Home /News /business /

E AADHAAR DOWNLOAD KNOW HOW TO DOWNLOAD YOUR E AADHAAR IN 6 STEPS SS

Aadhar Download: ఇ-ఆధార్ డౌన్‌లోడ్... జస్ట్ 6 స్టెప్స్‌తో సాధ్యం

Aadhar Download: ఇ-ఆధార్ డౌన్‌లోడ్... జస్ట్ 6 స్టెప్స్‌తో సాధ్యం

Aadhar Download: ఇ-ఆధార్ డౌన్‌లోడ్... జస్ట్ 6 స్టెప్స్‌తో సాధ్యం

E-Aadhaar Download in 6 steps | మీరు ఏదైనా పనిమీద వెళ్లినప్పుడు అక్కడ ఆధార్ అవసరమైతే వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇవ్వొచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం జస్ట్ 6 స్టెప్స్‌తో ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి.

    ఆధార్ కార్డు... అందరి జీవితంలో ఇది ఓ భాగమైపోయింది. ఏదో ఓ పనికి ఆధార్ అవసరం అవుతోంది. అందుకే ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. పొరపాటున ఆధార్ కార్డు ఎక్కడైనా పోయిందంటే చాలు కంగారుపడిపోతుంటారు. కానీ... ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? చాలా సులభంగా ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా పనిమీద వెళ్లినప్పుడు అక్కడ ఆధార్ అవసరమైతే వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇవ్వొచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం జస్ట్ 6 స్టెప్స్‌తో ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి.

    Read this: JIO Feature: జియో యూజర్లకు స్పెషల్ ఫీచర్... ఇలా యాక్టివేట్ చేసుకోండి

    e aadhar card download, aadhar download link, aadhar card download by aadhaar number, aadhar password, aadhar card download by name and date of birth, aadhar card download app, e aadhar password, download your aadhar card in 2 minutes, e aadhaar pdf download, ఇ-ఆధార్ డౌన్‌లోడ్, ఆధార్ డౌన్‌లోడ్, ఆధార్ డౌన్‌లోడ్ లింక్, ఆధార్ పాస్‌వర్డ్
    image: UIDAI


    స్టెప్ 1: ముందుగా కంప్యూటర్‌లో లేదా స్మార్ట్‌ఫోన్‌లో UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in ఓపెన్ చేయండి.

    స్టెప్ 2: My Aadhaar సెక్షన్‌లో 'Download Aadhaar' పైన క్లిక్ చేయండి. అప్పుడు కొత్త పేజీ https://eaadhaar.uidai.gov.in/ ఓపెన్ అవుతుంది. మీరు నేరుగా ఈ అడ్రస్ కూడా ఎంటర్ చేయొచ్చు.

    స్టెప్ 3: ఆ తర్వాత 'Aadhaar', 'VID', 'Enrolment ID' అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే 'Aadhaar' ఆప్షన్‌పైన క్లిక్ చేయండి.

    స్టెప్ 4: 'Regular Aadhaar' ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్ నెంబర్, ఆధార్ కార్డుపై ఉన్న పూర్తి పేరు, పిన్ కోడ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.

    స్టెప్ 5: OTP జెనరేట్ చేసేందుకు 'Request OTP' పైన క్లిక్ చేయండి.

    స్టెప్6: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన 6 అంకెల OTP ఎంటర్ చేయండి. 'Download Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.

    మీరు డౌన్‌లోడ్ చేసిన ఇ-ఆధార్‌ ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఉన్న పేరులోని మొదటి నాలుగు అక్షరాలను క్యాపిటల్స్‌లో, మీరు పుట్టిన సంవత్సరాన్ని YYYY ఫార్మాట్‌లో ఎంటర్ చేయాలి.

    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    IRCTC Food: ఐఆర్‌సీటీసీ ఫుడ్ ప్యాకెట్లపై ఇక బార్ కోడ్స్... ఎందుకో తెలుసా?

    New Rule: వాహనదారులకు శుభవార్త... ఇక ఎన్ఓసీ అవసరం లేదు

    SBI Rules: ఎస్‌బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, ఛార్జీల వివరాలు ఇవే...
    First published:

    Tags: Aadhaar, AADHAR, Personal Finance

    తదుపరి వార్తలు