హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pensioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దానిని 3 శాతం పెంచుతు నిర్ణయం.. వివరాలిలా..

Pensioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దానిని 3 శాతం పెంచుతు నిర్ణయం.. వివరాలిలా..

పెరిగిన జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

పెరిగిన జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

పెరిగిన జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

  ప్రస్తుతం ద్రవ్యోల్బణం (Inflation) కారణంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ (Cost Of Living) విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పెరిగిన జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను 3% పెంచినట్లు పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ తెలియజేసింది. జనవరి 1, 2022 నుంచి ఈ పెంచిన డియర్‌నెస్ రిలీఫ్(Dearness Relief) అమల్లోకి వచ్చిందని ఇది వెల్లడించింది. "కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్లకు అనుమతించదగిన డియర్‌నెస్ రిలీఫ్‌ను బేసిక్ పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 31% నుంచి 34% వరకు పెంచడం కోసం డీఓపీపీడబ్ల్యూ (DoPPW) 05.04.2022న ఉత్తర్వులు జారీ చేసింది" అని పెన్షనర్ల సంక్షేమ శాఖ ట్వీట్ చేసింది. కమ్యుటేషన్‌కు ముందు ఒరిజినల్ బేసిక్ పెన్షన్‌పై డియర్‌నెస్ రిలీఫ్ చెల్లిస్తారు.

  ఎవరికి ప్రయోజనం?

  1) కేంద్ర ప్రభుత్వంతో సహా పౌర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు. PSU/ అటానమస్ సంస్థలలోని అబ్సర్బీ పెన్షనర్లు (absorbee pensioners). ఈ శాఖ ఓఎం (OM) నం. 4/34/2002-P&PW(D)Vol.II తేదీ 23.06.201 7 ప్రకారం 15 సంవత్సరాల కమ్యుటేషన్ వ్యవధి ముగిసిన తర్వాత పూర్తి పెన్షన్‌ను రీస్టోర్ చేయడం కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  2) ఆర్మ్డ్ ఫోర్సెస్ పెన్షనర్లు, పౌర పెన్షనర్లు (Civilian Pensioners)

  3) ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లు

  4) రైల్వే పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లు

  5) తాత్కాలిక పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు

  6) బర్మా పౌర పెన్షనర్లు/కుటుంబ పెన్షనర్లు, బర్మా/పాకిస్తాన్ నుంచి డిస్ లొకేట్ అయిన ప్రభుత్వ పెన్షనర్ల పెన్షనర్లు/కుటుంబాలు, వీరికి సంబంధించి తేదీ 1 1.09 .2017న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ డిపార్ట్‌మెంట్ OM నం. 23/3/2008-P&PW(B).

  గత వారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు అందిస్తూ కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) వారి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)లో ఒక్కొక్కటి 3 శాతం పాయింట్ల పెంపునకు ఆమోదం తెలిపింది. దీనితో దాదాపు 4.76 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 6.86 మిలియన్ల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు 7వ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా యాక్సెప్టెడ్ ఫార్ములాకు అనుగుణంగా ఉంది.

  పెన్షనర్స్ పోర్టల్ వెబ్‌సైట్ ప్రకారం, డీఆర్ సాధారణంగా మార్చి & సెప్టెంబర్ నెలల్లో సంవత్సరానికి రెండుసార్లు ప్రకటిస్తారు. ఇలా జనవరి & ఫిబ్రవరి నెలల్లో, పెన్షన్/కుటుంబ పెన్షన్‌పై డీఆర్ మునుపటి సంవత్సరం డిసెంబర్ నెలలో అందుబాటులో ఉన్న డీఆర్ రేట్ల ప్రకారం లెక్కిస్తారు. అదేవిధంగా, జూలై & ఆగస్టు నెలలో డీఆర్ ని జూన్ నెలలో అందుబాటులో ఉన్న డీఆర్ రేట్లు లెక్కిస్తారు.

  First published:

  Tags: Business, Central Government, Dearness allowance

  ఉత్తమ కథలు