కల్తీ లేని బంగారంతో తయారు చేసిన నగలు కొనాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ తాము కొన్న నగల్లో బంగారం కల్తీ అయిందా లేదా అని సులువుగా తెలుసుకోవడం కష్టం. అందుకే కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మాల్‌మార్కింగ్ (Gold Hallmarking) నిబంధనల్ని కఠినతరం చేసింది. నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది. బంగారు ఆభరణాలపై ఉన్న హాల్‌మార్క్ ఆధారంగా కస్టమర్లు బంగారం స్వచ్ఛతపై ఓ అంచనాకు వస్తారు. నగలు 18 క్యారెట్ల నగలైతే 18K మార్క్, 22 క్యారెట్ల నగలైతే 22K మార్క్ ఉంటుంది. అయితే ఇటీవల నకిలీ హాల్‌మార్క్‌తో నగలు అమ్ముతున్నట్టు హాల్‌మార్కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (HFI) చెప్పడం సంచలనంగా మారింది.
భారతదేశంలో కొందరు నగల వ్యాపారులు నకిలీ హాల్‌మార్క్‌తో నగల్ని అమ్ముతున్నారు. ఆభరణాలపై హాల్‌మార్క్ గుర్తు ఉంటే అది ఒరిజినలే అని కస్టమర్లు నమ్ముతున్నారు. మరి ఒరిజినల్ హాల్‌మార్క్‌ను ఎలా గుర్తించాలి? చాలా సింపుల్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గతేడాది బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ గుర్తుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త హాల్‌మార్కింగ్‌లో మొత్తం మూడు గుర్తులు ఉంటాయి. మొదటిది BIS స్టాండర్డ్ మార్క్. ఇది త్రిభుజాకార గుర్తులా ఉంటుంది. రెండోది బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తు. 22క్యారెట్ నగలైతే 22K916 అని, 18క్యారెట్ గోల్డ్ అయితే 18K750 అని, 14క్యారెట్ ఆభరణాలైతే 14K585 అని ముద్ర ఉంటుంది.
Govt Loan: మీరు చిరు వ్యాపారులా? మోదీ ప్రభుత్వం నుంచి రూ.50,000 వరకు లోన్
Anyone can verify the authenticity of HUID on Hallmarked gold jewellery by clicking on the ‘Verify HUID’ tile in the BIS Care app. To know more about your jeweller & hallmarked article is simple & easy.@jagograhakjago @PiyushGoyal @AshwiniKChoubey @PIB_India @PTI_News pic.twitter.com/TSEgwmbVRf
— Bureau of Indian Standards (@IndianStandards) December 2, 2022
ఇక మూడవ చిహ్నం HUID నెంబర్ అని పిలువబడే ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. హెచ్‌యూఐడీ అంటే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఈ ఆరు అంకెల కోడ్‌లో అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి HUID నెంబర్ ముద్ర వేస్తారు. ఈ సంఖ్య ప్రత్యేకమైనది. అంటే ఒకే HUID నంబర్‌తో రెండు ఆభరణాలు ఉండవు. కొత్త హాల్‌మార్క్ నిబంధనలు వచ్చిన తర్వాత కొన్న నగలకే ఈ ముద్రలు ఉంటాయి. పాత ఆభరణాలైతే పాతపద్ధతిలో హాల్‌మార్క్ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
మీరు కొత్త హాల్‌మార్క్ రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత నగలు కొంటే, వాటిపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇవన్నీ ఉంటే అసలైన హాల్‌మార్క్ నగలుగా నమ్మొచ్చు. అయితే HUID నెంబర్ ఉన్నంతమాత్రానా నమ్మేయాల్సిన అవసరం లేదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాప్‌లో HUID నెంబర్ చెక్ చేసి అవి అది నిజమైనదేనా కాదా అన్నది తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అయి మీ బంగారు నగలపై ఉన్న హాల్‌మార్క్, HUID నెంబర్ వెరిఫై చేయండి.
LIC Policy: నెలకు రూ.1200 ప్రీమియం... రూ.25 లక్షల బెనిఫిట్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో BIS CARE యాప్ ఇన్‌స్టాల్ చేయండి. BIS CARE యాప్ ఓపెన్ చేసి verify HUID పైన క్లిక్ చేయండి. నగలపై కనిపించే HUID నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఒకవేళ ఆ నగలపై ఉన్న HUID నెంబర్ సరైనదే అయితే హాల్‌మార్క్ వేయించిన నగల వ్యాపారి పేరు, వ్యాపారి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌మార్క్ వేయించిన కేంద్రం పేరు, రికగ్నిషన్ నెంబర్, అడ్రస్, నగల రకం, హాల్‌మార్క్ వేసిన తేదీ, బంగారం స్వచ్ఛత లాంటి వివరాలన్నీ స్క్రీన్ పైన కనిపిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold jewellery, Gold ornmanets, Gold Prices