హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి

Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి

Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Name Update | ఆధార్ కార్డుపై పేరు మార్చడం చాలా సింపుల్. ఆన్‌లైన్‌లోనే ఆధార్ కార్డులో (Aadhaar Card) పేరు అప్‌డేట్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఆధార్ కార్డ్ తీసుకున్న కొత్తలో వివరాల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఎన్‌రోల్ చేసినవాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడైనా ఆధార్ కార్డ్ (Aadhaar Card) తప్పనిసరిగా అవసరం అయినప్పుడు తప్పులు గుర్తించి ఆధార్ అప్‌డేట్ (Aadhaar Update) చేసి వివరాలు మార్చుకుంటున్నారు. ఇలాంటి తప్పుల్లో పేరు తప్పుగా ఉండటం ఓ సమస్య. పేరులో అక్షరాలు మిస్ కావడం, అదనంగా అక్షరాలు రావడం, పూర్తి పేరు లేకపోవడం, కేవలం ఇనీషియల్‌తో పేరు ఉండటం లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయడం కాస్త పెద్ద ప్రాసెస్ ఉండేది కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో సులువుగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకుంటున్నారు.

మరి మీరు కూడా మీ ఆధార్ కార్డుపై తప్పుగా ఉన్న పేరును సరిచేసుకోవాలని అనుకుంటున్నారా? చాలా సింపుల్. ఆన్‌లైన్‌లోనే కొన్ని వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయొచ్చు. ఒకవేళ మీ పేరు మార్చాలనుకుంటే ఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... మార్చి 26న రోజున కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

ఆధార్ కార్డులో పేరు అప్‌డేట్ చేయండిలా

Step 1- ముందుగా https://ssup.uidai.gov.in/ssup/ పోర్టల్ ఓపెన్ చేయండి.

Step 2- ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

Step 3- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 4- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

Step 5- సర్వీసెస్ ట్యాబ్‌లో Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.

Step 6- ఆ తర్వాత Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.

Step 7- ఆధార్ కార్డులో ఉన్న మీ పేరు స్క్రీన్ పైన కనిపిస్తుంది.

Step 8- మీరు ఏ విధంగా మీరు పేరు మార్చాలనుకుంటే ఆ పేరు ఎంటర్ చేయాలి.

Step 9- అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

Step 10- ఆన్‌లైన్ అప్‌డేట్ కోసం రూ.50 చెల్లించి ప్రాసెస్ పూర్తి చేయాలి.

Fake Message: బ్యాంక్ అకౌంట్ ఉందా? ఈ మెసేజ్ నమ్మితే ఖాతా ఖాళీ

యూఐడీఏఐ 27 ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అప్‌డేట్ కోసం అంగీకరిస్తుంది. వాటిపై పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. పాస్‌పోర్ట్

పాన్ కార్డ్ , రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డ్, ఫోటో ఉన్న క్రెడిట్ కార్డ్ , కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చు.

First published:

Tags: Aadhaar Card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు