణ (numismatics)ను హాబీగా ఎంచుకున్నవారు సిద్ధంగా ఉన్నారు. ఒక్కో కాయిన్‌కీ రూ.లక్ష ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. అలా ఇస్తే వారికేం లాభం అనే డౌట్ రావచ్చు. వారికి మంచి లాభం ఉంటుంది. అలాంటి పాత నాణేలతో వారు బొమ్మల లాంటి కళాఖండాలు తయారుచేసి... విదేశాల్లో వేలంలో అమ్ముతారు. అక్కడ వారికి కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంటుంది.

ఎక్కడ అమ్మాలి?

ప్రస్తుతం ఎక్కువ మంది OLX వెబ్‌సైట్ (https://www.olx.in)లో అమ్ముతున్నారు. ఎందుకంటే... ఎక్కువ మంది కాయిన్లు ఆ వెబ్‌సైట్‌లోనే కొంటున్నారు. దానితోపాటూ... మరికొన్ని సైట్లు ఉన్నాయి. వాటిలో కూడా పాత నోట్లు, పాత కాయిన్లూ అమ్ముకోవచ్చు. అవి...

https://indiancoinmill.com/ (ఇందులో దేశీయ కరెన్సీ, నాణేలు అమ్ముకోవచ్చు)

https://coinbazzar.com/ (ఈ సైటులో కాయిన్లు, నోట్లు, పాత పుస్తకాలు, వింత నాణేలు, విదేశీ కరెన్సీ అన్నీ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు)

https://www.quikr.com/home-lifestyle/sell-coins+Coins-Stamps+India+z204f (ఇక్కడ కూడా కాయిన్లు, నోట్లు అమ్ముకోవచ్చు. స్టాంపులను కూడా అమ్ముకునే ఛాన్స్ ఉంది)

ఇది కూడా చదవండి: Business Ideas: రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.30వేల లాభం

ఏం చెయ్యాలి?

మీ దగ్గర పాత కాయిన్లో, నాణేలో ఉంటే... ముందుగా ఈ సైట్లలో సైన్ ఇన్ అవ్వాలి. ఆ తర్వాత కాయిన్ లేదా నోటును రెండువైపులా ఫొటోలు తియ్యాలి. అప్‌లోడ్ చెయ్యాలి. ఆ కాయిన్ ప్రత్యేకత ఏంటో చెప్పాలి. దాన్ని ఎంతకు అమ్మదలిచారో రేటు ఫిక్స్ చెయ్యాలి. అలాగే మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. దాన్ని కొనాలి అనుకునవారు మీకు కాల్ చేస్తారు. తద్వారా డీల్ మాట్లాడుకొని దాన్ని అమ్ముకోవచ్చు. టిప్ ఏంటంటే.. ఫొటోలు అందంగా చూడచక్కగా ఉంటే... వెంటనే కొనే ఛాన్స్ ఉంటుంది.

First published:

Tags: Coin bazaar, Coins, Earn money, Earn money online, Earning old coins

ఉత్తమ కథలు