హోమ్ /వార్తలు /బిజినెస్ /

Dove Shampoo Recall: డవ్(Dove) షాంపులను వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. క్యాన్సర్ బారినపడే అవకాశం..

Dove Shampoo Recall: డవ్(Dove) షాంపులను వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. క్యాన్సర్ బారినపడే అవకాశం..

Dove Shampoo Recall: డవ్(Dove) షాంపులను వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. క్యాన్సర్ బారినపడే అవకాశం..

Dove Shampoo Recall: డవ్(Dove) షాంపులను వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. క్యాన్సర్ బారినపడే అవకాశం..

ప్రముఖ కంపెనీ యూనిలీవర్‌కు చెందిన పలు షాంపూ బ్రాండ్‌లలో క్యాన్సర్‌ను కలిగించే రసాయనం కనుగొనబడింది. యూఎస్ మార్కెట్ నుండి డవ్(Dove), నెక్సస్(Nexxus), ట్రెస్మె, టిగీ , సువావే, ఏరోసోల్ వంటి డ్రై షాంపూలను రీకాల్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రముఖ కంపెనీ యూనిలీవర్‌కు చెందిన పలు షాంపూ బ్రాండ్‌లలో క్యాన్సర్‌ను కలిగించే రసాయనం కనుగొనబడింది. యూఎస్ మార్కెట్ నుండి డవ్(Dove), నెక్సస్(Nexxus), ట్రెస్మె, టిగీ, సువావే, ఏరోసోల్ వంటి డ్రై షాంపూలను రీకాల్(Recall) చేసింది. వాటిలో క్యాన్సర్ కారకమైన బెంజీన్ ఉందని హిందుస్తాన్ యూనిలీవర్ గుర్తించింది. ఈ రసాయనం క్యాన్సర్‌కు(Cancer) కారణమవుతుందని పేర్కొంది. ఏరోసోల్ డ్రై షాంపూ ప్రొడక్టులు ప్రమాదకరమని.. వీటిని అస్సలు వాడొద్దని వినియోగదారులను హెచ్చరించింది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రకారం.. ఈ ఉత్పత్తులు అక్టోబర్ 2021కి ముందు తయారు చేయబడిన వాటిలో ఈ హానికారకమైన కారకాలు ఉన్నట్లు ఎఫ్డీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ రిటైలర్‌లకు ఈ విషయాన్ని చేరవేసినట్లు పేర్కొన్నారు. వీటిని వాడే కస్టమర్లు వెంటనే ఆపేయాలని ఎఫ్‌డీఏ పేర్కొంది. వీటిని కొనుగోలు చేసిన వారు.. రియంబర్స్ మెంట్ కు UnileverRecall.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని FDA చెబుతోంది.

వీటిలో డోవ్ డ్రై షాంపూ వాల్యూమ్ మరియు ఫుల్‌నెస్, డోవ్ డ్రై షాంపూ ఫ్రెష్ కోకోనట్, నెక్సస్ డ్రై షాంపూ రిఫ్రెషింగ్ మిస్ట్ మరియు సువేవ్ ప్రొఫెషనల్స్ డ్రై షాంపూ రిఫ్రెష్ మరియు రివైవ్ ఉన్నాయి. ఈ బెంజీన్ మానవులకు క్యాన్సర్‌ను కలిగిస్తుంది. FDA తన రీకాల్ నోటీసులో బెంజీన్ అనేక విధాలుగా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని పేర్కొంది. ఇది వాసన ద్వారా, నోటి ద్వారా మరియు చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని పేర్కొంది. ఇది లుకేమియా మరియు బ్లడ్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని వెల్లడించింది.

ఈ వార్త బయటికి రాగానే పర్సనల్ కేర్ ప్రొడక్టులలో ఏరోసోల్స్ సేఫ్టీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో అనేక ఏరోసోల్ సన్‌స్క్రీన్‌లు మార్కెట్ నుండి రీకాల్ చేయబడ్డాయి. వీటిలో జాన్సన్ & జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కోకు చెందిన బనానా బోట్, ప్రొక్టెర్ అండ్ గ్యాంబుల్ కో సీక్రెట్, ఓల్డ్ స్పైస్, యూనీలివర్ సువేవ్ ఉన్నాయి. గత సంవత్సరం.. Procter & Gamble కూడా 30 కంటే ఎక్కువ ఏరోసోల్ స్ప్రే హెయిర్‌కేర్ ఉత్పత్తులను రీకాల్ చేసింది. వీటిలో డ్రై షాంపూ మరియు డ్రై కండీషనర్ ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్లో బెంజీన్ ఉండవచ్చని కంపెనీ హెచ్చరించింది.

iQoo Neo 7 Vs iQoo 9T: ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య తేడాలు ఏంటి.. ఫీచర్స్, ధరలు ఇలా..

స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ఇలాంటి ప్రమాదకరమైన సమస్యను ఎదుర్కోవడం ఇది తొలిసారి కాదు. గత సంవత్సరం డిసెంబర్ లో కంపెనీ ప్యాంటీన్, హెర్బర్ ఎసెన్స్ డ్రై షాంపూలను కూడా రీకాల్ చేసింది. ఆ సమయంలో కూడా వాటిల్లో క్యాన్సర్ కు కారణమయ్యే బెంజీన్ ఉన్నట్లు గుర్తించింది. న్యూహెవెన్‌కు చెందిన వాలిసూర్ అనలటికల్ ల్యాబ్‌లో జరిపిన తనిఖీల్లో ఈ షాంపూలలో బెంజీన్ ఉన్నట్టు గుర్తించారు. మే 2021 సంవత్సరంలో వాలిసూర్, ఏరోసోల్ ప్రొడక్టులను పీ అండ్ జీ కూడా టెస్ట్ చేసింది. వీటిలో కూడా.. క్యాన్సర్ కు కారణమయ్యే బెంజీన్ ఉన్నట్లు బయటపడింది.

దీనిపై వాలిస్యూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ లైట్ మాట్లాడుతూ.. ఏరోసోల్ డ్రై షాంపూలు వంటి ఇతర కన్జూమర్ ప్రొడక్టు కేటగిరీల్లో అత్యధికంగా బెంజీన్ కారకం ఉండటం దురదృష్టకరం. మేము దీనిపై క్రియాశీలకంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఈ కారణంతోనే తమ డ్రై షాంపులన రీ కాల్ చేస్తున్నట్లు యూనీలివర్ చెప్పింది. అయితే క్యాన్సర్ కు కారణమయ్యే బెంజీన్ వీటిలో ఏ మాత్రం ఉందో తెలపలేదు.

First published:

Tags: Business, Cancer, Dove, Nexxus

ఉత్తమ కథలు