భారీ వర్షం కురిస్తే నీట మునగని నగరాలు ఉన్నాయా అంటే చాలా తక్కువే అని చెప్పాలి. ముంబయి, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో సైతం వరదలు వస్తున్నాయి. ఈ క్రమంలో ద్విచక్రవాహనాలు, కార్లు పాడైపోతాయి. కొన్నిసార్లు పాక్షికంగా వాహనాలు దెబ్బతింటే... ఇంకొన్నిసార్లు పూర్తిగా పనికిరాకుండా పోతాయి. ఇలాంటప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. వర్షాకాలం వచ్చేసింది... ఈ నేపథ్యంలో మోటార్ ఇన్సూరెన్స్‌లో ఉపయోగపడే కొన్ని యాడ్ ఆన్స్ గురించి చూద్దాం!
తుపాను, భారీ వర్షాల వల్ల వాహనాలకు రెండు రకాల డ్యామేజీలు అవుతాయి. అందులో ఒకటి వాహనం ఎక్స్టీరియర్ దెబ్బతినడం. ఇలాంటి సమస్యలకు ఓన్ డ్యామేజీ ఇన్సూరెన్స్ నుంచి రికవరీ చేయొచ్చు. ఇక రెండో డ్యామేజీలో.. ఇంజిన్‌లో సమస్యలు, మెకానికల్ పార్ట్ సమస్యలు వంటివి ఉంటాయి. అయితే వీటిని సాధారణ మోటార్ ఇన్సూరెన్స్‌తో రికవరీ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే నీళ్లు చేరిపోవడం, వాహనాలు మునిగిపోవడం అనేది మానవ కల్పితం. అందువల్ల వీటికి రికవరీ ఉండదు, ఉన్నా తక్కువగా ఉంటుంది. అందుకే దీని కోసం యాడ్ ఆన్స్ ఉండాల్సిందే.
* సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇంజిన్ ప్రొటక్షన్ ఉండదు. ఇంజిన్లోకి నీళ్లు చేరడం వల్ల జరిగే నష్టం పూడ్చడానికి ఇంజిన్ ప్రొటక్టర్ యాడ్ ఆన్ తీసుకోవాలి. దీని వల్ల వరదలు, భారీ వర్షాల వల్ల వాహనాలకు కలిగే నష్టాన్ని ఇన్సూరెన్స్ సంస్థల నుంచి రికవరీ చేయవచ్చు.
* మోటార్ ఇన్సూరెన్స్‌లో నిపుణులు ఎక్కువగా సూచించే యాడ్ ఆన్ జీరో డిప్రెసియేషన్ కవర్. డ్యామేజీ అయిన కారు విడిభాగాలకు కూడా పూర్తి డబ్బును ఈ యాడ్ ఆన్ ద్వారా పొందవచ్చు. ఎందుకంటే సాధారణ పాలసీ పార్టులకు రీప్లేస్మెంట్ వాల్యూ రాదు. కేవలం రీఎంబర్స్ వాల్యూ వస్తుంది. ఈ రెండింటికీ తేడా పార్టు తరుగును తగ్గించి డబ్బులు వెనక్కి ఇవ్వడం. కాబట్టి రిఫండ్‌లో తరుగు మొత్తం తగ్గకుండా ఉండేలా జీరో డిప్రెసియేషన్ యాడ్ ఆన్ ఉండాల్సిందే.
* మోటార్ ఇన్సూరెన్స్‌లోని లేని, యాడ్ ఆన్స్‌లో వచ్చే ఆప్షన్లలో 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఒకటి. 24 గంటలపాటు యూజర్‌కు వేకిల్కు సంబంధించిన సాయం చేయడం దీని ప్రత్యేకత. రీఫ్యూయల్, టోయింగ్, టైరు పంక్చర్, బ్యాటరీ సంబంధిత సమస్యలు, మెకానిక్ సర్వీసు, కారు బ్రేక్ డౌన్ వంటివి అయినప్పుడు ఈ యాడ్ పనికొస్తుంది. ఈ యాడ్ ఉన్న వారికి ఇన్సూరెన్స్ సంస్థ అత్యవసర సాయం అందిస్తుంది. టాక్సీ సర్వీసు, అత్యవసర వసతి లాంటివి ఏర్పాటు చేస్తుంది.
ఇంకేముంది ఒకసారి మీ మోటార్ పాలసీ రెన్యువల్ డేట్ ఎంతవరకు వచ్చిందో చూసుకొండి. తేదీ దగ్గర పడి ఉంటే.. వెంటనే రెన్యూవల్ చేయించుకోండి. ఈ క్రమంలో పై యాడ్ ఆన్లు అవసరం అయితే యాడ్ చేసుకోండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.