సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?

సంపదను పెంచుకునేందుకు సేవింగ్స్ అకౌంట్ దోహదపడుతుందని మనీ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. కానీ చాలామంది ఈ అకౌంట్‌ను అంతగా పట్టించుకోవట్లేదు. అలా సేవింగ్స్ అకౌంట్‌ని వాడకుండా వదిలేయడం కన్నా... దాన్ని మీ డబ్బులు పొదుపు చేసేందుకు వాడుకోవాలి.

news18-telugu
Updated: September 29, 2018, 5:47 PM IST
సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒక్కొక్కరి పేరు మీద రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉండటం మామూలే ఈ రోజుల్లో. ఉద్యోగులైతే కంపెనీ ఇచ్చే సాలరీ అకౌంట్... ఇంటికి దగ్గర్లోనే బ్రాంచ్ ఉందని మరో అకౌంట్... సర్వీసులు బాగున్నాయని ఇంకో అకౌంట్... ఇలా రెండుమూడు అకౌంట్లు మెయింటైన్ చేసేవాళ్లున్నారు. ఉద్యోగాల వల్ల తరచూ ఊళ్లు మారేవారికి ఈ అకౌంట్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత కొన్ని అకౌంట్లను పట్టించుకోరు. అసలు ఫలానా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందన్న విషయం కూడా మర్చిపోతుంటారు. మరి మీరూ ఇలాగే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను వాడకుండా వదిలేశారా? అయితే వెంటనే ఆ అకౌంట్‌ని మళ్లీ యాక్టీవ్ చేయండి. ఎందుకో తెలుసుకోండి.

సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీరు డబ్బులు జమ చేయడానికి ఉపయోగపడుతుంది. సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై కొన్ని బ్యాంకులు 6 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. అంత కాకపోయినా బ్యాంకులు కనీసం 3.5 శాతం వడ్డీ ఇస్తాయి. దాంతో పాటు ఇతర సేవలు, లాభాలు ఉంటాయి.

సంపదను పెంచుకునేందుకు సేవింగ్స్ అకౌంట్ దోహదపడుతుందని మనీ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. కానీ చాలామంది ఈ అకౌంట్‌ను అంతగా పట్టించుకోవట్లేదు. అలా సేవింగ్స్ అకౌంట్‌ని వాడకుండా వదిలేయడం కన్నా... దాన్ని మీ డబ్బులు పొదుపు చేసేందుకు వాడుకోవాలి.సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?, Don’t leave your savings bank account unused! Here's why

మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేకుండా అకౌంట్‌లో ఉన్నదంతా ఖాళీ చేయకండి. ఎందుకంటే మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు బ్యాంకులు ఛార్జీలు వేస్తుంటాయి. అనవసరంగా మీ జేబుకు చిల్లుపడుతుంది. మీరు సరిగ్గా తెలుసుకోవాలే కానీ... మీ సేవింగ్స్ అకౌంట్‌పై ఫండ్ ట్రాన్స్‌ఫర్స్, డిమాండ్ డ్రాఫ్ట్, బిల్ పే సర్వీసెస్ ఉచితంగా లభిస్తాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు.

సేవింగ్స్ అకౌంట్‌ని కేవలం ఈఎంఐలు చెల్లించేందుకే ఉపయోగించేవాళ్లు ఎక్కువ. అయితే దాని ద్వారా బిల్లులు చెల్లిస్తే కస్టమర్లకు రివార్డ్ పాయింట్స్ అందిస్తుంటాయి బ్యాంకులు. ఆ రివార్డ్ పాయింట్స్‌ని రీడీమ్ చేసుకోవచ్చు.

ఇక మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరి. అంతేకాదు... రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు సేవింగ్స్ అకౌంటే కావాలి. ఆటో స్వీప్ ఆప్షన్ ఎంచుకుంటే... మీరు మర్చిపోయినా అకౌంట్‌లోంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో డబ్బులు జమైపోతాయి.

సేవింగ్స్ అకౌంట్‌లో లభించే వడ్డీ కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. అయితే సెక్షన్ 80 టీటీఏ ద్వారా రూ.10,000 వరకు వడ్డీని మినహాయించుకోవచ్చు. అయితే సేవింగ్స్ అకౌంట్‌లో వచ్చిన వడ్డీని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో వెల్లడించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:

ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?

బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

క్రెడిట్ కార్డులో ఈ ఛార్జీలు మీకు తెలుసా?

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా?

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?
Published by: Santhosh Kumar S
First published: September 29, 2018, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading