Home /News /business /

EARN MONEY BY TAKING THIS COMPANY IPO SHARES YOU TOO CAN BECOME A MILLIONAIRE BY INVESTING RUPEES 290 HERE IS THE DETAILS NK

Earn Money: స్టాక్ మార్కెట్‌లో రూ.290 పెట్టుబడి పెట్టండి.. లక్షాధికారులు అవ్వండి.. ఇలా

స్టాక్ మార్కెట్‌లో రూ.290 పెట్టుబడి పెట్టండి.. లక్షాధికారులు అవ్వండి.. ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

స్టాక్ మార్కెట్‌లో రూ.290 పెట్టుబడి పెట్టండి.. లక్షాధికారులు అవ్వండి.. ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Earn Money: ఇండియాలో కరోనా తగ్గుతుంటే... స్టాక్ మార్కెట్లు క్రమంగా దూసుకెళ్తున్నాయి. పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన సమయం అంటున్నారు ఇన్వెస్టర్లు. మరి ఆ కోటీశ్వరుల కల ఎలా సాధ్యమో తెలుసుకుందాం.

    Earn Money: స్టాక్ మార్కెట్ అనగానే ఒకప్పడుు ఉండే భయాలు ఇప్పుడు లేవు. ప్రజలు నేర్చుకొని మరీ... స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారు. కొందరైతే... రోజువారీ ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. ఐతే... జూన్ 23 బుధవారం నుంచి ఓ అద్భుతమైన అవకాశం రాబోతోంది. ఈ అవకాశాన్ని అందుకొని... తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించేందుకు వీలవుతుంది. IPO సెగ్మెంట్‌లో ఈ సంవత్సరం ఇప్పటికే చాలా కంపెనీలు రాగా... తాజాగా మరో కంపెనీ అడుగుపెడుతోంది. అదే అగ్రికల్చర్-కెమికల్ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్ (India Pesticides). జూన్ 23 నుంచి IPO మెంబర్‌షిప్ స్టార్ట్ అవుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

    3 రోజులు ఛాన్స్:
    ఈ IPOకి సంబంధించి జూన్ 25 వరకూ డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. అంటే జూన్ 23, 24, 25. మూడు రోజులు ఛాన్స్ ఉంది. కంపెనీ స్టేట్ మెంట్ ప్రకారం... జూన్ 22న ఇన్వెస్టర్లు షేర్ల కోసం బిడ్ వేయవచ్చు. ఇండియా పెస్టిసైడ్స్ కంపెనీ IPO ధర ఒక్కో షేర్‌కీ రూ.290 నుంచి రూ.298 మధ్య ఫిక్స్ చేశారు. ఈ కంపెనీ షేర్లు... అటు బీఎస్ఈ (BSE), ఇటు ఎన్‌ఎస్‌ఈ (NSE)లో లిస్ట్ అవుతాయి.


    రూ.600 కోట్ల ఐపీఓ:
    ఇండియా పెస్టిసైడ్స్ కంపెనీ విలువ రూ.700 కోట్లు. మరోలా చెప్పాలంటే... ఈ IPO ద్వారా కంపెనీ... రూ.600 కోట్లను స్టాక్ మార్కెట్ నుంచి రాబట్టాలి అనుకుంటోంది. మిగతా రూ.100 కోట్లకు సంబంధించి మరో తాజా ఇష్యూ జారీ చేయాలనుకుంటోంది. కంపెనీ ప్రమోటర్ అగర్వాల్... రూ.261.4 కోట్లకు అమ్మే ప్రతిపాదన తెచ్చారు. అలాగే... షేర్ హోల్డర్లకు రూ.418.7 కోట్ల విలువైన షేర్లను అమ్మాలనుకుంటున్నారు.


    కంపెనీ ఎలాంటిది?
    ఇండియా పెస్టిసైడ్స్ కంపెనీ... వ్యవసాయ ఉత్పత్తుల్లో టెక్నాలజీని వాడి పరిశోధనలు, అభివృద్ధికి బాటలు వేస్తోంది. ప్రధానంగా ఇది వ్యవసాయ ఆధారిత గ్రీకెమికల్ టెక్నాలజీ కంపెనీ... పరిశోధన, అభివృద్ధిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఈ కంపెనీ హెర్బిసైడ్, పెస్టిసైడ్, ఫంగిసైడ్ సెగ్మెంట్లలో వ్యాపారం చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్ (APIs)ని తయారుచేస్తోంది. ఇండియా పెస్టిసైడ్స్ కాప్టాన్, ఫాల్పెట్ అండ్ థియోకార్బమేట్ కంపెనీ... ప్రపంచంలోనే అతి పెద్ద ఎరువుల తయారీ కంపెనీ. ఇండియాలో ఐదు రకాల టెక్నాలజీలకు సంబంధించిన పెస్టిసైడ్ ఉత్పత్తుల్ని ఈ కంపెనీ తయారుచేస్తోంది.

    ఇది కూడా చదవండి


    అండర్ డాగ్?:
    ఈ కంపెనీ షేర్లు కొనడం ద్వారా... చాలా త్వరగా, చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి పోటీ పెద్దగా లేదనీ... ఇది అండర్ డాగ్ టైపులో పని చేసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ కంపెనీకి స్థిరమైన వృద్ధి ఉంటుందనీ... ఇప్పుడు IPOలో షేర్లు కొన్నవారికి... దీర్ఘ కాలంలో మంచి లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

    ఇది కూడా చదవండి:Metrorail video: మెట్రో రైల్లో కోతుల ప్రయాణం... మాస్క్ ఏది?... నెటిజన్ల సెటైర్లు

    (Disclaimer: The material provided on this page is for information purposes only. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com. We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: BUSINESS NEWS, Money, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు