Construction కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి...గో మూత్రంతో లక్షలు సంపాదిస్తున్న ఇంజనీర్

ప్రతీకాత్మకచిత్రం

ఒకప్పుడు చదువుకోని వారు మాత్రమే చేసే బిజినెస్​లను ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు వదిలి మరీ చేపడుతున్నారు. అధిక లాభాలు ఆర్జిస్తూ అందరి చూపు తమ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. తాజాగా అటువంటి పనే చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల యువకుడు.

  • Share this:
నేటి యువత రొటీన్​కు భిన్నంగా ఆలోచిస్తోంది. రొటీన్​గా చేసే 9 నుంచి 5 జాబ్​కు స్వస్తి పలికి సొంత బిజినెస్​ వైపు చాలామంది అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు చదువుకోని వారు మాత్రమే చేసే బిజినెస్​లను ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు వదిలి మరీ చేపడుతున్నారు. అధిక లాభాలు ఆర్జిస్తూ అందరి చూపు తమ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. తాజాగా అటువంటి పనే చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల యువకుడు. తాను చేస్తున్న సివిల్​ ఇంజినీరింగ్​ ఉద్యోగాన్ని వదిలి 10 ఆవులతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ప్రతినెలా రూ.1 లక్షలకు పైగా సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 26 ఏళ్ల జయగురు ఆచర్ హిందర్ అనే యువకుడు పుత్తూరులోని వివేకానంద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్​ టెక్నాలజీ నుండి సివిల్​ ఇంజినీరింగ్​లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు ఓ ప్రైవేట్ సంస్థలో రూ. 22 వేల నెలవారీ వేతనంతో సివిల్​ ఇంజినీర్​గా పనిచేశాడు. అయితే 9 నుంచి 5 వరకు చేసే ఉద్యోగానికి విసిగిపోయి తన స్వగ్రామమైన పుత్తూరులోని ముండూరు గ్రామంలో డెయిర్​ బిజినెస్​ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి వెళ్లాడు.

ఆచర్​ది వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో తన తండ్రికి వ్యవసాయంలో అప్పుడప్పుడూ సహాయం చేసేవాడు.వారికున్న 10 ఆవులతో ఎక్కువ సేపు గడుపుతుండేవాడు. ఆ ఆవులనే తన వ్యాపారంగా మలుచుకున్నాడు. దీనిపై ఆచర్​ మాట్లాడుతూ "నాకు చిన్నప్పటి నుంచి డెయిరీ బిజినెస్​ చేయాలనే ఆలోచన ఉండేది. అందుకే, నా ఉద్యోగాన్ని మానేసి ఇష్టమైన డెయిరీ బిజినెస్​లోకి అడుగు పెట్టా. అయితే, అందరిలా కాకుండా వినూత్నంగా నూతన సాంకేతిక ఉపయోగించి అధిక లాభాలను ఆర్జిస్తున్నా" అని అన్నారు.

ఆవు పేడ, మూత్రం, స్నానం చేసే నీటితో అధిక లాభాలు..

అధిక లాభాల కోసం ఆచర్ తన డెయిరీని ఇప్పుడు బాగా విస్తరించాడు. ప్రారంభంలో 10 ఆవులు ఉండగా.. వాటి సంఖ్య 130 కి పెంచాడు. వీటి ద్వారా ప్రతిరోజూ వచ్చే 750 లీటర్ల పాలు, నెలకు 30 నుండి 40 కిలోల నెయ్యిని విక్రయిస్తున్నాడు. ఈ పనులన్నింటి కోసం 10 మంది సిబ్బంది నియమించుకున్నాడు. మరోవైపు తన బిజినెస్ డెవలప్​మెంట్​​ కోసం యూట్యూబ్​ను ఉపయోగించుకున్నాడు. యూట్యూబ్​ వీడియోలను చూసి పంజాబ్‌లోని పాటియాలా నుంచి ఆవు పేడను ఆరబెట్టే యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఆ యంత్రంతో ఆవు పేడని ప్యాకింగ్​ చేసి వాటిని విక్రయిస్తున్నాడు. తద్వారా అతను ప్రతి నెలా దాదాపు 1000 పొట్లాల ఆవు పేడ ప్యాకింగ్​లను విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.

మరోవైపు, ఆవు మూత్రం, ఆవుకు స్నానం చేయించిన నీటిని కూడా వినూత్న రీతిలో ట్యాంకర్ల ద్వారా రవాణా చేస్తున్నాడు. డైరీ బిజినెస్​తో పాటు అతని 10 ఎకరాల స్థలంలో వివిధ రకాల పంటలు వేస్తున్నాడు. దీంతో ఓవైపు డైరీ బిజినెస్, మరోవైపు వ్యవసాయంతో నెలకు రూ. 10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.
Published by:Krishna Adithya
First published: