దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం మెల్లగా సడలిస్తోంది కదా... అందువల్ల వంట గ్యాస్ వాడకం పెరుగుతుందనే ఉద్దేశంతో... వంటగ్యాస్ ధరను పెంచారు. వచ్చే వారం నుంచి వంటగ్యాస్ వాడకం బాగా పెరగవచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో సబ్సిడీ కాని LPG సిలిండర్ ధర రూ.11.50 పెరిగింది. జూన్ 1 నుంచి ఈ పెరుగుదల అమల్లోకి వచ్చింది. గ్యాస్ కంపెనీలు... నెల నెలా మొదటి రోజున ధరలను సవరిస్తున్నారు. అంతర్జాతీయంగా LPG ధరలు ఎలా ఉన్నాయో లెక్కలేసి... ఆ ప్రకారం... పెంచడమో, తగ్గించడమో చేస్తున్నారు.
మే నెలలో ఢిల్లీలో వంటగ్యాస్ ధర రూ.744 నుంచి రూ.581.50కి తగ్గించారు. కారణం అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు తగ్గడమే. జూన్ వచ్చేసరికి... అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగాయి. అందువల్ల తామూ పెంచాల్సి వచ్చిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. అసలే ప్రజల దగ్గర డబ్బు లేని పరిస్థితి ఉంటే... ధరలు పెరుగుతూ మరిన్ని కష్టాలు తెస్తున్నాయి. ఇలాగైతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
ఈ పెంపు... ప్రధానమంత్రి ఉజ్వల (PMUY) స్కీమ్ లబ్దిదారులకు వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది. ఈ లబ్దిదారులు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్‌లో భాగంగా... జూన్ 30 వరకూ ఉచిత సిలిండర్ పొందే ఛాన్స్ ఉంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.