మీరు డీటీహెచ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు టాటా స్కై నుంచి శుభవార్త. స్టాండర్డ్ డెఫినిషన్-SD, హై డెఫినిషన్-HD సెట్ టాప్ బాక్సుల ధరల్ని మరోసారి తగ్గించింది టాటా స్కై. కొద్ది రోజుల క్రితమే బాక్సుల ధరల్ని తగ్గించిన టాటాస్కై... మరోసారి అదే నిర్ణయం తీసుకొని తగ్గింపు ధరలకే యూజర్లకు ఎస్టీబీలను అందిస్తోంది. రూ.1,499 ఉన్న ఎస్డీ సెట్ టాప్ బాక్స్‌ను రూ.1,399 ధరకే అందిస్తోంది టాటాస్కై. ఇక రూ.1,699 ధర ఉన్న హెచ్డీ సెట్ టాప్ బాక్స్‌ను రూ.1,499 ధరకు తగ్గించింది. అంటే గతంలో ఎస్డీ బాక్స్ ఉన్న ధరకే ఇప్పుడు హెచ్డీ సెట్ టాప్ బాక్స్ అందించడం విశేషం. ఈ రెండు సెట్ టాప్ బాక్సులు కాకుండా టాటా స్కైలో భారీ స్పెసిఫికేషన్స్‌తో టాటా స్కై+ హెచ్డీ బాక్స్ కూడా ఉంది. లైవ్ టీవీకి విరామం ఇచ్చి తర్వాత చూడటం, ఒకేసారి మూడు ఛానెళ్ల వరకు రికార్డు చేసుకోవడం లాంటి ఆప్షన్లున్నాయి. అయితే ఈ బాక్సు ధరను మాత్రం తగ్గించలేదు. టాటా స్కై+ హెచ్డీ బాక్స్ ధర రూ.9,300. ఇక టాటా స్కై 4కే సెట్ టాప్ బాక్స్ ధర రూ.6,400.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వీడియో, హాట్‌స్టార్, వూట్, సోనీ లివ్ లాంటి ఓవర్ ది టాప్-OTT స్ట్రీమింగ్ సర్వీసులు పట్టు పెంచుకుంటూ ఉండటంతో డీటీహెచ్ ప్రొవైడర్లు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు డీటీహెచ్ ప్రొవైడర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో ఉన్న కస్టమర్లను చేజార్చుకోకుండా, కొత్త సబ్స్క్రైబర్లను ఆకర్షించేందుకు టాటా స్కై సరికొత్త ఆఫర్లు, సర్వీసుల్ని ప్రకటిస్తోంది. ఇటీవలే సెట్ టాప్ బాక్సుల్ని ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే టాటా స్కై సెట్ టాప్ బాక్సుల్ని వీలైనంత ఎక్కువగా సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉంచాలని భావిస్తోంది కంపెనీ. అంతేకాకుండా రీజనల్ ప్యాక్స్ ధరల్ని మార్చింది. సరికొత్త ప్లాన్స్‌ని ప్రకటించింది. అమెజాన్‌తో కలిసి 'టాటాస్కై బింజ్' సర్వీస్‌ను లాంఛ్ చేసింది. ఒక్క టాటా స్కై మాత్రమే కాదు డిష్‌టీవీ, డీ2హెచ్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ లాంటి కంపెనీలన్నీ కస్టమర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Good News: వాట్సప్ వాడితే ఆరోగ్యానికి మంచిదే... ఎలాగో తెలుసా?
IRCTC: హైదరాబాద్-గోవా టూర్... తక్కువ ధరకే ప్యాకేజీ
Indian Railways: ఈ యాప్ ఉంటే... మీ రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.