Gas Cylinder | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ వాడే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిలిండర్ బుక్ చేయాలంటే రూ.1100 చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ ధర చుక్కల్లో ఉందని చెప్పుకోవచ్చు. గత ఏడాది కాలంలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఎంత వరకు పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు కూడా ఇదే ట్రెండ్‌లో నడిచిందా? లేదా? అని విషయాన్ని గమనిద్దాం.
గత ఏడాది కాలంలో చూస్తే.. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర 5 సార్లు మారింది. ప్రతిసారి పెరుగుతూనే వచ్చింది. అయితే దీనికి భిన్నంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం 17 సార్లు మారింది. ఇందులో 11 సార్లు సిలిండర్ ధర తగ్గితే, 6 సార్లు మాత్రమే గ్యాస్ రేటు పెరిగింది. ఏడాది కాలంలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 170 వరకు పైకి చేరింది. అదేసమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 125 మేర పెరిగింది.
కేంద్రం దసరా శుభవార్త.. తాజా నిర్ణయంతో దిగిరానున్న బంగారం, వెండి, వంట నూనె ధరలు!
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదలను గమనిస్తే.. 2021 అక్టోబర్ 6న సిలిండర్ ధర రూ. 15 మేర పెరిగింది. దీంతో సిలిండర్ రేటు రూ. 899.5కు చేరింది. 2022 మార్చి 22న సిలిండర్ రేటు రూ.50 పైకి చేరింది. దీంతో సిలిండర్ రేటు రూ. 949.5కు చేరింది. 2022 మే 7న మళ్లీ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. ఇప్పుడు సిలిండర్ రేటు రూ.999.5కు ఎగసింది. అలాగే అదే నెలలో 2022 మే 19న సిలిండర్ ధర రూ. 3.5 మేర పెరిగింది. దీంతో సిలిండర్ రేటు రూ. 1000.3కు చేరింది. 2022 జూలై 6న మరోసారి సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో ఎల్పీజీ సిలిండర్ రేటు రూ.1053కు చేరింది. ఢిల్లీలో ఈ రేట్లు వర్తిస్తాయి.
బంగారం ధర రూ.1,800 పతనం.. రూ.2,800 పడిపోయిన వెండి
మరోవైపు దేశీ మార్కెట్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గత ఏడాది కాలంలో ఏకంగా 17 సార్లు మారాయి. ఇందులో 11 సార్లు తగ్గితే.. 6 సార్లు మాత్రం సిలిండర్ రేట్లు పెరిగాయి. మొత్తంగా చూస్తే సిలిండర్ రేటు రూ. 120 మేర పైకి చేరింది. గత ఏడాది అక్టోబర్ నుంచి చూస్తే ఈ అక్టోబర్ వరకు దాదాపు ప్రతి నెలా సిలిండర్ ధరలో మార్పు ఉంటూనే వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gas, LPG, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price