Home loan rules: హోం లోన్లు తీసుకుంటున్నారా? ఈ విషయాలపై దృష్టి పెట్టండి

ప్రతీకాత్మక చిత్రం

హోంలోన్లు, బీమా విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడానికి కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

  • Share this:
కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటిని మిగిల్చింది. అయినవారిని అకస్మాత్తుగా తమ నుంచి దూరం చేసి గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఇష్టమైన వ్యక్తిని కోల్పోయిన బాధ ఒకవైపు అయితే.. ఆర్థిక పరమైన విషయాల్లో గందరగోళాలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి పేరుపై గృహ రుణాలు, బీమా పాలసీలు వారి జీవిత భాగస్వామికి చేరేవేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అవగాహన లేని వారిపై ఈ భారం అధికంగా ఉంటుంది.

ఈ విధంగా అవగాహన లేకపోవడం ఇటీవలే ఓ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. అతని భార్యకు ఆర్థిక విషయాల గురించి పెద్దగా అవగాహనలేదు. బీమా, రుణాలు, పెట్టుబడులు లాంటి వాటి గురించి తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నేళ్ల క్రితం వీరు గృహం రుణం తీసుకొని ఓ ఇంటిని కొనుగోలు చేశారు. లోన్ త్వరగా తీర్చాలనే ఆశతో కాలపరిమితి కంటే ముందే చెల్లించాలని ఎక్కువ ఈఎంఐ కడుతున్నారు.

ప్రస్తుతం ఆ ఇల్లు కొనుగోలు చేసి ఆరేళ్లయింది. ఇటీవలే భర్త మరణించడంతో, ఆ బాధ్యతను భార్య తీసుకోవాల్సి వచ్చింది. గృహ రుణానికి సంబంధించిన పత్రాలేవి ఆమెకు ఇంట్లో కనిపించలేదు. ఈ కారణంగా ఆమె బ్యాంకుపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రతి నెలా హోంలోనుకు సంబంధించిన ఈఎంఐతో పాటు మరో చిన్న ఈఎంఐ కూడా చెల్లించినట్లు బ్యాంక్ స్టేట్ మెంట్లో తేలింది. రెండో ఈఎంఐ బీమాకు సంబంధించింది.

భర్త ఇటీవలే మరణించారని, బీమా ఈఎంఐ కట్ చేయవద్దని బదులుగా ఇన్సురెన్స్ ను సర్దుబాటు చేసుకోవాలని రుణ సంస్థను ఆమె కోరింది. అయితే ఐదేళ్ల కాలపరిమితితో రుణం తీసుకున్నారని, అందుకే మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని బీమా కంపెనీ చెప్పింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు లోనైంది. రుణం చెల్లించడానికి ఆమె ఆస్తులను లిక్విడెట్ చేయాలా లేదా ఇంటిని అమ్మేసి, వేరే ప్రాంతానికి వెళ్లాలా అని ఆమె నిర్ణయించుకోవాల్సి వచ్చింది. హోంలోన్లు, బీమా విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడానికి కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

- జీవిత భాగస్వామి ఆసక్తితో సంబంధం లేకుండా మీ బీమా పాలసీలు, ఆస్తులు, బాధ్యతల గురించి అతడు లేదా ఆమెకు తెలియజేయాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లను నిర్దిష్ట ప్రదేశంలో ఉంచాలి.

- రుణ మంజూరు పత్రం (Loan Sanction letter) చాలా ముఖ్యమైన పత్రం. ఇందులో చాలా వివరాలు ఉంటాయి. మీరు రుణం తీసుకునేటప్పుడు ఈ లేఖను క్షుణ్నంగా చదవాలి.

- రుణంతో పాటు తీసుకున్న బీమా మొత్తం పూర్తి గడువు వరకు చెల్లుతుందా లేదా అని బీమా సంస్థతో ధ్రువీకరించుకోవాలి.

- మీ బీమా ఇకపై చెల్లుబాటు కాకపోతే అన్ని బాధ్యతలు కవర్ చేయడానికి, కుటుంబాన్ని చూసుకునేలా చూడటానికి ఓ స్వతంత్ర జీవిత బీమాను తీసుకోవాలి

- మీరు కొత్త లోన్ తీసుకునేటప్పుడు ఎమోషన్ కు తావు ఇవ్వకండి. లోన్ చెల్లించే సామర్థ్యం అతడు లేదా ఆమెకు ఉందా లేదో చూసి వారి పేరు మీద రుణం ఉండనివ్వండి

- మీ జీవిత భాగస్వామి పేరు మీద లోన్ ఉన్నట్లయితే మీరు లేనప్పుడు ఈఎంఐని చెల్లించలేకపోతే రుణాన్ని కవర్ చేయడానికి మీరు బీమా పాలసీని తీసుకున్నారని నిర్ధారించుకోండి. అంతేకాకుండా లోన్ వివరాలను వారికి తెలియజేయండి.
Published by:Krishna Adithya
First published: