Home /News /business /

Interest Rates: ఈ బ్యాంకుల్లో రూ.1,00,000 దాచుకుంటే రూ.1,23,000 రిటర్న్స్

Interest Rates: ఈ బ్యాంకుల్లో రూ.1,00,000 దాచుకుంటే రూ.1,23,000 రిటర్న్స్

Interest Rates: ఈ బ్యాంకుల్లో రూ.1,00,000 దాచుకుంటే రూ.1,23,000 రిటర్న్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Interest Rates: ఈ బ్యాంకుల్లో రూ.1,00,000 దాచుకుంటే రూ.1,23,000 రిటర్న్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Interest Rates | మీరు మీ దగ్గర ఉన్న డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లో (Fixed Deposit Account) దాచుకొని మంచి వడ్డీ పొందాలనుకుంటున్నారా? ఏ ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయో తెలుసుకోండి.

    ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్లలో మూడేళ్ల పాటు రూ.1,00,000 దాచుకుంటే రూ.1,23,000 తిరిగి పొందొచ్చు. కొంతకాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్‌ను స్థిరంగా ఉంచింది. అంతకుముందు రెపో రేట్‌ను 4 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ రెపో రేట్ అంతే కొనసాగుతోంది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. కానీ... కొన్ని ప్రైవేట్ బ్యాంకులు 7 శాతం వరకు వడ్డీ ఇస్తుండటం విశేషం. మరి ఏ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువ వస్తుందో తెలుసుకోండి.

    Yes Bank: యెస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ బ్యాంకులో మీరు రూ.1,00,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత రూ.1,23,000 పొందొచ్చు. అంటే రూ.1,00,000 ఎఫ్‌డీ చేసినందుకు మూడేళ్లలో రూ.23,000 వడ్డీ లభిస్తుంది.

    SBI KYC Fraud: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... ఆ లింక్స్ క్లిక్ చేయొద్దని వార్నింగ్

    RBL Bank: ఆర్‌బీఎల్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ బ్యాంకులో మీరు రూ.1,00,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత రూ.1,22,000 పొందొచ్చు. అంటే రూ.1,00,000 ఎఫ్‌డీ చేసినందుకు మూడేళ్లలో రూ.22,000 వడ్డీ లభిస్తుంది.

    IndusInd Bank: ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ బ్యాంకులో మీరు రూ.1,00,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత రూ.1,21,000 పొందొచ్చు. అంటే రూ.1,00,000 ఎఫ్‌డీ చేసినందుకు మూడేళ్లలో రూ.21,000 వడ్డీ లభిస్తుంది. కనీసం రూ.10,000 ఫిక్స్ డిపాజిట్ చేయొచ్చు.

    DCB Bank: డీసీబీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.45 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ బ్యాంకులో మీరు రూ.1,00,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత రూ.1,21,000 పొందొచ్చు. అంటే రూ.1,00,000 ఎఫ్‌డీ చేసినందుకు మూడేళ్లలో రూ.21,000 వడ్డీ లభిస్తుంది. కనీసం రూ.10,000 ఫిక్స్ డిపాజిట్ చేయొచ్చు.

    EPFO Alert: వడ్డీ జమ చేస్తున్న ఈపీఎఫ్ఓ... పాస్‌బుక్ చెక్ చేయండి ఇలా

    IDFC First Bank: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ బ్యాంకులో మీరు రూ.1,00,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత రూ.1,20,000 పొందొచ్చు. అంటే రూ.1,00,000 ఎఫ్‌డీ చేసినందుకు మూడేళ్లలో రూ.20,000 వడ్డీ లభిస్తుంది.

    చిన్న ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్‌దారుల్ని ఆకర్షించేందుకు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. అయితే చిన్న బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేప్పుడు ఆ బ్యాంకు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సబ్సిడరీ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రూ.5,00,000 వరకు ఇన్స్యూరెన్స్ ఇస్తుంది. మీరు ఏ బ్యాంకులో అయినా అంతకన్నా ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయకపోవడం మంచిది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Banking, Fixed deposits, IDFC FIRST Bank, Investment Plans, Personal Finance, Rbi, Reserve Bank of India, YES BANK

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు