హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ducati: డుకాటి నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్ లాంచ్.. ధర రూ.31 లక్షలు.. ఫీచర్లు మాత్రం అదుర్స్..

Ducati: డుకాటి నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్ లాంచ్.. ధర రూ.31 లక్షలు.. ఫీచర్లు మాత్రం అదుర్స్..

Photo Credit : Ducati

Photo Credit : Ducati

Ducati: డుకాటి ఇండియా సోమవారం ఇండియన్‌ మార్కెట్‌లోకి మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్‌ (Multistrada V4 Pikes Peak) బైక్‌ను లాంచ్‌ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యువత ఎక్కువగా ఇష్టపడే స్పోర్ట్స్ బైక్‌లలో డుకాటి (Ducati) ముందు వరసులో ఉంటుంది. డిజైన్‌, కంట్రోల్‌, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, లేటెస్ట్ ఫీచర్లతో డుకాటి బైక్‌లు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ క్రమంలోనే కొత్త స్టైల్‌, సేఫ్టీ ఫీచర్లతో డుకాటి ఇండియా సోమవారం ఇండియన్‌ మార్కెట్‌లోకి మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్‌ (Multistrada V4 Pikes Peak) బైక్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో రైడింగ్‌ స్టైల్‌తో సీట్‌ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌ అయ్యే సరికొత్త ఫీచర్‌ ఉంది. ఈ లేటెస్ట్‌ బైక్‌ స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* ధర ఎంత?

ఇండియన్‌ మార్కెట్‌లో మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్‌ బైక్ ధర రూ.31,48,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది బ్రాండ్ నుంచి వస్తున్న స్పోర్టియెస్ట్ మోడల్. క్రాస్ఓవర్ సెగ్మెంట్లో అత్యంత పవర్‌ఫుల్‌ బైక్‌. న్యూ ఢిల్లీ , చెన్నై, హైదరాబాద్ , కొచ్చి, కోల్‌కతా, ముంబై, పూణే, బెంగళూరులోని అన్ని డీలర్‌షిప్‌లలో ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్‌లో ప్రారంభమవుతాయి.

* డిజైన్

పైక్స్ పీక్ బైక్‌లోని చాలా కాంపోనెంట్స్‌ను కార్బన్ ఫైబర్‌తో రూపొందించారు. ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో Akrapovič టైటానియం, కార్బన్ ఎగ్జాస్ట్, లో స్మోక్డ్ ప్లెక్సీ స్క్రీన్, యానోడైజ్డ్ గోల్డ్ లెగ్స్‌తో Öhlins ఫ్రంట్ ఫోర్క్స్, V4 లోగోతో టూ-టోన్ బ్లాక్, రెడ్ రియర్ సీట్ ఉంటాయి. బైక్‌ ముందు వైపు డుకాటీ కోర్స్ బ్యాడ్జ్ కనిపిస్తుంది.

* స్పెషల్ ఫీచర్లు

డుకాటీ మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్ ప్రత్యేకమైన ఎర్గోనామిక్స్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా హై కంట్రోల్‌ను అందించేలా, లీన్ యాంగిల్స్‌ ఆప్టిమైజ్‌ చేసేలా డిజైన్‌ చేశారు. బైక్ రైడింగ్ పొజిషన్ పూర్తి కొత్తగా వస్తుంది. మినిమం లీన్‌ యాంగిల్‌ అందించడానికి ఫుట్ పెగ్‌లను కొంచెం వెనుకకు మార్చారు. ఈ బైక్‌లో ఎలక్ట్రానిక్ ఓహ్లిన్స్ సస్పెన్షన్ ఉంది, రైడర్ రైడింగ్ స్టైల్ ఆధారంగా అడ్జస్ట్‌ అవుతుంది. సీటు ఎత్తు 810-860mm మధ్య అడ్జస్ట్‌ అవుతుంది. హ్యాండిల్‌బార్ లోయర్‌లో, కర్వ్‌డ్‌ బార్‌లతో వస్తుంది.

* ఇంజిన్‌

స్పోర్ట్స్ బైక్ V4 గ్రాంటురిస్మో ఇంజిన్‌తో వస్తుంది. ఇది 1158 cc డిస్‌ప్లేస్‌మెంట్‌ కలిగిన తేలికపాటి - 66.7 కిలోల ఇంజిన్‌. యూరో 5-కంప్లైంట్ ఇంజిన్‌ 8,750 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 125 ఎన్ఎమ్ టార్క్‌తో 170 హెచ్‌పిని అందిస్తుంది.

ఇది కూడా చదవండి : దీపావళికి కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకే EV కార్ లోన్లు ఇస్తున్న బ్యాంకులపై ఓ లుక్కేయండి

* సేఫ్టీ ఫీచర్లు

బైక్‌ ముందు, వెనుక స్టాండర్డ్‌ రేడార్‌ టెక్నాలజీ ఉన్న ఎలక్ట్రానిక్ ప్యాకేజీతో వస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్(ACC), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ (BSD) ఫంక్షన్స్‌ ఈ స్పోర్ట్స్ బైక్ ప్రత్యేకతలు.

* ఇతర ప్రత్యేకతలు

బైక్‌కు 6.5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తుంది, ఇది ఆరు భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. రైడర్‌లకు మ్యాప్ నావిగేటర్‌ను వీక్షించే సదుపాయం కల్పిస్తోంది. కార్బన్ ఫైబర్ ఫ్రంట్ మడ్‌గార్డ్, అక్రాపోవిక్ మఫ్లర్, DRL, డుకాటీ కార్నరింగ్ లైట్‌లతో ఫుల్‌ LED హెడ్‌లైట్స్‌ ఉంటాయి. ఈ డుకాటి స్పోర్ట్‌ బైక్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా రేస్, స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వీలీ కంట్రోల్ వంటి నాలుగు రైడింగ్‌ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది.

First published:

Tags: Auto, Auto mobile, New bikes

ఉత్తమ కథలు