Home /News /business /

Savings Account: బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలో తెలుసా?

Savings Account: బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలో తెలుసా?

Savings Account: బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

Savings Account: బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Savings Account | మీరు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ (Savings Account) ఓపెన్ చేయాలనుకుంటున్నారా? మీకు ఏది సరైన అకౌంట్ అనుకుంటున్నారు? అసలు సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలు? తెలుసుకోండి.

    జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వస్తుందో చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అకౌంట్ (Savings Account) ఉండటం చాలా ముఖ్యం. అనుకోని గడ్డు పరిస్థితుల్లో సరిపడా డబ్బు అందించడంలో సేవింగ్స్ అకౌంట్లు చాలా సహాయపడతాయి. వేతన జీవులు, నెలవారీ ఆదాయం పొందేవారికి సేవింగ్ అకౌంట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బులు భద్రపరుచుకోవడానికే కాదు మంచి రాబడికి కూడా సేవింగ్స్ అకౌంట్ ఉత్తమ మార్గంగా నిలుస్తుంది. ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్‌లోని మొత్తంపై వార్షిక వడ్డీని (Annual Interest) అందుకోవచ్చు. ఈ వడ్డీ రేటు అనేది బ్యాలెన్స్ మొత్తం, బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది.

    సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్‌కు అవసరమైన మినిమమ్ బ్యాలెన్స్ కరెంట్ అకౌంట్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇది బ్యాంకును బట్టి మారుతుంది. ప్రతి ఒక్కరికి ఇది ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే దీని ద్వారా అనేక ఆర్థిక లావాదేవీలు జరపవచ్చు. అంతేకాదు సేవింగ్స్ అకౌంట్ అనేది సులభమైన లిక్విడిటీని అందిస్తూనే మీ డబ్బును భద్రపరచే సురక్షితమైన మార్గం. మరి భారతదేశంలో ఎన్ని రకాల సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు ఏమిటి? వంటి విషయాలు తెలుసుకుందాం. సేవింగ్స్ అకౌంట్ రకాలు తెలుసుకోండి.

    Credit Card Charges: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 6 రకాల ఛార్జీలతో జాగ్రత్త

    best savings account, best savings account 2021, online savings account, Savings account types, savings account vs current account, types of savings accounts, what is a savings account, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటీ, సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలు, సేవింగ్స్ అకౌంట్‌తో లాభాలు
    ప్రతీకాత్మక చిత్రం

    1. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ (Regular Savings Account)


    ఇది ప్రాథమిక నిబంధనలు, షరతులపై తెరిచే సేవింగ్స్ ఖాతా. ప్రతీ బ్యాంకులో ఈ ఖాతా తెరవొచ్చు ఈ అకౌంట్లో తరచుగా డిపాజిట్ చేయరు. దీన్ని డబ్బును సురక్షితంగా దాచే ఒక సేఫ్ హౌజ్ గా భావిస్తారు.

    2. జీతం ఆధారిత సేవింగ్స్ అకౌంట్ (Salary-based Savings Account)


    ఉద్యోగుల జీతాల పంపిణీ కోసం.. కంపెనీల కోరిక మేరకు ఈ ఖాతాలను బ్యాంకులు తెరుస్తాయి. ఈ తరహా ఖాతాలకు బ్యాంకులు ప్రాధాన్యత రేట్లు, నిబంధనలను అందిస్తాయి. జీతాల చెల్లింపు తేదీ వచ్చినప్పుడు, బ్యాంకులు కంపెనీ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసి పంపిణీ చేస్తాయి. శాలరీ అకౌంట్స్‌కు కనీస బ్యాలెన్స్ అవసరం ఉండదు. అయితే వరుసగా 3 నెలలపాటు జీతం క్రెడిట్ కాకపోతే.. ఈ ఖాతాలు రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్స్‌గా మారతాయి.

    Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే రూ.1 కోటి రిటర్న్స్

    best savings account, best savings account 2021, online savings account, Savings account types, savings account vs current account, types of savings accounts, what is a savings account, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటీ, సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలు, సేవింగ్స్ అకౌంట్‌తో లాభాలు
    ప్రతీకాత్మక చిత్రం

    3. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్ (Senior Citizens Savings Accounts)


    ఈ ఖాతాలు రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ మాదిరిగానే పనిచేస్తాయి. అయితే ఇది సీనియర్ సిటిజన్‌లకు అధిక వడ్డీ రేట్లతో సహా బ్యాంకింగ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఇవి ఇతర సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లకు లింక్ అవుతాయి. బ్యాంకులు సీనియర్ సిటిజన్ల రిటైర్మెంట్ ఖాతాలు లేదా పెన్షన్ ఫండ్‌ల నుంచి నిధుల బదిలీ నిమిత్తం వీటిని సేవింగ్స్ ఖాతాకు లింక్ చేస్తాయి. ఇవి ఒకే బ్యాంక్ ఖాతా కింద అన్ని నిధులను ఏకీకృతం చేస్తాయి.

    4. మైనర్‌ల సేవింగ్స్ అకౌంట్ (Minors’ Savings Accounts)


    ఈ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. బ్యాంకింగ్ సౌకర్యాలు, సేవింగ్స్ అకౌంట్ల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం కోసమే మైనర్ సేవింగ్ ఖాతాలు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లలకి 10 ఏళ్లు వయస్సు వచ్చే వరకు ఈ రకమైన అకౌంట్‌ను తెరిచి నిర్వహించవచ్చు. 10 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు సొంతంగా ఖాతాను నిర్వహించవచ్చు. పిల్లలకి 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ ఖాతా రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మారుతుంది.

    Pension Scheme: నెలకు రూ.1,78,000 పెన్షన్... ఎంత పొదుపు చేయాలో తెలుసా?

    best savings account, best savings account 2021, online savings account, Savings account types, savings account vs current account, types of savings accounts, what is a savings account, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటీ, సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలు, సేవింగ్స్ అకౌంట్‌తో లాభాలు
    ప్రతీకాత్మక చిత్రం

    5. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ (Zero Balance Savings Account)


    ఇది సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లక్షణాలను కలిపి వేస్తుంది. విత్‌డ్రా మొత్తాలపై పరిమితులు ఉన్నప్పటికీ.. బ్యాలెన్స్ నిర్దేశించిన కనిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నా ఎలాంటి పెనాల్టీలు విధించరు.

    6. మహిళల సేవింగ్స్ అకౌంట్ (Women’s Savings Account)


    మహిళా ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ రకమైన అకౌంట్లు ప్రత్యేక ఫీచర్లతో వస్తాయి. ఈ ప్రయోజనాలలో కొన్ని కొనుగోళ్లపై తగ్గింపులు, రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు, డీమ్యాట్ ఖాతా ఛార్జీలపై మినహాయింపు ఉంటాయి.

    7. ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్ (Family Savings Account)


    ఇది సాధారణ సేవింగ్స్ అకౌంట్‌కు మరొక రూపాంతరం. ఈ రకమైన సేవింగ్స్ అకౌంట్‌ ద్వారా మొత్తం కుటుంబం ఒకే సేవింగ్స్ అకౌంట్ నుంచి ప్రయోజనాలను పొందవచ్చు.

    Online Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు పోయాయా? ఇలా చేస్తే వెనక్కి వస్తాయి

    best savings account, best savings account 2021, online savings account, Savings account types, savings account vs current account, types of savings accounts, what is a savings account, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటీ, సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలు, సేవింగ్స్ అకౌంట్‌తో లాభాలు
    ప్రతీకాత్మక చిత్రం


    ఇవే కాకుండా వివిధ రకాల ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక అవసరాల కోసం సేవింగ్స్ అకౌంట్స్ అందుబాటులో ఉంచాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఆన్‌లైన్‌లోనే ఓపెన్ చేయగల ఇన్‌స్టంట్ సేవింగ్స్ అకౌంట్, ప్రత్యేక అవసరాల కోసం వినియోగించే ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్, ఎన్‌ఆర్‌ఐలు ఆపరేట్ చేసే NRE/NRO సేవింగ్స్ అకౌంట్.. వంటివి సైతం కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నాయి. నిర్దిష్ట అవసరాల కోసం ఖాతాదారులు వీటిని ఎంచుకోవచ్చు.

    సేవింగ్స్ ఖాతా తెరవడానికి కావలసిన అర్హతలు


    భారతీయ పౌరులు, భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు, ప్రవాస భారతీయులు, 18 ఏళ్లు నిండినవారు సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఏ అర్హతలు బ్యాంక్ ను బట్టి మారొచ్చు అనేది గమనించాలి.

    సేవింగ్స్ ఖాతాను తెరవడానికి కావాల్సిన పత్రాలు


    పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను ఏజ్, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అందించాలి. కనీసం 2 పాస్‌పోర్ట్-సైజు ఫొటోలు ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, యుటిలిటీ బిల్లు సమర్పించాలి. వృద్ధులు సీనియర్ సిటిజన్ కార్డ్ అందించాలి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సీనియర్ సిటిజన్ కార్డ్ జారీ చేస్తుంది. ఇది ఏజ్ ప్రూఫ్ చెక్ చేసేందుకు అవసరమవుతుంది.

    సేవింగ్స్ అకౌంట్ ఫీచర్లు & ప్రయోజనాలు


    ఖర్చులు పోను మిగిలిన డబ్బును నిల్వ చేయడానికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ చాలా సురక్షితమైన ప్రదేశం. సేవింగ్స్ అకౌంట్లో ఉంచే డబ్బుపై వడ్డీని పొందవచ్చు. ఈ వడ్డీరేట్లు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. సేవింగ్స్ అకౌంట్ సాయంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌కు సులభంగా యాక్సెస్ పొందవచ్చు. బ్యాంకులు కనీస త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్లకు లాకర్ రెంటల్ సౌకర్యాలపై డిస్కౌంట్లను అందిస్తాయి. చాలా బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్‌ హోల్డర్లకు వ్యక్తిగత ప్రమాదాలు మరణాలతో సహా వివిధ బీమా కవర్లను అందిస్తాయి. కస్టమర్లకు బ్యాంకులు అందించే డెబిట్ కార్డ్‌తో భారతదేశం అంతటా ఏటీఎంలను ఉపయోగించవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank account, BANK ACCOUNTS, Banking, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు