Dream Sports కీలక నిర్ణయం​.. కొత్తగా 200 మందిని రిక్రూట్​ చేసుకోనున్న టెక్​ సంస్థ

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ స్పోర్ట్స్-టెక్ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ రాబోయే 12 నెలల్లో 200 మందికి పైగా నిపుణులను రిక్రూట్​ చేసుకోనున్నట్లు తెలిపింది. ప్రోడక్ట్​ స్ట్రాటజీ, అనలటిక్స్​ డేటా సైన్స్​ వంటి విభాగాల్లో వేగంగా వృద్ధి చెందడానికి ఈ నియామకాలు చేపట్టినట్లు స్పష్టం చేసింది.

  • Share this:
ప్రముఖ స్పోర్ట్స్-టెక్ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ రాబోయే 12 నెలల్లో 200 మందికి పైగా నిపుణులను రిక్రూట్​ చేసుకోనున్నట్లు తెలిపింది. ప్రోడక్ట్​ స్ట్రాటజీ, అనలటిక్స్​ డేటా సైన్స్​ వంటి విభాగాల్లో వేగంగా వృద్ధి చెందడానికి ఈ నియామకాలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. 2008లో హర్ష్ జైన్, భావిత్ శేత్ స్థాపించిన డ్రీమ్ స్పోర్ట్స్ సంస్థ.. టైగర్ గ్లోబల్, టిపిజి టెక్ అడ్జెన్సీస్, క్రిస్ క్యాపిటల్, టిసివి, కలారీ క్యాపిటల్, స్టీడ్‌వ్యూ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ వంటి ఇన్వెస్టర్ల మద్దతుతో నడుస్తోంది. డ్రీమ్ స్పోర్ట్స్ సంస్థ డ్రీమ్ 11 (ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫాం), ఫ్యాన్‌కోడ్ (స్పోర్ట్స్​ ఫ్యాన్స్​కు కంటెంట్ అందించే ప్లాట్​ఫామ్​), డ్రీమ్‌సెట్​గో (స్పోర్ట్స్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫాం), డ్రీమ్‌పే (పేయిమెంట్​ సొల్యూషన్స్​ ప్రొవైడర్) వంటి వివిధ వ్యాపారాలను నిర్వహిస్తుంది.

కొత్త రిక్రూట్​మెంట్​పై డ్రీమ్ స్పోర్ట్స్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ కెవిన్ ఫ్రీటాస్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం మా సంస్థలో దాదాపు 700 మంది ఉద్యోగులున్నారు. కరోనాకు ముందు అనగా 2020 జనవరిలో వీరి సంఖ్య కేవలం 320 మాత్రమే ఉండేది. గత 18 నెలల్లో మేము ఈ సంఖ్యను రెట్టింపు చేశాం. కొత్తగా మరో 200 మందిని రిక్రూట్​ చేసుకోవాలని భావిస్తున్నాం. వీరితో కలుపుకుంటే రాబోయే 12 నెలల్లో మా మొత్తం సిబ్బంది సంఖ్య 900 మందికి చేరుకుంటుంది” అని చెప్పారు. కాగా, ఈ కొత్త రిక్రూట్​మెంట్​లో దాదాపు 80 శాతం కోర్ జాబ్స్, మిగిలిన 20 శాతం నాన్​ టెక్నికల్​ జాబ్స్​ ఉండనున్నాయి.

ఐఐటీ, ఎన్​టీల నుంచి 60 మంది ఫ్రెషర్స్​..
కోర్​ జాబ్స్​లో భాగంగా ప్రొడక్ట్, టెక్, డిజైన్​.. నాన్​ టెక్నికల్ జాబ్స్​లో భాగంగా హ్యూమన్​ రిసోర్స్​, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్ వంటి విభాగాల్లో రిక్రూట్​మెంట్​ చేసుకోనున్నారు. ప్రొడక్ట్ స్ట్రాటజీ, అనలిటిక్స్​, ఫ్రంట్​ ఎండ్​, డేటా సైన్స్​, మొబైల్​ సెక్యూరిటీ వంటి ఆన్​లైన్ వ్యాపార వృద్దికి వీరిని ఉపయోగించుకోనున్నారు. కొత్త రిక్రూట్​మెంట్​లో 140 మంది ఎక్స్​ఫీరియన్స్​డ్​, 60 మంది ఫ్రెషర్స్​ను తీసుకోనున్నారు. ఫ్రెషర్స్​ను ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్​ఐటీల్లో క్యాంపస్​ రిక్రూట్​మెంట్​ ద్వారా నియమించుకోనున్నారు.

ఎంపికైన డ్రీమ్ స్పోర్ట్స్ ఉద్యోగులందరూ ముంబైలోని సంస్థ కార్యాలయం నుంచి పనిచేస్తారని చీఫ్​ హ్యూమన్​ రిసోర్సెస్​ ఆఫీసర్​ ఫ్రీటాస్ తెలిపారు. దీన్ని 'స్టేడియం' గా ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కంపెనీ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం తమ ఉద్యోగులు వర్క్​ ఫ్రమ్​ ద్వారా విధులు నిర్వహిస్తున్నారని, ఆగస్టు నుంచి కార్యాలయంలో వారికి తిరిగి వర్క్​ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

ఇది చూడండి...
Published by:Krishna Adithya
First published: