Donald Trump visit to India: డొనాల్డ్ ట్రంప్‌‌తో 25న భారత పారిశ్రామిక దిగ్గజాల భేటీ...

Donald Trump visit to India: డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఈ నెల 25న భారత అగ్రస్థాయి పారిశ్రామిక దిగ్గజాలతో డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింతగా పెంచేందుకు ఈ భేటీ దోహదపడనుంది.

news18-telugu
Updated: February 15, 2020, 4:55 PM IST
Donald Trump visit to India: డొనాల్డ్ ట్రంప్‌‌తో 25న భారత పారిశ్రామిక దిగ్గజాల భేటీ...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి భారత పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భారత పర్యటనకు ఆహ్వానించాడు. అయితే పర్యటనలో భాగంగా ఈ నెల 25న భారత అగ్రస్థాయి పారిశ్రామిక దిగ్గజాలతో డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింతగా పెంచేందుకు ఈ భేటీ దోహదపడనుంది. కార్పొరేట్‌ దిగ్గజాలతో సీఈఓలతో ప్రెసిడెంట్ ట్రంప్ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఢిల్లీలో జరగనున్నట్లు యూఎస్ ఎంబసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ భేటీలో అమెరికన్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది.

కార్పొరేట్‌ దిగ్గజాల్లో భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, టాటాసన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, లార్సన్‌ అండ్‌ టూబ్రో చైర్మన్‌ ఏఎం నాయక్‌, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ట్రంప్‌తో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), యూఎస్‌-ఇండియా బిజినెస్‌ సమాఖ్యలు భారత ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించిన పేర్లను సూచించాయి.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు