Reliance Jio-Facebook deal : జియోతో డీల్ వల్ల టాప్ టెక్ ఇన్వెస్టర్‌గా ఫేస్‌బుక్?

Reliance jio-Facebook Mega Deal : ప్రస్తుతం దేశంలో అతి పెద్ద టెక్ పెట్టుబడిదారుగా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ రెండో స్థానానికి చేరబోతోందా?

news18-telugu
Updated: April 22, 2020, 1:10 PM IST
Reliance Jio-Facebook deal : జియోతో డీల్ వల్ల టాప్ టెక్ ఇన్వెస్టర్‌గా ఫేస్‌బుక్?
జియోతో డీల్ వల్ల ఇండియాలో టాప్ టెక్ ఇన్వెస్టర్‌గా ఫేస్‌బుక్ నిలవబోతోందా?
  • Share this:
Reliance jio-Facebook Mega Deal : రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను కొనడం, రూ.43,574 కోట్లకు వాటాను దక్కించుకోవడంతో... ఫేస్‌బుక్ పెట్టిన ఈ పెట్టుబడులపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. ఇండియాలో అత్యంత ఎక్కువ పెట్టుబడి పెట్టిన టెక్నాలజీ ఇన్వెస్టర్ల సరసన ఫేస్‌బుక్ చేరబోతోంది. ఇప్పటివరకూ ఇండియాలో అత్యంత ఎక్కువ పెట్టుబడి పెట్టినన టెక్నాలజీ సస్థగా జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ ఉంది. ఈ సంస్ధ ఇండియాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఫ్లిప్‌కార్ట్, ఓలా, ఓయో సహా... డజన్ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టింది.

జియో-ఫేస్‌బుక్ డీల్ ప్రత్యేకమైనది. ప్రపంచంలో... ఓ టెక్నాలజీ కంపెనీ... తక్కువ వాటాని ఎక్కువ పెట్టుబడికి కొన్న డీల్ ఇదే. అంతేకాదు... టెక్నాలజీ సెక్టార్‌లో భారత్‌లోకి వచ్చిన అతి పెద్ద FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) ఇదే. ఈ క్రమంలో... ఫిప్‌కార్ట్‌లో... 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన సాఫ్ట్‌బ్యాంక్ రెండో స్థానంలో నిలుస్తోంది.

ఫేస్‌బుక్‌కి ఇది ఇండియాలో మూడో డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. గతేడాది ఈ సంస్త... సోషల్ కామర్స్ సంస్థ మీషో (Meesho), ఆన్‌లైన్ లెర్నింగ్ సంస్థ ఉనాకాడెమీ (Unacademy)లో పెట్టుబడి పెట్టింది. కాకపోతే... ఆ పెట్టుబడులు చాలా తక్కువ... 20-30 మిలియన్ డాలర్ల మధ్యే ఉన్నాయి.

ఇటీవల సాఫ్ట్‌బ్యాంక్ ట్రాక్ రికార్డ్ పడిపోయింది. ఇప్పట్లో మరే ఇతర కంపెనీ కూడా ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదని ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అభిప్రాయపడ్డారు. ఐతే... ఫేస్‌బుక్, సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులను సరిపోల్చి చూడలేమన్న ఆ బ్యాంకర్... రెండు సంస్థల పెట్టుబడి సిద్ధాంతాలు వేరు వేరు అన్నారు.

ఫేస్‌బుక్ చాలా తెలివిగా ఈ పెట్టుబడులు పెట్టింది. ఎందుకంటే... ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టిన మీషో, ఉనాకాడెమీ కంపెనీలు... వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ని బాగా వాడుకుంటున్నాయి. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకొని అమ్ముకుంటున్నాయి. అదే సమయంలో సాఫ్ట్‌బ్యాంక్... తన విజన్ ఫండ్ నుంచి ఇన్వెస్ట్ చేసింది. ఫైనాన్షియల్ రిటర్న్స్ కోసం ఈ పెట్టుబడులు పెట్టింది.

సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కి చెక్ పెట్టేందుకు కూడా ఫేస్‌బుక్ ఈ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. గూగుల్ కూడా ఇండియాలో టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది.
First published: April 22, 2020, 1:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading