Stocks In News | ఒక్క రోజులో డబ్బుల రెట్టింపు అంటే అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే బయట ఎక్కడైనాసరే ఒక్క రోజులో డబ్బు రెట్టింపు చేసే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు లేవు. ఒక్క స్టాక్ మార్కెట్‌లోనే (Stock Market) ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి అద్భతమే జరిగింది. ఒక కంపెనీ ఐపీవోకు వచ్చింది. మార్కెట్‌లో డబుల్ రేటుతో షేరు లిస్ట్ అయ్యింది. దీంతో ఐపీవోలో (IPO) షేర్లు కొనుగోల చేసిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఒకే రోజులో డబ్బులు రెట్టింపు అయ్యాయి.
డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ షేరు శుక్రవారం రోజున మార్కెట్లో లిస్ట్ అయ్యింది. ఈ షేరు ఇష్యూ ప్రైస్‌తో పోలిస్తే.. ఏకంగా రెట్టింపు ధరతో మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. ఐపీవో ప్రైస్ రూ. 54గా ఉంటే.. మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది మాత్రం రూ. 102 వద్ద. అలాగే లిస్ట్ అయిన రోజు షేరు ధర రూ. 107 స్థాయికి కూడా చేరింది. అంటే ఒకే రోజులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతటితో కథ అయిపోలేదు.
గూగుల్ పే వాడే వారికి శుభవార్త.. క్షణాల్లో రూ.8 లక్షల రుణం, ఇలా అప్లై చేసుకోండి!
షేరు ధర తర్వాత కూడా ర్యాలీ చేసింది. సోమవారం రోజున ఈ షేరు ధర 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. అంతేకాకుండా ఈ రోజు కూడా షేరు ధర దాదాప 5 శాతం మేర దూసుకుపోయింది. ఇప్పుడు షేరు ధర రూ. 118 వద్ద ఉంది. దీంతో షేరులో డబ్బులు పెట్టిన వారికి కనక వర్షం కురుస్తోందని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీకి ప్రతీక్ శ్రీవాత్సవ స్థాపించారు. అయితే ఇందులో బాలీవుడ్ సెలబ్రెటీలు అయిన అమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మార్కెట్ వెటరన్ శంకర్ శర్మ వంటి వారు వాటాలు కలిగి ఉన్నారు. అంటే వీరికి ఒక్క రోజులోనే డబుల్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు.
గ్యాస్ సిలిండర్ వాడే వారికి కేంద్రం అదిరే శుభవార్త? 2 కీలక నిర్ణయాలు?
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ లైసెన్స్ పొందిన తొలి ప్రైవేట్ కంపెనీ డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ కావడం గమనార్హం. 2022 మార్చి నుంచి చూస్తే.. ఈ కంపెనీ దాదాపు 180 డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇచ్చింది. అంతేకాకుండా ఈ కంపెనీ దేశీయంగా డ్రోన్స్ తయారు చేయానలి భావిస్తోంది. ల్యాండ్, అండర్ వాటర్ సర్వేయింగ్ సర్వీసులకు వీటిని ఉపయోగించాలని ప్లాన్ చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ రూ. 3.59 కోట్లుకు చేరింది. మునపటి ఏడాదిలో ఈ కంపెనీ రెవెన్యూ రూ. లక్షగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPO, Money, Multibagger stock, Share Market Update, Stock Market