మన దేశంలో వ్యక్తులు లేదా సంస్థలు సంపాదించే డబ్బుపై ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆదాయపన్ను చట్టంలో నియమ నిబంధనలు ఉన్నాయి. ఎలాంటి మార్గాల్లో ఎంత మొత్తంలో ఆదాయం వచ్చిందనే అంశాలపై ట్యాక్స్ రేట్లు ఆధారపడి ఉంటాయి. లాటరీ ద్వారా అందిన సంపదపై సైతం ట్యాక్స్ కట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆదాయపన్ను చట్టంలో ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయో తెలుసుకుందాం.ఉదాహరణకు ఒక వ్యక్తి లక్కీ డ్రా సిస్టమ్లో ఒక స్లాట్ బుక్ చేశారు అనుకుందాం. అతడి వార్షిక ఆదాయం రూ.2 లక్షలుగా పరిగణిద్దాం. ఈ డ్రాలో అతడు కారు గెల్చుకున్నప్పుడు... డెవలపర్ 30 శాతం ట్యాక్స్ వసూలు చేసి, దాని కోసం TDS సర్టిఫికేట్ జారీ చేశాడు అనుకుందాం. ఈ మొత్తాన్ని రీఫండ్ చేసుకోవచ్చా? రిబేట్ వర్తిస్తుందా? వంటి విషయాలు చూద్దాం.
లాటరీ రూపంలో లేదా అలాంటి మార్గాల ద్వారా అందుకున్న అన్ని రకాల ఆదాయం, వస్తువుల విలువపై ట్యాక్స్ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115BB కింద దీనికి 30 శాతం ఫ్లాట్ రేటుతో ట్యాక్స్ వర్తిస్తుంది. లక్కీ డ్రాలో గెలుచుకున్న మోటార్ కారు, బైక్, ఇతర మోటారు వాహనాలు కూడా లాటరీ విభాగంలోకి వస్తాయి. అందువల్ల ఈ మోటార్ కారు విలువ నుంచి డెవలపర్ ట్యాక్స్ వసూలు చేయవచ్చు.
కారు గెల్చుకున్న వ్యక్తి రిటర్నులు దాఖలు చేసేటప్పుడు.. ఇలాంటి ఆదాయాన్ని కూడా అందులో చేర్చాల్సి ఉంటుంది. అయితే దీనికి TDS పొందవచ్చు. కానీ లక్కీ డ్రా ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ వర్తిస్తుంది. TDS రేటు కూడా అంతే ఉంటుంది. అందువల్ల బహుమతి గెల్చుకున్న వారు రీఫండ్ ఆశించకపోవడమే మంచిది. అయితే లబ్ధిదారుడు లక్కీ డ్రాలో గెల్చుకున్న కారు విలువతో కలిపి అతడి మొత్తం ఆదాయం రూ .5 లక్షల లోపు ఉంటే.. IT చట్టంలోని సెక్షన్ 87A ప్రకారం అతడు రూ.12,500 వరకు రిబేట్ పొందవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.