ePAN Card: పాన్ కార్డు లేదా? ఐదు నిమిషాల్లో ఇ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా

ePAN Card Download | మీ దగ్గర పాన్ కార్డ్ లేదా? ఐదు నిమిషాల్లో పాన్ కార్డు తీసుకోవచ్చు. సులువుగా ఇ-పాన్ కార్డులు జారీ చేసేందుకు సరికొత్త వ్యవస్థను ప్రారంభించబోతోంది కేంద్ర ప్రభుత్వం.

news18-telugu
Updated: February 8, 2020, 12:10 PM IST
ePAN Card: పాన్ కార్డు లేదా? ఐదు నిమిషాల్లో ఇ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా
ePAN Card: ఐదు నిమిషాల్లో ఇ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆధార్ నెంబర్ ద్వారా ఇ-పాన్ కార్డ్ జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభించబోతోంది కేంద్ర ప్రభుత్వం. మీరు ఎలాంటి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు... ఐదు నిమిషాల్లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్-PAN ఇచ్చేలా కొత్త సిస్టమ్ అందుబాటులోకి రాబోతోంది. పాన్ కార్డు కోసం దరఖాస్తు ఫామ్ పూర్తి చేయడం, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సబ్మిట్ చేయడం, పాన్ కార్డు వచ్చేవరకు ఎదురుచూడటం లాంటివన్నీ అవసరం లేదు. కేవలం ఆధార్ నెంబర్‌తో ఇ-పాన్ కార్డును సులువుగా తీసుకోవచ్చు. తక్షణమే పాన్ కార్డ్ జారీ చేసేందుకు సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు 2020-21 బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ సరికొత్త వ్యవస్థ ఇదే నెలలో అందుబాటులోకి రానుంది. ఆధార్ వివరాల ద్వారా పాన్ కార్డ్ జారీ అవుతుందని రెవెన్యూ సెక్రెటరీ అజయ్ భూషణ్ తెలిపారు.

ePAN Card: ఎలా తీసుకోవాలంటే...



మరు ఇ-పాన్ కార్డు తీసుకోవాలంటే ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో ఇ-పాన్ కార్డ్ లింక్‌లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ తప్ప ఇతర వివరాలేవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఇందుకోసం మీరు ముందుగానే మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ వివరాలు వెరిఫై అవుతాయి. వివరాలు వెరిఫై కాగానే మీకు ఇ-పాన్ కార్డ్ జారీ అవుతుంది. ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని మీ ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించొచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు జారీ అయ్యాయి. వాటన్నింటినీ ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. 2020 జనవరి 27న నాటికి 17.58 పాన్ నెంబర్లు ఆధార్ నెంబర్లతో లింక్ అయ్యాయి. ఆధార్-పాన్ నెంబర్లు లింక్ చేయడానికి 2020 మార్చి 31 చివరి తేదీ. మరి మీరు ఇప్పటివరకు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఆధార్ నెంబర్-పాన్ నెంబర్ లింక్ చేసినట్టైతే స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

IRCTC: హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

Prize Money: కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.1 కోటి గెలుచుకునే ఛాన్స్Digital Cash: ఈ టిప్స్‌తో మీ పేటీఎం, ఫోన్‌ పేలో డబ్బులు సేఫ్
Published by: Santhosh Kumar S
First published: February 8, 2020, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading