ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలో అమెజాన్(Amazon) వ్యవస్థాకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos)కీలక వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులు తమ డబ్బులను ఎలా ఆదా చేసుకోవాలి.. ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి అనే చిట్కాలను సూచించాడు. ఈ హాలిడే సీజన్ లో అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని.. సీఎన్ఎన్ కు(CNN) ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సెలవు రోజుల్లో అనవసరపు ఖర్చు జోలికి వెళ్లొద్దని అన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఊహించని రీతిలో దిగజారీపోయే ప్రమాదం ఉందని.. అందువల్ల ఎలాంటి రిఫ్రిజిరేటర్లు, కొత్త కార్లు వంటి వాటిని కొనుగోలు చేయొద్దన్నారు. మీరు ఒక వేళ ఫ్యామిలీ కాకుండా సింగిల్ గా(Single) ఉన్నట్లయితే.. మీకు టీవీ(TV) కొనే ఆలోచన ఉన్నట్లయితే.. ఆ డబ్బులను ఆదా చేసుకోండి.. ఎలాంటి వస్తువులు కొనొద్దంటూ సూచనలు చేశాడు. సేమ్ రిఫ్రిజిరేటర్, కొత్త కారు విషయంలో కూడా అంతే.. మీ వద్దనే డబ్బును ఉంచుకోండి.. రిస్క్ కు కాస్త దూరంగా ఉండండన్నారు.
అంతే కాకుండా.. వ్యాపారస్థులకు కూడా కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చాడు. మీ వ్యాపారంలో కొత్త పరికరాలపై పెట్టుబడిని నిలిపివేయాలని.. వాటికి పెట్టే ఖర్చులను నగదు రూపంలో దాచుకోవాలని సూచించాడు. ఇలా నగదు నిల్వలు పెంచుకోవాలని సూచించాడు. భవిష్యత్ లో అంతా మంచే జరగాలని ఆశిద్దామన్నారు.
ఇక బెజోస్ 124 బిలియన్ల సంపదను కలిగి ఉన్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.10 లక్షల కోట్లు. ఈ నేపథ్యంలో అతడు తన సంపదలో కొంత మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు.
PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
జెఫ్ బెజోస్ ప్రస్తుతం అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్ సీఈవో పదవి నుంచి పదవీ విరమణ చేసిన జెఫ్ తన సంపదను వెల్లడించారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు తన సంపదలో ఎక్కువ భాగాన్ని అంకితం చేయాలనుకుంటున్నట్లు జెఫ్ చెప్పారు. తీవ్రమైన సామాజిక, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ మానవత్వాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తున్న వారికి తన చర్య మద్దతునిస్తుందని ఆయన అన్నారు. జెఫ్ బెజోస్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఛారిటీకి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కామర్స్ కంపెనీలు వరుసగా.. లే ఆఫ్ లను ప్రకటిస్తున్నాయి. ట్విట్టర్ , మెటా వంటి సామాజిక మాద్యమ సంస్థలు భారీ లేఆఫ్ లు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకే అమెజాన్ సంస్థ కూడా వచ్చి చేరింది. ఈ సంస్థ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తుందని యూఎస్ మీడియాలో గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభమైందని.. ఏడాది ప్రారంభంలో తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుందని జెఫ్ బెజోస్ పేర్కొన్నాడు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పడం లేదని అన్నారు.
కొరోనావైరస్ మహమ్మారి కారణంగా ఎక్కువ మంది ఆన్ లైన్ షాపింగ్ లకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఆన్ లైన్ షాపింగ్ లు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్‌కు ఆసక్తి చూపడంతో.. అమెజాన్ 2020 మొదటి త్రైమాసికం నుండి రెండు సంవత్సరాల తరువాత 1.62 మిలియన్ల ఉద్యోగులకు తన శ్రామిక శక్తిని రెట్టింపు చేసింది. కానీ ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో.. రెండు వారాల క్రితం అమెజాన్ హైరింగ్ లను నిలిపివేసింది. సంవత్సరం ప్రారంభంతో పోల్చితే వర్క్‌ఫోర్స్ భారీగా తగ్గిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Jeff Bezos