• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • DREAM11 TO ZOMATO KNOW ABOUT TOP 10 MOST VALUED STARTUPS IN INDIA SS GH

Most Valued Startups: భారత్‌లో ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన టాప్-10 స్టార్టప్ కంపెనీలు ఇవే

Most Valued Startups: భారత్‌లో ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన టాప్-10 స్టార్టప్ కంపెనీలు ఇవే

Most Valued Startups: భారత్‌లో ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన టాప్-10 స్టార్టప్ కంపెనీలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Most Valued Startups | భారతదేశంలో అత్యంత విలువైన స్టార్టప్స్ ఏవో తెలుసా? ఆ జాబితాను సీబీ రిపోర్ట్ వెల్లడించింది. మరి టాప్ 10 స్టార్టప్స్ ఏవో తెలుసుకోండి.

  • Share this:
భారత్‌లో అత్యంత విలువైన స్టార్టప్‌లలో పేటీఎంలో పెట్టుబడులు పెట్టిన వన్ 97 కమ్యూనికేషన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2021 నాటికి ఆ సంస్థ 16 బిలియన్ డాలర్ల విలువతో భారతదేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌గా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను CB ఇన్‌సైట్స్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశంలో 32 యునికార్న్ కంపెనీలు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కనీసం ఒక బిలియన్ డాలర్ల విలువైన ప్రైవేటు సంస్థలను యూనికార్న్ కంపెనీలుగా వర్గీకరిస్తారు. 2021 ఏప్రిల్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 600కి పైగా యునికార్న్ సంస్థలు ఉన్నాయి.

COVID-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. కానీ కరోనా తరువాత భారత్‌లో ఆన్‌లైన్ టెక్నాలజీ వాడకం పెరగడం విశేషం. 2020లో టెక్నాలజీపై ఆధారపడే భారతీయుల సంఖ్య పెరగడం వల్ల, కొన్ని సంస్థల మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ఇప్పటి వరకు భారత్‌లో అత్యంత విలువైన 10 స్టార్టప్‌లను సీబీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో ఉన్న కంపెనీలను చూద్దాం.

Bank Holidays May 2021: మేలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా?

e-PAN Card: ఇ-పాన్ కార్డ్ 10 నిమిషాల్లో తీసుకోవచ్చు... ఈ స్టెప్స్ ఫాలో అవండి

1. వన్97 కమ్యునికేషన్స్ (One97 Communications)


ఈ కామర్స్ విభాగానికి చెందిన వన్ 97 కమ్యునికేషన్స్.. భారత్‌లో అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా రికార్డు సాధించింది. పేటీఎం మాతృ సంస్థ అయిన వన్97 కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 16 బిలియన్ డాలర్లుగా ఉంది.

2. బైజుస్ (BYJU’s)


కరోనా తరువాత ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ సంస్థ బైజుస్ విలువ భారీగా పెరిగింది. 13 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ సంస్థ రెండో అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా గుర్తింపు సాధించింది.

3. ఓయో (OYO)


బడ్జెట్ హోటల్‌ బిజినెస్‌లో ఓయో దూసుకుపోతుంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం సంస్థ సేవలను విస్తరించింది. జాబితాలో మూడో స్థానంలో నిలిచిన ఓయో మార్కెట్ విలువ ఏకంగా 9 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.

LIC Agent Jobs: ఏడాదిలో 3,45,469 ఎల్ఐసీ ఏజెంట్ల నియామకం... మీరూ దరఖాస్తు చేయండి ఇలా

SBI Alert: డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారా? ఇలా చేయొద్దంటూ ఎస్‌బీఐ వార్నింగ్

4. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (National Stock Exchange)


ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్.. టాప్-10 కంపెనీల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. సంస్థ మార్కెట్ విలువ 6.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

5. ఓలా క్యాబ్స్ (Ola Cabs)


రవాణా రంగానికి చెందిన ఓలా క్యాబ్‌కు విలువ ఏమాత్రం తగ్గట్లేదు. జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన ఈ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతానికి 6.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

6. జొమాటో (Zomato)


భారత్‌లో ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ 5.4 బిలియన్ డాలర్లుగా ఉంది. టాప్‌-10లో జొమాటో ఆరో స్థానం దక్కించుకుంది.

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

7. డ్రీమ్11 (Dream11)


ఈ సంస్థ గత ఏడాది ఐపీఎల్ సీజన్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏడో స్థానంలో ఉన్న ఈ ఆన్‌లైన్ గేమింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లుగా ఉంది.

8. స్విగ్గీ (Swiggy)


ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి భారత్‌లోని కొన్ని జోన్లలో విపరీతమైన ఆధరణ ఉంది. ఫుడ్ డెలివరీ విభాగానికి చెందిన ఈ సంస్థ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. టాప్-10లో స్విగ్గీ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

9. క్రెడ్ (CRED)


ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగానికి చెందిన క్రెడ్ కంపెనీ మార్కెట్ విలువ 2.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

10. మీషో (Meesho)


గత కొన్ని నెలలుగా మీషో కంపెనీ విలువ పెరుగుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం 2.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. టాప్-10 జాబితాలో మీషో ఆఖరి స్థానంలో నిలిచింది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు