• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • DO YOU WANT TO BUY AUTOMATIC CAR KNOW BEST 5 MODELS UNDER RS 10 LAKH IN INDIA SS GH

Automatic Cars: ఆటోమెటిక్ కార్ కొంటారా? రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

Automatic Cars: ఆటోమెటిక్ కార్ కొంటారా? రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

Automatic Cars: ఆటోమెటిక్ కార్ కొంటారా? రూ.10 లక్షల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

Automatic Cars | మీరు ఆటోమెటిక్ కార్ కొనాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఇండియాలో రూ.10 లక్షల్లోపు ఉన్న బెస్ట్ ఆటోమెటిక్ కార్స్ గురించి తెలుసుకోండి.

  • Share this:
కరోనా విజృంభనతో వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు కార్లను లగ్జరీ సింబల్​గా చూసేవారు. కేవలం సంపన్నులు మాత్రమే కొనుగోలు చేసేవారు.. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, బడ్జెట్​ ధరలోనే కార్లు లభిస్తుండటంతో మధ్య తరగతి ప్రజలు సైతం వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వాహనాన్ని కొనుగోలు చేసే ముందు దాని ధరతో పాటు ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు చాలా మంది. ఈ ఆటోమేటిక్ కార్లకు సాధారణంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ కార్ల కంటే వీటి ధర కనీసం రూ. 1 లక్ష కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే, కొన్ని ప్రముఖ వాహన తయారీ సంస్థలు రూ.10 లక్షల్లోపే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కార్లను మార్కెట్​లోకి అందుబాటులోకి తెచ్చాయి. వాటిని పరిశీలిద్దాం.

మారుతి సుజుకి బాలెనో


ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన బాలెనో మోడల్​ రూ. 10 లక్షల్లోపే అందుబాటులో ఉంది. బడ్జెట్​ ధరలో లభించే ఈ ఆటోమేటిక్ వేరియంట్ సివిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడిన K12M మోటారుపై పనిచేస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రీమియం మోడల్​ అనుభవాన్ని అందిస్తుంది. కారు లోపల అందమైన ఇంటీరియర్​ డిజైన్​ కలిగి ఉన్న ఈ వాహనంలో ప్రీమియం కేటగిరీ వాహనంలో ఉండాల్సిన అన్ని ఫీచర్లను అందించారు. బడ్జెట్​ ధరలో ఆటోమేటిక్​ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్​ ఆప్షన్​.

Indian Railways: సరిగ్గా ఇదే రోజు పరుగులు తీసిన మొదటి రైలు... ఏ రూట్‌లో తెలుసా?

SBI: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందా? ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన బ్యాంకు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్


దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ 10 నియోస్ మోడల్​ ప్రీమియం లుక్​తో బడ్జెట్​ ధరలోనే రూపొందించబడింది. ఈ వాహనం ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT) ఆప్షన్​తో వస్తుంది. దీని ఇంటీరియర్​ డిజైన్​ ఆకట్టుకునే విధంగా ప్రీమియం లుక్​ అందిస్తుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు ఇంజన్ల ఆప్షన్లలోనూ లభిస్తుంది.

న్యూ హ్యుందాయ్ ఐ 20


దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ నుండి విడుదలైన సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వాహనం న్యూ హ్యుందాయ్​ ఐ 20. ఈ వాహన సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ఆప్షన్, డ్యూయల్-క్లచ్ ఆటో వెర్షన్​తో లభిస్తుంది. కొనుగోలుదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి సివిటి సమర్పణతో సహా అనేక వేరియంట్లలో లభిస్తుంది. డ్యూయల్ క్లచ్ గేర్‌ బాక్స్ ఆప్షన్​ కలిగిన ఈ వాహనం రూ .10 లక్షల్లోపే లభిస్తుండటం విశేషం.

RTGS Services: అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్... ఎప్పుడో తెలుసుకోండి

PAN Card: పాన్ కార్డ్‌లోని 10 డిజిట్స్‌కి అర్థం ఏంటో తెలుసా?

వోక్స్​వాగన్ పోలో


ప్రముఖ వాహన తయారీ సంస్థ వోక్స్​వాగన్ నుంచి విడుదలైన పోలో మోడల్​లో ఆటోమేటెడ్​ గేర్​ బాక్స్​ను అందించారు. ఇది 1.0 లీటర్ టిఎస్‌ఐ ఇంజిన్‌తో పాటు టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీనిలో విశాలమైన క్యాబిన్​ ప్రీమియం లుక్​ను అందిస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్


కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఇప్పుడు మునుపటి 1.2 హెచ్‌పి, 1.2 లీటర్ కె ఇంజిన్​ ఆప్షన్లతో పోలిస్తే శక్తివంతమైన 1.2- లీటర్ డ్యూయల్‌జెట్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ వాహనం ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT) ఎంపికలో వస్తుంది, ఇది సంతృప్తికరమైన పనితీరును అందిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: