త్వరలో ప్లాస్టిక్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

ప్లాస్టిక్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తయారీకి కార్డు కోసం మెటీరియల్ ఎంపికచేసే స్వేచ్ఛను రాష్ట్రాలకు అప్పగించింది కేంద్రం. చిప్ బేస్డ్ స్మార్ట్ కార్డు లేదా క్యూఆర్ కోడ్ లాంటి కాంటాక్ట్-లెస్ ఫీచర్లల్లో ఏదైనా ఒకటి రాష్ట్రాలు సూచించొచ్చు.

news18-telugu
Updated: March 9, 2019, 3:23 PM IST
త్వరలో ప్లాస్టిక్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
త్వరలో ప్లాస్టిక్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
news18-telugu
Updated: March 9, 2019, 3:23 PM IST
త్వరలో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ప్లాస్టిక్ కార్డుల రూపంలో జారీ చేయనుంది ప్రభుత్వం. ఇవి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహాలో ఉంటాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ప్లాస్టిక్ కార్డుతో వస్తాయి. పాలీవినాయిల్ క్లోరైడ్ లేదా పాలీ కార్బొనేట్‌తో ఈ కార్డు తయారవుతుంది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూచించినట్టుగానే దేశమంతా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఒకే ఫార్మాట్‌లో, ఒకే డిజైన్‌లో ఉంటాయి. ఇకపై పేపర్ లేదా బుక్‌లెట్ తరహాలో ఉండవు. ఉన్నత ప్రమాణాలతో తయారుచేసే కార్డులు నాణ్యతను, మన్నికను పెంచుతాయి.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటన


అయితే కార్డు కోసం మెటీరియల్ ఎంపికచేసే స్వేచ్ఛను రాష్ట్రాలకు అప్పగించింది కేంద్రం. చిప్ బేస్డ్ స్మార్ట్ కార్డు లేదా క్యూఆర్ కోడ్ లాంటి కాంటాక్ట్-లెస్ ఫీచర్లల్లో ఏదైనా ఒకటి రాష్ట్రాలు సూచించొచ్చు. సారథి లేదా వాహన్ డేటాబేస్‌‌లోని సమాచారం క్యూఆర్ కోడ్ లేదా చిప్ బేస్డ్ స్మార్ట్ కార్డులో ఉంటాయి.Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడేప్పుడు ఈ 8 తప్పులు చేస్తున్నారా?

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? మారిన ఎస్‌బీఐ రూల్స్ ఇవే

Vijaya Bank Jobs 2019: టెన్త్ పాసైతే చాలు... విజయా బ్యాంకులో ఉద్యోగాలు
First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...