• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • DOING FIXED DEPOSIT DO THIS TO AVOID TDS CUT ON YOUR INTEREST INCOME MK GH

Fixed Deposit చేస్తున్నారా..మీ వడ్డీ ఆదాయంపై TDS కట్​ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Fixed Deposit చేస్తున్నారా..మీ వడ్డీ ఆదాయంపై TDS కట్​ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

(ప్రతీకాత్మక చిత్రం)

సెక్షన్ 80 సి కింద రూ .1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కాగా, టీడీఎస్​ను ఎలా నివారించాలి? ఎఫ్‌డీలపై పన్ను ప్రయోజనాలను ఎలా పొందాలి? అనే విషయాలను పరిశీలిద్దాం.

  • Share this:
ప్రతి ఒక్కరు తాము సంపాదించిన డబ్బును భద్రపర్చుకోవడమో.. లేక పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకోవాలనో ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేస్తే.. మరికొందరు మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, ఎటువంటి నష్టభయం లేకుండా రాబడి పొందాలంటే ఫిక్స్​ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడమే మంచింది. బ్యాంకులు కూడా ఎఫ్​డీలపై మంచి వడ్డీ రేట్లనే అందిస్తున్నాయి. అయితే, ఎఫ్​డీలపై వచ్చే ఆదాయంపై పన్ను విధించబడుతుంది. అయినప్పటికీ, ఐటి రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు దీని నుంచి వచ్చే రాబడిని 'ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం' (ఇన్ కం ఫ్రమ్ అదర్ సోర్సెస్) గా పేర్కొని పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. తద్వారా, సెక్షన్ 80 సి కింద రూ .1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కాగా, టీడీఎస్​ను ఎలా నివారించాలి? ఎఫ్‌డీలపై పన్ను ప్రయోజనాలను ఎలా పొందాలి? అనే విషయాలను పరిశీలిద్దాం.

ఎఫ్​డీ వడ్డీపై పన్ను ఎందుకు విధిస్తారు?
ఫిక్స్​డ్ డిపాజిట్ల నుండి వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది మీ స్థూల ఆదాయానికి జోడించబడుతుంది. మీ మొత్తం ఆదాయానికి సంబంధించిన స్లాబ్ రేట్లపై పన్ను విధించబడుతుంది. వడ్డీ ఆదాయాన్ని మీ ఖాతాకు జమ చేసినందుకు గాను సంబంధిత బ్యాంకు ఈ పన్నును తీసివేసి మిగిలిన మొత్తాన్ని మీ ఖాతాలో జమచేస్తుంది. మీకు మూడేళ్ల ఎఫ్​డీ ఉంటే ప్రతి ఏడాది చివర్లలో టీడీఎస్​ను మినహాయిస్తుంది. అయితే, టీడీఎస్ మినహాయించినప్పటికీ మీ మొత్తం ఆదాయంలో వడ్డీ రాబడిని చేరిస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు చెల్లించాలంటే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31లోపు ఫామ్​ 26 ఏఎస్​ను సంబంధిత బ్యాంకులో సమర్పించాలి. కాగా, ఫిక్స్​డ్​ డిపాజిట్ల నుండి వచ్చే మొత్తం రాబడి ఏడాదికి రూ.40,000 కంటే తక్కువగా ఉంటే మీరు ఎటువంటి టీడీఎస్ కట్టాల్సిన పనిలేదు. అదే, 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్ల విషయంలో మీకు రూ .50,000 వరకు మినహాయింపు వర్తిస్తుంది.

ఏ ఏ సందర్భాల్లో టీడీఎస్​ మినహాయింపు?
1. ఫిక్స్​డ్​ డిపాజిట్ల నుండి మీ రాబడి 40 వేలకంటే మించి ఉంటే 10 శాతం టీడీఎస్​ చెల్లించాలి. మీ పాన్​ నెంబర్​ను బ్యాంకుకు సమర్పించకపోతే వారు మీ డిపాజిట్​ నుంచి 20 శాతం టీడీఎస్​ను తీసివేస్తారు.
2. ఎఫ్​డీ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు టీడీఎస్​ తీసివేయరు.
3. ఫారం 15జీ, 15 హెచ్​ను సంబంధిత బ్యాంకుకు సబ్​మిట్​ చేయడం ద్వారా టీడీఎస్​ మినహాయింపు పొందవచ్చు.
4. ఫిక్స్​డ్​ డిపాజిట్లు, పొదుపు ఖాతాలు, ఇతర డిపాజిట్ల నుంచి ఆదాయం పొందే సీనియర్​ సిటిజన్లు ఏడాదికి రూ.50 వేల పరిమితి వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

పోస్టాఫీసు ఎఫ్​డీలపై టీడీఎస్​ మినహాయింపు..
పన్ను ఆదా చేసుకోవాలంటే మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సాధారణ సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు కోరవచ్చు. ఓ వ్యక్తి పాత లేదా పస్తుతం అమల్లో ఉన్న ట్యాక్స్​ పద్ధతిని ఎంచుకుంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్​ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, ఐదేళ్ల లాక్​ ఇన్​ వ్యవధి గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై అకాల ఉపసంహరణ అనుమతించబడదు. ఒకవేళ, డబ్బులు అత్యవసరమైతే ఎఫ్​డీ ఉపసంహరించుకునే బదులు రుణం తీసుకోవడం లాభిస్తుంది. కాగా, ఫిక్స్​డ్​ డిపాజిట్లపై టీడీఎస్​ కట్​ కాకుండా ఉండాలంటే మరో తెలివైన పద్ధతి.. బ్యాంకులకు బదులు పోస్టాఫీసులలో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయడం. ఎందుకంటే, పోస్టాఫీస్​ ఎఫ్‌డీలపై టీడీఎస్​ ఉండదు. 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లలో జమ చేస్తే, డిపాజిటర్లు రూ. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 సి కింద 1,50,000 పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పోస్టాఫీసు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు మార్కెట్లో లభించే వాటి కంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం, ఒకటి నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో 5.5 శాతం నుండి 6.7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

ఆన్​లైన్​ ద్వారా ఎలా ఫైల్​ చేయాలి?
టీడీఎస్​ మినహాయింపు కోరేందుకు సంబంధిత బ్యాంకుకు ఫారం 15 జీ / ఫారం 15 హెచ్‌ సమర్పించాలి. అయితే, ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌ కూడా చేయవచ్చు. దీని కోసం ముందుగా.. మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కు వెళ్లి యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​ వివరాల ద్వారా లాగిన్​ అవ్వండి. ట్యాక్స్​ సెక్షన్​లోకి వెళ్లి ఫారం 15 జీ / ఫారం 15 హెచ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫారంలో తగిన వివరాలను పొందుపర్చి సబ్​మిట్ చేయండి. రసీదు స్లిప్​ను డౌన్‌లోడ్ చేసుకోని, సర్వీస్​ రిక్వెస్ట్​ నంబర్​ను నోట్​ చేసుకోండి.
First published:

అగ్ర కథనాలు