news18-telugu
Updated: December 23, 2020, 4:14 PM IST
ప్రతీకాత్మకచిత్రం
పాత కరెన్సీ నోట్లు, నాణేలను కొనేందుకు కొందరు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సిరీస్ లు, చిహ్నాలు ఉన్న నోట్లను సేకరించడం లక్కీగా కొందరు భావిస్తుంటారు. అలాంటి నోట్లు మీవద్ద ఉంటే లక్షధికారులే అని చెప్పాలి. అలాంటి నోట్లను Online ద్వారా విక్రయించే వీలుంది. ప్రస్తుతం ఆన్ లైన్ లో 26 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఒక రూపాయి కరెన్సీ నోటును ఆపివేసింది. అయితే వాటి ముద్రణను ప్రస్తుతం జనవరి 1, 2015 నుండి మళ్ళీ ప్రారంభం కానుంది. అయితే ఈ నోట్ కొత్త అవతారంలో మార్కెట్లోకి వచ్చింది. అయితే, పాత నోట్లకు మాత్రం ఇంకా డిమాండ్ తగ్గలేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఒక రూపాయి నోట్లు అమ్ముడవుతున్నాయి. స్వాతంత్ర్యానికి ముందు ఉన్న ఒకరూపాయి నోట్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. దాని బిడ్ 7 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. మీ వద్ద కూడా అలాంటి నోట్లు ఉంటే అది మిమ్మల్ని మిలియనీర్ చేస్తుంది.

ప్రతీకాత్మకచిత్రం
ఈ నోట్ ప్రత్యేకత ఏమిటి?
7 లక్షల రూపాయలు పలుకుతున్నఈ ఒక రూపాయి నోటు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అప్పటి గవర్నర్ జెడబ్ల్యు కెల్లీ సంతకం చేయడమే అని చెప్పాలి. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న ఏకైక ఒక్క రూపాయి నోటు ఇది. 80 సంవత్సరాల నోటును బ్రిటిష్ ఇండియా 1935 లో జారీ చేసింది. ఈబే వెబ్ సైటులో అమ్మకానికి ఉన్న ఈ నోటును కొనుగోలు చేసేందుకు మంచి డిమాండ్ ఉంది.
ఇక 1949 సంవత్సరంలో ముద్రించిన మరో ఒక రూపాయినోటు 9999 రూపాయలు పలుకుతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆర్థిక కార్యదర్శి కె.ఆర్. మెమన్ సంతకం ఈ నోట్లో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే 1949 లో భారత రాజ్యాంగం ఆమోదించబడినప్పుడే ఈ నోట్ జారీ చేశారు.
Published by:
Krishna Adithya
First published:
December 23, 2020, 4:13 PM IST