Home /News /business /

DOCUMENTS FOR AADHAAR UIDAI ACCEPTS THESE 27 PROOF OF IDENTITY DOCUMENTS CONTAINING NAME AND PHOTO FOR AADHAAR UPDATE SS

Documents For Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లండి

Documents For Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లండి
(ప్రతీకాత్మక చిత్రం)

Documents For Aadhaar: ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లండి (ప్రతీకాత్మక చిత్రం)

Documents For Aadhaar | ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయాలనుకునేవారికి అలర్ట్. ఆధార్ కార్డ్ (Aadhaar Card) అప్‌డేట్ చేసేవారు ఐడెంటిటీ ప్రూఫ్‌గా 27 డాక్యుమెంట్స్ సమర్పించవచ్చని యూఐడీఏఐ తెలిపింది.

ఆధార్ కార్డ్... యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పౌరులకు జారీ చేసే గుర్తింపు కార్డ్ ఇది. పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme) లాంటి పథకాల నుంచి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవరకు (IT Returns Filing) ఆధార్ కార్డ్ తప్పనిసరి అవుతోంది. అందుకే ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్‌గా ఉండటం అవసరం. వివరాలు మార్చాలనుకునేవారు ఆధార్ సెంటర్ (Aadhaar Centre) లేదా ఆధార్ సేవా కేంద్రానికి (Aadhaar Seva Kendra) వెళ్లి తమ ఆధార్ వివరాలను అప్‍‌డేట్ చేస్తుంటారు. అయితే ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయించడానికి ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఓ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్ అప్‌డేట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వెరిఫికేషన్ కోసం యూఐడీఏఐ 27 ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అంగీకరిస్తుంది. వాటిపై పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఆ 27 డాక్యుమెంట్స్ ఇవే.

SBI Alert: ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ కొత్త రూల్ గుర్తుంచుకోండి... ఈ స్టెప్స్ ఫాలో అవండి


1. పాస్‌పోర్ట్

2. పాన్ కార్డ్ లేదా ఇ-పాన్

3. రేషన్ కార్డ్

4. ఓటర్ ఐడీ కార్డ్ లేదా ఇ-వోటర్ ఐడీ

5. డ్రైవింగ్ లైసెన్స్

6. ఆయుధాల లైసెన్స్

7. ఫోటో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డ్

8. ఫోటో ఉన్న క్రెడిట్ కార్డ్

9. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్.

10. పెన్షనర్ ఫోటో కార్డ్ లేదా ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డ్

11. కిసాన్ ఫోటో పాస్‌బుక్

12. రాష్ట్రీయ స్వస్త్య బీమా యోజన కార్డ్ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన CGHS/ ECHS/ ESIC/ మెడిక్లెయిమ్ కార్డ్

13. వికలాంగుల ఐడీ కార్డ్ లేదా హ్యాండిక్యాప్ట్ మెడికల్ సర్టిఫికెట్

14. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన బామాషా, నివాస ధృవీకరణ పత్రం, జన్ ఆధార్, రెసిడెన్స్ సర్టిఫికెట్, MGNREGA/ NREGS జాబ్ కార్డ్.

15. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్.

16. ఫోటోగ్రాఫ్‌తో ఎస్‌టీ, ఎస్‌సీ, ఓబీసీ సర్టిఫికెట్

17. గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి స్కూల్ ఐడెంటిటీ కార్డ్, ఫోటో ఐడీ కార్డ్

18. గుర్తింపు పొందిన యూనివర్సిటీ, బోర్డు జారీ చేసిన స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్, మార్క్స్ షీట్

19. బ్యాంకు స్టాంప్ ఉన్న బ్యాంక్ పాస్‌బుక్

20. ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డ్

21. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్, పార్శీలు, క్రిస్టియన్లకు ఫారిన్ పాస్‌పోర్టుతో లాంగ్ టర్మ్ వీసా

22. గత 12 నెలల్లో భారతదేశంలో 182 రోజులకు పైగా నివసించిన విదేశీయులకు వీసా, ఫారిన్ పాస్‌పోర్ట్.

23. యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్‌లో ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీ, మునిసిపల్ కౌన్సిలర్, తహసీల్దార్, గెజిటెడ్ ఆఫీసర్, ఈపీఎఫ్ఓ ఆఫీసర్, షెల్టర్ హోమ్ సూపరింటెండెంట్, వార్డెన్, మ్యాట్రన్, విద్యా సంస్థకు చెందిన హెడ్, విలేజ్ పంచాయతీ హెడ్, విలేజ్ పంచాయతీ సెక్రెటరీ, వీఆర్ఓ జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ లెటర్.

24. పూర్తి పేరు లేదా ఇంటి పేరు మార్చాలనుకుంటే కొత్త పేరుతో గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు పాత పేరు ఉన్న ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్.

25. విడాకులకు సంబంధించిన పత్రం.

26. దత్తత తీసుకున్నట్టు సర్టిఫికెట్.

27. లింగ మార్పిడి చేసుకున్నట్టైతే అల్లోపతి డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికెట్.

Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి



ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, పేరు అప్‌డేట్ చేయించడం, తప్పులు సరిదిద్దుకోవడం, ఇతర వివరాలు అప్‌డేట్ చేయడం కోసం ఆధార్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు