news18-telugu
Updated: December 14, 2018, 8:31 AM IST
(Image: Reuters/files)
ఇ-టూవీలర్స్‌కు మారిపోతే వచ్చే ఐదేళ్లలో ఎంత పెట్రోల్ ఆదా అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా ఇరవై వేల కోట్లు. అవును... మీరు విన్నది నిజమే. ఈ మాట చెప్పింది ఎవరో కాదు... నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించిన విషయాలివి. భారతదేశంలో 17 కోట్ల టూవీలర్లు ఉన్నాయని అంచనా. ప్రతీ వాహనం రోజుకు అర లీటర్ తక్కువ పెట్రోల్ ఉపయోగిస్తే... ఏడాదిలో 3400 కోట్ల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుందని అంచనా.
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో పెట్రోల్ ఆదా అవడమే కాదు... కాలుష్యం తగ్గుతుంది. గాలి నాణ్యత పెరుగుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ప్రోత్సహిస్తోంది. అంతే కాదు... రూ.1.4 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నది ఒక శాతం మాత్రమే. 2030 నాటికి 40 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(FAME-ఫేమ్) పేరుతో ప్రారంభించిన పథకానికి రెండో దశ కోసం రూ.4,500 కోట్లు కేటాయించింది కేంద్ర ఆర్థిక శాఖ. ఛార్జింగ్ ఏర్పాట్ల కోసం రూ.1,000 కోట్లు కేటాయించింది.
ప్రస్తుతం టాటా, మహీంద్ర కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ కార్ కొంటే రూ.1.4 లక్షల సబ్సిడీ లభిస్తుంది. వాహన ఖర్చులో 20 శాతం వరకు సబ్సిడీ పొందొచ్చు. హైఎండ్ ఎలక్ట్రిక్ కార్లు కొనేవారు రూ.4 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. అయితే ఆ మోడల్స్ ఇంకా ఇండియాలో లాంఛ్ కాలేదు. కార్లు మాత్రమే కాదు... బైకులు, ఆటోలకు కూడా సబ్సిడీ పొందొచ్చు. ఇ-స్కూటర్ కొంటే రూ.22 వేల వరకు సబ్సిడీ పొందొచ్చు. ఏఏ వాహనానికి ఎంతవరకు సబ్సిడీ లభిస్తుందో ఈ కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
https://www.fame-india.gov.in/ModelUnderFame.aspx
ఇవి కూడా చదవండి:
పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు
ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!
మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!
ఇంటర్నెట్ను ఊపేస్తున్న 'ఇన్విజిబుల్ ఛాలెంజ్'
Video: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్
Video: ఆరోగ్యం కోసం 10 సూపర్‌ఫుడ్స్!
Published by:
Santhosh Kumar S
First published:
December 14, 2018, 8:31 AM IST