పర్మనెంట్ అకౌంట్ నెంబర్-PAN ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరికీ ముఖ్యమైన డాక్యుమెంట్. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పాన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఏడాదిలో రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు, టర్నోవర్ ఉన్న వ్యాపారులు తప్పనిసరిగా పాన్ కార్డు తీసుకోవాలి. దాదాపు పెద్ద లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డులో 10 డిజిట్ ఆల్ఫాన్యూమరిక్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్‌కు లైఫ్‌టైమ్ వేలిడిటీ ఉంటుంది. అంటే ఒకరికి ఒకే నెంబర్ మాత్రమే కేటాయిస్తారు. పాన్ కార్డు విజిటింగ్ కార్డు సైజులో ఉంటుంది. జేబులో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇలాంటి ముఖ్యమైన ఐడీ కార్డ్స్, డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఎక్కడైనా భద్రపర్చుకోవచ్చు. లేదా ఎప్పుడైనా ఎక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా పాన్ కార్డుకు డౌన్‌లోడ్ చేసుకున్నవారు లేదా ఏవైనా మార్పులతో పాన్ కార్డ్ కరెక్షన్ చేసిన వారు ఇ-పాన్ కార్డ్ ఉచితంగా డౌన్‌లోడ్ చేయొచ్చు. మీకు ఫిజికల్ పాన్ కార్డు రావడం కన్నా ముందే ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇప్పటికే పాన్ కార్డు ఉంటే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే రూ.8.26 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
Bank Holidays October 2020: అక్టోబర్‌లో బ్యాంకులకు 8 సెలవులు... ఎప్పుడెప్పుడంటే
RBI New Rules: సెప్టెంబర్ 30 నుంచి మీ క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈ ట్రాన్సాక్షన్స్ బంద్... ఎందుకంటే
పాన్ కార్డ్ హోల్డర్ల సౌకర్యం, సౌలభ్యం కోసం ఆదాయపు పన్ను శాఖ ఎలక్ట్రానిక్ పాన్ లేదా ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకునే సర్వీస్ ప్రారంభించింది. పాన్ కార్డు లాగానే ఇ-పాన్ కూడా ప్రూఫ్‌గా వాడుకోవచ్చు. ఇ-పాన్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందులో పాన్ కార్డ్ హోల్డర్ల డెమొగ్రఫిక్ డీటైల్స్ అంటే పేరు, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్ లాంటివి ఉంటాయి. క్యూఆర్ కోడ్ రీడర్ ద్వారా ఈ వివరాలు యాక్సెస్ చేయొచ్చు. మొబైల్ నెంబర్ లింక్ చేసిన ఆధార్ నెంబర్ ఉన్నవారు సులువుగా ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సర్వీస్ ఉచితం. ఆదాయపు పన్ను శాఖ డిజిటల్ సంతకంతో ఇ-పాన్ జారీ చేస్తుంది. మరి ఇ-పాన్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
Pension Scheme: అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో ఉన్నారా? రెండు రోజులే గడువు
మీరు ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/MPanLogin.html వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ ఎక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి validate పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇ-పాన్ కార్డును పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే https://www.onlineservices.nsdl.com/paam/ReprintDownloadEPan.html వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి validate పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ చేసి ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, PAN, PAN card, Personal Finance