'నేనెలాగైనా ధనవంతుడిని అవ్వాలి' మనసులో ఈ మాటను బలంగా తలచుకుంటే డబ్బులు సంపాదించవచ్చా? అంటే కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ధనవంతుడు కావడానికి కేవలం డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉంటే సరిపోదు. దాంతోపాటు 'నీవెవరు?' అనేది కూడా ముఖ్యమట. ఇటీవల బ్రిటిష్ జర్నల్ సైకాలజీలో ప్రచురించిన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది. ఆ అధ్యయనంలో ఇంకా ఏం చెప్పారో చూద్దామా!
ధనవంతులు కావాలంటే ఆ వ్యక్తి కచ్చితంగా ఎక్స్ట్రావర్ట్ అయి ఉండాలట. అంటే అందరితోనూ కలిసిపోతూ ఉండాలి. ఎందుకంటే ఎవరూ తనంత తాను కష్టపడితే ధనవంతుడు కాలేడట. ఇతరులతో అవసరానికి తగ్గట్టుగా మాట్లాడుతూ, మోటివేట్ చేస్తూ, స్ఫూర్తిగా ఉండాలట. అయితే ఈ క్రమంలో జెన్యూన్‌గా ఉండటమూ ముఖ్యమట. అలా అని ఇంట్రావర్ట్‌లు సక్సెస్ కాలేరు అని చెప్పలేం.
IRCTC Goa Tour: హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో గోవా టూర్... ప్యాకేజీ వివరాలివే
Salary Hike: ఉద్యోగులకు అలర్ట్... వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం పెరుగుతుంది
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఉన్నవాళ్లు ఎప్పుడూ స్మార్ట్‌గా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. మనకు వచ్చింది చేయడం కాకుండా, మనం మాత్రమే చేయగలిగే పనులు చేయాలి. మనస్సాక్షికి విలువ ఇచ్చి పని చేసేవాళ్లు ఎక్కువగా విజయాలు సాధిస్తారట. అలాంటివారికే ప్రమోషన్లు, డబ్బు దక్కుతాయట.
ధనవంతులు ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా... ఫీలింగ్స్‌ను అదుపులో పెట్టుకోవాలి. నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎమోషన్స్‌ను బాగా అదుపులో పెట్టుకునేవాడు విజయం సాధిస్తాడట. దాంతోపాటు డబ్బు కూడా.
UMANG App: ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ డబ్బులు డ్రా చేయండి ఇలా
మనసులో ఆందోళన, భయం లాంటివి ఎక్కువగా ఉన్నవాళ్లు డబ్బులు సంపాదించడంలో వెనుకబడతారట. ప్రతి విషయంలోనూ నెగిటివ్‌గా రెస్పాండ్ అయ్యే కన్నా... పాజిటివ్‌గా ఆలోచించాలి. మన చుట్టూ నెగిటివిటీ ఉండకుండా చూసుకోవాలని సైకాలజిస్ట్‌లు చెప్పేది అందుకే.
బాగా డబ్బు సంపాదించాలి అనుకునేవాళ్లు తన గురించే తాను ఆలోచించుకోవాలట. ఇది నెగిటివ్ పాయింట్‌లా కనిపించొచ్చు కానీ... మీ విజయం గురించి, మీ లక్ష్యం గురించి మీరు ఆలోచించుకుంటేనే విజయం, డబ్బు సాధించగలరు. అలా అని విజయం, డబ్బు కేవలం ఒక్కరి వల్లనే అవ్వదు. కలెక్టివ్ ఎఫర్ట్ ఉండాలి. అయితే దాని కంటే ముందు ఎవరి గురించి వాళ్లు ఆలోచించుకోవాలి.
మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే... జీవితంలో ఉన్నత స్థానాలను చూసినవాళ్లు... అందరూ ఇలా పై ఐదు లక్షణాలను తమలో పునికిపుచ్చుకున్నవాళ్లే. ఇలాంటి వ్యక్తి ఇతరులతో, తన దగ్గరవాళ్లతో కలసి పని చేసి సులభంగా ధనవంతుడు కావొచ్చు. కాబట్టి డబ్బు సంపాదించడానికి కేవలం సంపాదించాలనే కోరిక ఒక్కటే కాదు, దానికి మానసికంగా మనం ఎంతవరకు సంసిద్ధం అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance