Gold Purity: మీ బంగారు నగల్లో నకిలీ గోల్డ్ ఉందా? ఇంట్లోనే చెక్ చేయండి ఇలా

Gold Purity: మీ బంగారు నగల్లో నకిలీ గోల్డ్ ఉందా? ఇంట్లోనే చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Gold Purity Check at Home | మీ బంగారు నగలు ఒరిజనలా కాదా అన్న డౌట్ ఉందా? నగల్లో గోల్డ్ నాణ్యతపై అనుమానం ఉందా? ఇంట్లోనే చెక్ చేయండి ఇలా.

  • Share this:
భారత దేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లి అయినా, పండుగైనా అందరూ పసిడి ఆభరణాలు కొనేందుకు ఆసక్తి చూపుతారు. పెట్టుబడిగానూ చాలా మంది గోల్డ్​ను కొంటారు. అందుకే మన దేశంలో బంగారం చాలా అపురూపం. అయితే బంగారం విషయం కొందరు మోసపోతుంటారు. కొందరు మాయమాటలు చెప్పి బంగారమంటూ నకిలీవి అంటగడుతుంటారు. చూసేందుకు బంగారంలా కనిపించినా అవి నకిలీవై ఉంటాయి. మరికొందరు తక్కువ ధరకే బంగారం ఇస్తామని ఆశచూపి అమ్ముతుంటారు. అలాంటి సమయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏది నకిలీదో.. ఏది అసలు బంగారమో కనిపెట్టగలగాలి. పసిడి నాణ్యతను మన ఇంట్లో ఉండే వాటితోనే పరీక్షించవచ్చు. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలివే..

అయస్కాంత పరీక్ష


స్వచ్ఛమైన బంగారాన్ని అయస్కాంతం ఆకర్షించదు. అయితే మిగిలిన చాలా లోహాలు అయస్కాంతానికి అతుక్కుంటాయి. అందుకే ఇంట్లో ఏదైనా బలమైన అయస్కాంత పదార్థం ఉంటే దాంతో బంగారానికి పరీక్ష పెట్టొచ్చు. బంగారం దగ్గరికి అయస్కాంతం తీసుకెళ్లినప్పుడు ఆకర్షిస్తే అది నకిలీదని అర్థం. ఒకవేళ అయస్కాంతం పెట్టినా.. ఎలాంటి ప్రభావం లేకపోతే అది స్వచ్ఛమైన బంగారం అని నమ్మవచ్చు. అయితే ఇంతటితో ఆగకుండా మరికొన్ని పరీక్షలు కూడా చేయాలి.

Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి

హాల్​మార్క్​


బంగారం నాణ్యతను దానిపై ఉండే హాల్​మార్క్ తెలియజేస్తుంది. బంగారు ఆభరాణాలు, బంగారు నాణేల క్వాలిటీని నిర్ధారించేందుకు బీఐఎస్​ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్​)ను కేంద్రం నెలకొల్పింది. బంగారంపైనే చిన్నగా ఈ బీఐఎస్ మార్కు ఉంటుంది. అందుకే దీని కోసం వెతకాలి. అమ్మే వ్యక్తి చెప్పేంత నాణ్యతతో బంగారం ఉందా అని చెక్​ చేసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణా​లకు అనుగుణంగా ఉంటేనే పసిడి కొనుగోలు చేయాలి.

యాసిడ్ టెస్ట్


నైట్రిక్ యాసిడ్​తోనూ బంగారం నిజమైనదో కాదో గుర్తించవచ్చు. నైట్రిక్ యాసిడ్ వేస్తే బంగారంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఈ టెస్టు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతులకు గ్లవ్స్​ వేసుకోవడంతో పాటు మాస్క్ ధరించాలి. మొదటగా ఆభరణంపై మెల్లగా గీకాలి. ఆ ప్రదేశంలో తక్కువ మొత్తంలో నైట్రిక్ యాసిడ్ వేయాలి. ఒకవేళ దానిపై కేవలం బంగారం కోటింగ్ మాత్రమే ఉండి లోపల వేరే లోహం ఉంటే.. యాసిడ్ వేసిన చోట ఆకుపచ్చగా మారుతుంది. ఒకవేళ నిజమైన బంగారమైతే ఎలాంటి రంగు మారదు. యాసిడ్ రంగులోనే నురగ వస్తుంది.

Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఆ రెండు సేవల్ని నిలిపేసిన UIDAI

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం... నెలకు రూ.30,000 ఆదాయం... బిజినెస్ ఐడియా ఇదే

వెనిగర్ టెస్ట్


దాదాపు అందరి వంటగదుల్లో ఉండే వెనిగర్​తోనే ఈ టెస్టు చేయవచ్చు. బంగారం మీద కొన్ని చుక్కల వెనిగర్ వేయాలి. ఒకవేళ అది నిజమైన బంగారం కాకపోతే ఆ వెనిగర్ చుక్కలు లోహం ఉన్న రంగులోకి మారిపోతాయి. ఒకవేళ డ్రాప్స్ కలర్ మారకుంటే అది నిజం గోల్డ్ అని అనుకోవచ్చు.

నీటి పరీక్ష


బంగారం చాలా దృఢంగా, బరువుగా ఉండే లోహం. అందుకే నీటితోనూ పరీక్షించవచ్చు. బంగారాన్ని నీళ్లు ఉన్న బకెట్​లో వేస్తే తప్పకుండా మునుగుతుంది. ఒకవేళ మునగకపోతే అది కచ్చితంగా నకిలీ బంగారం అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బంగారం నమ్మకమైన అమ్మకందారుల వద్ద కొనడమే మంచిది.

అయితే ఒక్క టెస్టు చేయడం ద్వారానే బంగారం అసలైనదని నిర్ధారించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ చేయడం మంచిది. ఒకవేళ అప్పటికీ అనుమానంగా ఉంటే జ్యువెలరీ షాప్స్​లో బంగారం నాణ్యతను చెక్ చేయించుకోవచ్చు. అయితే అనుమానం ఉన్న సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆభరణాలు కొనకూడదు. నాణ్యమైనదని నిర్ధారించుకున్నాకే కొనాలి.
Published by:Santhosh Kumar S
First published: