DO YOU WANT TO START NEW BUSINESS KNOW HOW TO APPLY FOR AADHAAR FRANCHISE LICENSE SS
Business Idea: నష్టాలు ఉండని ఎవర్గ్రీన్ బిజినెస్ ఐడియా... మీరూ స్టార్ట్ చేయండి ఇలా
Business Idea: నష్టాలు ఉండని ఎవర్గ్రీన్ బిజినెస్ ఐడియా... మీరూ స్టార్ట్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Business Idea | మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? బిజినెస్ ఐడియా కోసం ఆలోచిస్తున్నారా? తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారం ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.
వ్యాపారం చేయాలంటే నష్టాలు వస్తాయన్న భయం. కానీ కొన్ని వ్యాపారాల్లో లాభాలు తప్ప నష్టాలు ఉండవు. అలాంటి వ్యాపారం ఎంచుకుంటే మంచి లాభాలు సంపాదించొచ్చు. తక్కువ పెట్టుడితో (Low investment business) ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటే ఇంకా మంచిది. మరి మీరు కూడా అలాంటి బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా (Business Idea) గురించి ఆలోచించొచ్చు. ఆధార్ కార్డ్ గురించి పరిచయం అవసరం లేదు. భారతీయులందరికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఈ రోజుల్లో ప్రతీ చిన్న పనికి ఆధార్ కార్డ్ అవసరం అవుతోంది. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాల కోసం కూడా ఆధార్ తప్పనిసరే. అందుకే ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడం కామన్.
ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేయించడానికి వెళ్లినప్పుడు అక్కడ ఛార్జీలు ఉంటాయి. ఆ ఛార్జీల ద్వారా ఆధార్ సెంటర్లకు లాభమే. మరి మీరు ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ తీసుకుంటే ఈ లాభం పొందొచ్చు. ఇందుకోసం మీరు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ కావాలంటే ఓ పరీక్ష పాస్ కావాలి. ఆధార్ ఫ్రాంఛైజ్ లైసెన్స్ ఇచ్చేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. యూఐడీఏఐ సర్టిఫికేషన్ కోసం ఈ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
ముందుగా NSEIT వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆ తర్వాత Create New User ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
అక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్స్, షేర్ కోడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఆధార్ https://resident.uidai.gov.in/offline-kyc వెబ్సైట్లో ఆఫ్లైన్ ఇ-ఆధార్ వివరాలను డౌన్లోడ్ చేయొచ్చు.
ఆ తర్వాత వాటిని అప్లోడ్ చేయాలి.
మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
ఆ వివరాలతో లాగిన్ చేయాలి.
ఆ తర్వాత ఇతర వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి.
ఒకటి రెండు రోజుల్లో మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు దగ్గర్లో ఉన్న సెంటర్ బుక్ చేసి అక్కడ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష విజయవంతంగా పూర్తి చేసినవారికి సర్టిఫికెట్ లభిస్తుంది. ఆ తర్వాత ఆధార్ రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ పూర్తి చేయాలి. ఆ తర్వాత కామన్ సర్వీస్ సెంటర్లో రిజిస్టర్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.